20-11-2018, 11:43 AM
"నువ్విక్కడ వున్నావేంటి.....మీ అన్న కదా వుండాల్సింది...?"అడిగింది అను
"సరే వుండు వాడ్నే పంపిస్తాను మా వదినొచ్చి నీకు బ్యాండ్ బాజా బారాత్ చేస్తుంది వాళ్ళ పుట్టింటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మరి...."అన్నాడు అరవింద్
"నాకేం అర్థం కాలేదు....అరవింద్..."అంది అను
"ఒసేయ్ మొద్దు పెళ్ళిచూపులకని వచ్చిన పెళ్ళికొడుకు నేనే నే......నీ లాగె నిన్ను మొదటిసారి చూడగానే పిచ్చి పిచ్చి గా లవ్ చేశాను...ఆ రోజు మనం బస్ లో కలసి నప్పుడు ముందు 4 రోజులు నాకు నిద్రలేదు అందుకే నిన్ను చూడాగానే నిద్ర ఆపుకుందామనుకున్నా నీతో మాట్లాడదామనుకున్నా కాని నా వల్ల కాలేదు....ఆ తర్వాత బస్ దిగాక నిన్ను ఫాలో చేశాను.....మీ నాన్నగారిని ఎక్కడో చూశాను అనిపించి మా ఇంట్లో ఫోటోలు అన్నీ వెతికితే మా అమ్మ-నాన్న పెళ్ళి ఫోటొళ్ళొ కనిపించారు వాళ్ళ బ్యాచ్ మేట్స్ అందర్ని కనుక్కుని వాళ్ళకి రీయూనియన్ ఏర్పాటు చేశాను నిన్ను కలవడం కోసం కాని నా బ్యాడ్ లక్ నువ్వప్పుడు రాలేదు......నేను నాన్నకి ఈ విషయం చెబుదామనుకున్నా కాని నాకొక జాబ్ వస్తే బాగుంటుంది అని ఇన్నాళ్ళు ఆగాను జాబ్ రావడం ఆలస్యం మా ఇంట్లో -మీ ఇంట్లో మాట్లాడాను....పెళ్ళి చూపులకన్నా ముందు నీతో టైం స్పెండ్ చెయ్యాలి అని అర్జెంట్ గా నిన్ను రమ్మని చెప్పి కాల్ చెయ్యించాను నీతో కలసి ట్రావెల్ చెయ్యాలని కార్ ప్లాన్ వేశాను నా బ్యాడ్ లక్ నాన్న డ్రైవర్ తో పాటు రమ్మని చెప్పేసరికి ఏమి చెప్పలేకపొయాను కాని నా అదృష్టం బాగుండి మనిద్దరం మాత్రమే ట్రావెల్ చేసె లా ఆ దేవుడు ప్లాన్ చేశాడు.......ఇంక నీ ఫ్రెంద్ తో సినిమా ప్లాన్ గురించి మాట్లాడడం విని నీ ఫ్రెండ్ ని అప్రొచ్ అయ్యి తను రాకుండా చేశాను.......ఇదంతా నీకొసమే చేస్తే ఇప్పుడెల్లి.....నువ్వు చెడగొట్టకు..."అన్నాడు అరవింద్...
అతను చెప్పడం పూర్తి చెయ్యడంతోనే అతన్ని గట్టిగా చుట్టెసింది అనుపల్లవి........
"కార్ లో నా కావాల్సిన బ్యాలెంస్ నాకివ్వవా...?"అనేసరికి అతని మీద ముద్దుల వర్షం కురిపించింది అనుపల్లవి........
*** THE END ***