Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#36
ఉదయం తనని వాళ్లింటి దగ్గర దింపేసి తను వెళ్ళిపోయాడు అరవింద్....
ఆ రోజు రాత్రి.......
గోడ దూకింది అను......తన కోసం బైక్ పైన వెయిట్ చేస్తున్నాడు సిద్ధు,.....చీకట్లో వాడి ముఖం కనిపించట్లేదు.....
"ఏంటి రా నీకు సెకండ్ షో కి తప్ప వేరే షో కి టికెట్లు దొరకవా....?"అంది అను....
వాడేమి మాట్లాడలేదు......థియేటర్ చేరుకున్న తర్వాత.....బైక్ పార్క్ చెయ్యడానికి వెళ్ళిపోయాడు సిద్ధు....తన కోసం వెయిట్ చేయసాగింది అనుపల్లవి..ఇంతలో సిద్ధు నుంచి కాల్ వచ్చింది...
"అను....సారీ రా.....అర్జెంట్ గా కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది సో రాలేక పోయాను...." అన్నాడు సిద్ధు
"ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు.....?"అర్థం కానట్టు అడిగిన అను... వెంటనే...." ఇప్పుడే గా ఇద్దరం థియేటర్ కి వచ్చాం....?"అంది...
ఇంతలొ తన వైపు వస్తున్న అరవింద్ ని చూసి "అరవింద్ నువ్వేంటిక్కడ...?"అంది అను
"మనిద్దరం కలిసేకదా వచ్చాం...."అన్నాడు అరవింద్....అప్పుడర్థమయ్యింది అనుకి తను సిద్ధు అనుకుని అరవింద్ బైక్ ఎక్కింది అని....
"ఓహ్ నేను నా ఫ్రెండ్ అనుకుని ఎక్కాను..పైగా చీకట్లో నువ్వు నాకు కనిపించలేదు కూడా...."అంది అను
"అవును...నువ్వక్కడ ఆ టైం లో ఏం చేస్తున్నావ్...?"అర్థం కానట్టు అడిగింది మళ్ళి
"నాకు నిద్రపట్టకపోతే అలా బయటకి వచ్చాను...ఇంతలో నువ్వొచ్చావ్......సెకండ్ షో అనేసరికి నాకర్థం అయ్యింది....థియేటర్ కి అని.....అందుకే దింపాను...ఏరి నీ ఫ్రెండ్స్...?"అడిగాడు అరవింద్
"మేము ముగ్గురం నేను-పర్ణిక-సిద్ధు వాళ్ళిద్దరు లవర్స్ ఇప్పుడు వాడికేదో పని పడింది అంట వాడు రావట్లెదు ఇక పర్ణిక అసలే రాదు......"అంది నిటూర్పుగా
"సరే పద ఇంతదూరం వచ్చాను నీతో మూవీ చూడలేనా...."అనేసరికి ఎగిరి గంతేసింది అను....రెండేళ్ళ క్రితం బస్ లో ఏదైతే రిపీట్ అయ్యిందో సినిమా హాల్లో కూడా అదే రిపీట్ అయ్యింది...(అను సినిమా చూడకుండా అరవింద్ నే చూసింది)
ఆ తర్వాత అరవింద్ అను ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు....ఆ మరుసటి రోజు ఉదయం 6:00 గంటలకే వాళ్ళమ్మ తనని లేపి...పెళ్ళి చూపులకని తయారు చేసింది.......
8:30 కల్లా పెళ్ళి వాళ్ళు వచ్చారు......వాళ్లని చూసి అనుపల్లవి పై ప్రాణాలు పైనే పోయాయి....
ఇద్దర్ని మాట్లాడుకొమ్మని రూం లోకి పంపించారు...ముందు అను తర్వాత అతను రూం లోకి వెళ్ళారు......అటు వైపు తిరిగిన అను అతనితో.....
"సారి అండి నేను మీ తమ్ముడ్ని ప్రేమిస్తున్నాను...తనని 2 ఇయర్స్ బ్యాక్ బస్ లో చూసినప్పుడే ప్రేమించాను ఆరోజు నుంచి ఈ రోజు దాకా తను మళ్ళి కలిసే అవకాశం రాదని తెల్సినా తననే ప్రేమించాను.....డెస్టిని నమ్మాను....అందుకు అనుగుణంగానే తను నాకు మళ్ళి కనిపించాడు తనని నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను....నేను ఇప్పుడు మీరు నచ్చలేదని చెబితే తనతో వుండె ఛాంస్ కూడా వుండదు...సొ మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పండి...లేకపోతే నేనే వెళ్ళి తనంటే ఇష్టమని చెబితే సరిపోతుందేమో.....అని అతని వైపు చూడకుండా బయటకి వెళ్తుండగా......తన చెయ్యి అతను పట్టుకోవడం తో చివుక్కున వెనక్కి తిరిగి చూసిన అనుపల్లవి తన ఎదురుగా వున్న అరవింద్ ని చూసి షాక్ అయ్యింది
"ఆమ్మా ఆత్రం రూం లోకి ఎవరొచ్చారో కూడా చూస్కోకుండా వాగటమేనా...?" అన్నాడు నవ్వుతూ
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:43 AM



Users browsing this thread: 5 Guest(s)