Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#34
ఆ రాత్రి మొత్తం అతన్ని చూస్తూ కాలం గడిపేసింది......అతని ముఖాన్ని గుండెల్లో నింపుకుంది......ఉదయన్నే అతన్ని ఫాలో చేసి అతని అడ్రెస్ కనుక్కుందామని మెంటల్ గా ఫిక్స్ అయ్యింది కాని తన దురదృష్టం......బస్టాండ్ కి వాళ్ళ నాన్న రావడం తో తన ప్లాన్ విరమించుకుంది...ఆరోజు నుంచి ఈరోజు దాకా అతని ముఖాన్ని ఆ రాత్రి సెల్ లో బంధించిన ఫోటో లో చూస్తూ గడిపేస్తుంది.......కాని ఇలా ఇన్నాళ్ళ తర్వాత తారాసపడతాడని కలలో కూడా ఊహించలేదు........
తనిలా గతం లో వుండగా....తన ఫోన్ మోగింది....అవతల తన ఫ్రెండ్ సిద్దు....
"హా సిద్ధు చెప్పరా...."అంది అను.....సిద్ధు తో ఒక పది నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టెశాక చూసింది అరవింద్ తననే చూడటం....తనకి కొంచెం ఇబ్బంది గా అనిపించింది.....
తను ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని అర్థమైన అరవింద్...."అనుపల్లవి....మీ నాన్నగారు మా నాన్నగారు చిన్నప్పుడు కలసి చదువుకున్నారు ఈ మధ్యే రీయూనియన్ లో కలుసుకున్నారు....."అన్నాడు అరవింద్...
"హో అవునా..."అంది అను
"మీరు ఈ టైం లో వూరికి ఎందుకు వెళ్తున్నారు...?"అడిగింది అను
"అది ఎల్లుండి అన్నయ్య కి పెళ్ళి చూపులు...సో..."జవాబిచ్చాడు అరవింద్....
"ఓహ్..."అంది అను అనునయంగా
"ఏంటి అను....పెళ్ళి చూపులకి కూడా వెళ్తారా తమ్ముళ్ళు అనుకుంటున్నావా...? "అన్నాడు అరవింద్...
"అయ్యొ అదేం లేదు...."ఆంది అనుపల్లవి
"అది ఆల్మొస్ట్ పెళ్ళి ఫిక్స్ అయినట్లే అందుకే మా వదినని చూడ్డానికి వెళ్తున్నా...." అన్నాడు అరవింద్....
"మరి నేను ఎలా...?"అర్థం కానట్తు అడిగింది అను
"నాన్నగారు నిన్ను కూడా తీసుకు రమ్మని చెప్పారు.....రీసన్ నాకు తెలియదు "అన్నాడు అరవింద్....
"హ్ం...అంది అను....
ఇంతలొ డ్రైవర్ కి ఏదో కాల్ రావడం తో కార్ పక్కకి ఆపి....ఫోన్ ఎత్తి విషయం కనుక్కున తర్వాత ఆయన ముఖం పాలిపోయింది....
"ఏమైంది బాబాయ్....?"అడిగాడు అరవింద్...
"అది...బాబు.....వత్సల(ఆయన కూతురు) కి పురిటి నొప్పులంట......మా ఇంటిది కంగారు పడుతూ ఫోన్ చేసింది....."అన్నాడాయన
"అయ్యొ బాబాయ్.....నువ్వెందుకొచ్చావ్ ఇలాంటి టైం లో......సరే పద మన సిటి దాటి గంట కూడా కాలేదు....నిన్ను హాస్పిటల్ లో డ్రాప్ చేసి మేము ఊరు వెళ్తాం..."అన్నాడు అరవింద్...
"అయ్యొ...వద్దు బాబు....ఏం కాదు మిమ్మల్ని ఊర్లో దిగబెట్టి అప్పుడు వెళ్తాను..."అన్నాడాయన
"అంకుల్ అలా అంటారేంటి...మీరు కార్ వెనక్కి తియ్యండి....."అని అను అంది....
అరవింద్ కూడా ఒత్తిడి చేయడంతో ఆయన వెనక్కి పోనివ్వక తప్పలేదు ఆయన్ని హాస్పిటల్ లో డ్రాప్ చేసి....ఖర్చులకు డబ్బులిచ్చి.....తిరుగు ప్రయాణమయ్యారిద్దరు... అరవిండ్ కార్ డ్రాప్ చేస్తున్నాడు.....
"అను ఏమైనా తిన్నావా...?"అడిగాడు అరవింద్....
"లేదు....ఇవాళ శనివారం కదా నేను శనివారాలు ఉపవాసం వుంటాను..."అంది అను
"హలో మేడం టైం చూశారా 1 గంట అంటె ఇవాళ ఆదివారం...సొ కార్ వచ్చే దాబా దగ్గర ఆపుతాను తిని వెళ్దాం...నో చెప్పకు..."అన్నాడు అరవింద్....
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:42 AM



Users browsing this thread: 1 Guest(s)