Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#31
"ఆ మాటా నేనే తన దగ్గరకి వెళ్ళి చెప్పాను, నీ కోసం అందరిని వదిలి వస్తాను స్వప్న మా అమ్మతో సహా" అని బతిమిలాడాను, కాని తను మాత్రం, "మీ అమ్మ అంగికారం లేకుండా మన పెళ్ళి జరగదు" అని నా మొహం మీదే చెప్పింది" అని చేతిలొ ఉన్న కుషన్ని నేల మిదకి విసిరి కొట్టాడు నీల్." మీ పంతాలు మీవి నా ఇష్టంతో ఇక్కడ ఎవ్వరికి అవసరంలేదు. నా మనసేంటో దానికి బాగా తెలుసు, నాకు ఏది నచ్చుతుందో నీకు బాగా తెలుసు అయిన ఇద్దరు నన్ను అర్దం చేసుకోరు. మీ ఇద్దరి మధ్య నేను ఎంత నలిగిపొతున్నానో తెలుసా అమ్మ, అస్సలు స్వప్న నాకు ఎందుకు నచ్చుతుందో తెలుసా??? తనలో నాకు నువ్వు కనిపిస్తావు అమ్మ, అచ్చు తను నీలగే నన్ను ప్రేమిస్తాది, చూసుకుంటది. తనను చూసినప్పుడు అంత నాకు నువ్వే గుర్తొస్తావు, అమ్మలాంటి అర్దాంగి దొరకడం అదృష్టం అంటారు కాని ఒకే మనస్థత్వాలు గల వాళ్ళు కలవలేరు అని ఆలస్యాంగా తెలుసుకున్నాను, నిన్ను ఒప్పించలేను, నిన్ను ఒప్పించకుండా తను రాదు, మీకు ఎలా చెప్పాలో అర్దం కావట్లేదు, స్వప్న కావాలా, నువ్వు కావాలా అనే ప్రశ్న వస్తే, ఎవరికి వారు త్యాగాలు చేస్తున్నారు, నాకు మీ ఇద్దరూ కావాలి, మీలో ఏ ఒక్కరూ లేకున్నా నా జీవితం అసంపూర్ణం. స్వప్న చాలా మంచిది అమ్మ, తను లేకుండా నేను బతకలేను, అలా అని నిన్ను బాధ పెట్టలేను. ఇంత కన్నా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు." అని అతని చెంప పై నుండి కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ అతని గదిలోకి వెళ్ళిపోయాడు.
కొడుకు మాటలతొ నిశ్చేష్టురాలైంది లీలవతి, అలానే సోఫాలొ కూలబడింది. ధర్మరావు దగ్గరగా వచ్చి లీలవతి భుజం పై చెయ్యి వేసాడు, ఆమె ఉలిక్కిపడి చూసి భోరున విలపించింది. "నేనెమైనా తప్పు చెసానాండీ, చుశారా వాడు ఎలా మాట్లాడుతున్నాడో" అని అంది. "చూడు లీల పిల్లలు ఒక వయసు వచ్చే వరకు మాత్రమే మన మాట వింటారు, తరువత వాళ్ళ ఇష్టంని మనం గౌరవించాలి. అయిన వాడు మన అనుమతి అడుగుతున్నాడు, ఆలోచించు ఆ తరువాత నీ ఇష్టం" అని తన కళ్ళ నీళ్ళు తుడిచాడు.
ఆ రోజు ప్రొద్ధున నీల్ లేచేసరికి లీలవతి చక్కగా స్నానం చేసి పూజ చేసి ఎక్కడికో వెళ్ళడానికి అన్నట్లు తయారైంది. ధర్మరావు కూడా రెడి అయ్యి టిఅవి చూస్తున్నారు. " నీల్ తొందరగా స్నానం చేసి రా బయటకి వెళ్ళాలి" అని అరిచింది లీలవతి. " ఎక్కడికి అమ్మ" అని సంశయిస్తునే అడిగాడు నీల్.
 
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:40 AM



Users browsing this thread: 2 Guest(s)