Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#3
మనసు పలికింది ఈ మాట
అన్నెపూ
అచ్యుత్ చాలా టెన్షన్తో వైజాగ్ బీచ్ రోడ్ మీదుగా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వెనుక భూమి కదిలిపోతోందా అన్న కంగారుతో నడుపుతున్నాడు. స్పీడోమీటర్ లో ముల్లు విరిగిపోతుందా అన్న వేగంతో దూసుకుపోతున్నాడు. వైజాగ్ బీచ్ రోడ్ కి పక్కగా ఆనుకుని ఉన్న అపార్ట్మెంట్స్ లో ఉంటున్న రాజీవ్ ఇంటికి వెళ్తున్నాడు. బీచ్ కనపడేలా ఉంటుంది రాజీవ్ బెడ్ రూమ్.  కంగారుపడుతునే కాలింగ్ బెల్ మోగించాడు. రాజీవ్ తల్లి తలుపు తీస్తూ "నువ్వా అచ్యుత రావు , రా! " అంది లోపలికి దారి ఇస్తూ.  "అచ్యుత్ అనండి ఆంటీ " అంటూ లోపలికి నడిచాడు.  పేర్ల వెనకాల ‘రావు’ వాళ్ళ వంశానికి తరతరాలుగా వస్తున్న ఆనావయితి. అచ్యుత్ నాన్న పేరు ఆనందరావు, తాత పేరు సుబ్బారావు. ముత్తాత పేరు అప్పారావు. తనకు కొడుకు పుడితే వెంకటేశ్వర రావు అని పెట్టేద్దామని డిసైడ్ చేసేసారు. కొంచెం మోడరన్ యుగంలో గడుపుతున్న అచ్యుత్ ఇంకా తన వంశంలో ‘రావు’ ని రానీయకూడదని పెద్ద ఉద్యమమే చేస్తున్నాడు. అందుకే అచ్యుతరావు కాస్త అచ్యుత్ గా మార్చుకున్నాడు.  సరాసరి రాజీవ్ గది లోకి వెళ్లి పడుకుని ఉన్న రాజీవ్ పొట్టమీద ఎక్కి కూర్చుని"ఒరేయ్ లేరా, లేరా బాబు కొంపలంటుకు పోతున్నాయ్"అన్నాడు.  “పక్కనే సముద్రం ఉంది. కావలిసినన్ని నీళ్ళు, పట్టికెళ్ళి ఆర్పుకో" అంటూ నిద్ర మత్తుతోనే ఉచిత సలహా పారేసాడు.  "అబ్బ, లేరా. ప్లీజ్ ర, నా లైఫ్ ర!"  "ఏంటిరా పొద్దు పొద్దున్నే గోల "  "పొద్దు పొద్దున్నే ఏంటిరా టైం పది అయిందిర "  “ఓ అవునా!" మళ్ళిదుప్పటి ముసుగేసాడు.  "ఒరేయ్ లేరా! ఈ రోజు చైతన్యకి పెళ్లి చూపులటర.వాళ్ళ మామ్మ ఎవరో బకెట్ తన్నేయడానికి రెడీగా ఉందట. మనవరాలి పెళ్లి చూడాలనేది ఆఖరి కోరికట. అందుకే సడన్ గా ఈ పెళ్లి చూపులటర" అంటూ ఏడుపు కొట్టు మొహం తో ఏడుపు లేకుండా చెప్పాడు.  రాజీవ్ "అయితే ఇప్పుడు ఏమంటావ్?" అన్నాడు దుప్పటి ముసుగులోంచి.  "నేనింత టెన్షన్ పడుతుంటే ... ఏమైనా ఐడియా ఇవ్వర, పడుకోకురా " అంటూ మంచం మీంచి కిందకు లాగేసాడు.  "నీయబ్బ, ! నడుం విరిగిపోయింది "  "నాకు ప్రాణం పోయేట్టు ఉంది. మతిపోతోందిర, ఏమైనా ఐడియా చెప్పరా ప్లీజ్ "  "సరే ఏం చేద్దాం? చెడగొట్టేయాలా?" అన్నాడు రాజీవ్.  ఒక వెర్రి నవ్వు నవ్వేడు ఆ ఏడుపు కొట్టు ముఖంతోనే . "అవునురా, ఏమి చేద్దాం?"  రాజీవ్ నెమ్మదిగా పైకి లేస్తూ "ఇంతకి వాళ్ళ మామ్మ ఎక్కడుంది?"  "హాస్పిటల్ ఐ.సి,యు లో ...."  "పెళ్లి చూపులు ఎన్నిటికి?"  "సాయంత్రం 5 కి... ఏంటిరా ఈ ప్రశ్నలు?"  "ఐడియా కావాలా? వద్దా?" ఇప్పుడు తను తప్ప ఇంకెవ్వడు అచ్యుత్ని ఆదుకోలేడన్న ధీమాతో .  ఒకసారి ఫై నించి కిందవరకు చూసి "కావాలి "అన్నాడు అచ్యుత్,  బీచ్ వైపు చూస్తూ "సాయంత్రం సరిగ్గా పెళ్లి చూపుల టైంకి వాళ్ళ మామ్మకి సీరియస్ అని చైతన్య ఇంటి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి చెప్పు. ప్రస్తుతానికి బయట పడచ్చు." అంటూ సలహా ఇచ్చాడు.  ఎగిరి గెంతేసాడు పెళ్లి చూపులు ఎలా అయిన ఆపేయగలననే ఆనందంతో. 
*************
[+] 4 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:46 AM



Users browsing this thread: 1 Guest(s)