Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#33
అను-అరవింద్
"హా మా....వచ్చేస్తాను.....అయినా ఇంత సడన్ గా ఎందుకు రమ్మంటున్నారు నన్ను...?నాకర్థం కావట్లేదు...."అడిగింది అనుపల్లవి వాళ్లమ్మని...
"నువ్వు ముందు రా తర్వాత అన్ని నీకే తెలుస్తాయి"అని ఫోన్ కట్ చేసింది వాళ్ళమ్మ....
"ఏంటొ ఈ అమ్మలంతా ఇంతే...."ఆనుకుని బస్ స్టాండ్ లో వెయిట్ చేయసాగింది.....ఇంతలో తన ముందొక కార్ వచ్చి ఆగింది.....
వెనక డోర్ కి వున్న కార్ అద్దం కిందకి జరిగింది...లోపులున్న వ్యక్తి....
"మీరు అనుపల్లవి ఏనా...?"అని అడిగాడు...చీకట్లో అతని ముఖం సరిగ్గా కనిపించలేదు....
"హా....అవును..."అంది అను...
"గెట్ ఇన్ సైడ్ "అన్నాడతను...లోపల కూర్చుంటూ అప్పుడు చూసింది అతని ముఖం......ప్రపంచం స్తంభించి పోయింది ఒక్కసారిగా అతన్ని చూడగానే.........
అతని కళ్ళలోకి చూస్తూ అలానే వుండిపోయిన తనని ఈ లోకం లోకి తెస్తూ "హాయ్ దిస్ ఈస్ అరవింద్...."అన్నాడతను చెయ్యి చాస్తూ....
ఈ లోకం లోకి వచ్చిన అను....అతనికి ష్యాక్ హ్యాండ్ ఇస్తూ... "హాయ్... అను...అనుపల్లవి..."అంది....
అంతే అతను...తనకి కాల్ రావడం తో ఇయర్ ఫోంస్ తో మాట్లాడుతూ అవతల వైపున్న కిటికి లోంచి బయటకి చూస్తున్నాడు.......
కాని అను మాత్రం అతన్నే చూస్తుంది........
సరిగ్గా 2 ఏళ్ళ క్రితం........
ఇంట్లో పెద్దక్క పెళ్ళి వుండటంతో.....బస్ ఎక్కి కూర్చుంది అను.....సెల్ లో పాటలు వింటూ కాలేక్షేపం చేస్తుండగా...ఒక పది నిమిషాలకి తను పక్క వచ్చి కూర్చున్నాడు తను......సరిగ్గా పది నిమిషాల క్రితం అరవింద్ చూడగానే ఎలా స్థానువై పోయిందో రెండు సంవత్సరాల క్రితం తనని చూడగానే అలానే చూస్తుండిపోయింది.....ఏ అమ్మాయి కైనా చూస్తుండిపోవాలి అనిపించే ముఖ వర్చస్సు.....అల్లరి గా నవ్వే తన కళ్ళు......అవి చాలు అను అరవింద్ రెండు సంవత్సరాల క్రితం చూసినా ఇప్పటికీ గుర్తుండిపోయాడంటె అర్థం చేస్కోవచ్చు....
ఆరోజు తనని చూసిన క్షణమే తనతో ప్రేమ లో పడిపోయింది అనుపల్లవి....అతని పేరేంటొ తెలీదు....అతని తీరేంటొ తెలీదు...అయినా కూడా ప్రేమించేసింది.....ఒక్క క్షణం లో ప్రేమ పుట్టినా మాట్లాడడానికి ధైర్యం చేయలేదు......
అతను ఎక్కిన 20 నిమిషాల తర్వాత...
"ఎక్స్ క్యూస్ మీ..."అని అనుపల్లవి పిల్చాడతను....
ఆశ్చర్యం...ఆనందం కలగలిపిన సంగమం లో అను మునిగిపోయి......బయటకి పెగలని గొంతుతో...."హా...."అంది
"నేను వాటర్ బాటిల్ మర్చిపోయాను కోంచెం వాటర్ ఇస్తారా....?"అడిగాడు అతను
వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా అతనికి తన వాటర్ బాటిల్ ఇచ్చేసింది...తిరిగి దానిని తనకిస్తూ థ్యాంక్స్ చెప్పి నిద్ర కి ఉపక్రమించాడు అతను.....
ఆ రాత్రి అంతా ఇంకో మాట లేదు వారి మధ్య...కాని దానికి అను అంత బాధ పడనూ లేదు....
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:41 AM



Users browsing this thread: 2 Guest(s)