Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#35
నవ్వింది అను....ఇద్దరూ పరోట తిని మళ్ళి బయల్దేరారు......ఒక గంట గడిచింది...ఇద్దరూ చిన్నపట్టి విషయాల నుంచి అన్ని మాట్లాడుకుంటూ వస్తున్నారు.......

"అరవింద్ నువ్వెవరినైనా ప్రేమించావా....?"అడిగింది అను
"ప్రేమించావా ఏంటి...ప్రేమిస్తున్నాను..."అన్నాడు అరవింద్
అంతే గుండెల్లో ఒక విస్పోటనం జరిగింది అను కి.....అను ఏమి మాట్లాడకపోవడంతో...."ప్రేమిస్తున్నాను మా అమ్మ ని నాన్న ని అన్న ని" చెప్పాడు అరవింది.......
"ఉష్....నేను అన్నది అమ్మాయి ని...."అంది అనుపల్లవి
"అమ్మాయి అంటె.....హా కొన్ని సంవత్సరాల క్రితం ఒకమ్మాయిని లవ్ చేసాలే వన్ సైడ్ ....."అన్నాడు అరవింద్
తేలికగా ఊపిరి పీల్చుకుంది అను
"సరే కాని నువ్వెవరినైనా లవ్ చేశావా...?"అడిగాడు అరవింద్
"హా లవ్ యట్ ఫస్ట్ సైట్.....అంతకు మించి ఏం అడగకు....సరే గాని నేను డ్రైవ్ చేస్తాను...నువ్వు కొంచెం రెస్ట్ తీస్కో...."అంది అనుపల్లవి
"ఆర్ యూ ష్యూర్...?"అన్నాడు అరవింద్
"నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నువ్వు నిద్రకి ఆగలేవని ఐ కెన్ మ్యానెజ్ ఒక రెండ్ గంటలు నిద్రపో....ఆ తర్వాత నేనే లేపుతాను...."అని చెప్పేసరికి అరవింద్ కూడా కాదనలేదు....
తను స్టీరింగ్ తీసుకోవడం ఆలశ్యం.....అరవింద్ మత్తుగా నిద్రపోయాడు.......గంట గడిచింది......
"రేపు వెళ్లగానే ఇంట్లో నువ్వు నాకు నచ్చావని చెప్పేస్తాను ఎలాగో మావయ్య(అరవింద్ వాళ్ళ నాన్న) -నాన్న ఫ్రెండ్స్ ఎ కాబట్టి ఎం ప్రాబలం వుండదు.....నీక్కూడా ఏం ప్రాబలం లేకపోతే....నీపక్కన నేను ఇలాగే జీవితాంతం వుండొచ్చు....అని అనుకుని కార్ ఒక పక్కగా ఆపింది........
కాని ఈ లోపు.....ఈ రెండేళ్ళ నిరీక్షణ ని నేను ఒక పని చేసి సంతృప్తి పొందుదామనుకుంటున్నాను.....అని మనసులో అనుకుని...ఏం చెయ్యాలా అని ఆలోచించసాగింది......
అరవింద్ బుగ్గ మీద ముద్దు పెట్టి వెంటనే తన సీట్లొ నిద్రపోయినట్టు నటించాలి....ఒకవేళ అరవింద్ లేచిన నిద్రపోతున్న నన్ను చూసి ఏం చేశానో తనకి అర్థం కాదు......ఐడియా బాగుంది అనుకుని.......
అరవింద్ దగ్గరికి జరిగింది....అరవింద్ కి తనకి గ్యాప్ ఇంచులలో మాత్రమే.....తనని చూస్తూ ముద్దు పెట్టాలి అంటె భయమేసి.....కళ్ళు మూస్కుని ముందుకు జరగసాగింది....సరిగ్గా ముద్దు పెట్టె సమయానికి అరవింద్ అను వైపు తిరిగేసరికి ఆమె పెదవులు అతని పెదవులని ముద్దాడాయి.........
షాక్ తిన్న అను వెంటనే కళ్ళు తెరిచింది...తన పెదవులు అరవింద్ పెదవులపై వున్నాయి....అంతే వెను వెంటనే వెనక్కి తగ్గింది......తన గుండె మామూలు కంటే వేగంగా కొట్టుకుంటుంది అరవింద్ తన గురించి ఏమనుకుంటాడా అనుకుంటూ మెల్లగా కళ్లు తెరిచింది...అరవింద్ ఏమీ జరగనట్టు నిద్రపోతున్నాడు.....ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు తనకి కాని తను మంచి నిద్రలో వున్నాడని అందుఖె అర్థమయ్యి వుండదని సమాధానపర్చుకుంది.....
 
***





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:42 AM



Users browsing this thread: 1 Guest(s)