Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#30
కొన్ని నెలల తరువాత
 
"స్వప్న తొందరగా, ఫ్లైట్ కి లేట్ అవుతోంది" అని గట్టిగా అరుస్తున్నాడు నీల్. నీలం రంగు చిఫాన్ చీరలొ లూజ్ గా జడ వేసి వదిలేసి, అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటన్న స్వప్న "అబ్బ ఎందుకు అలా అరుస్తున్నవు మనిషిని పక్కనే పెట్టుకుని" అని నీల్ చెంప మీద గిచ్చింది. నీల్ స్వప్నని వెనక నుండి గట్టిగా హత్తుకుని తన చుబుకం ని స్వప్న భుజాలపై పెట్టి, ఆమె చెంప మీద ముద్దు పెట్టాడు. ఆమె ముందుకి తిరిగి, తన రెండు చెతులను నీల్ మెడ చూట్టూ వేసి నీల్ కళ్ళలోకి చూస్తూ "అబ్బాయి గారికి తొందరగా ఉందే" అని అంది. దానికి నీల్ ఏదో చెప్తుండగానె లీలవతి అరిచింది "నీల్ ఎంత సేపు రా, అమ్మ స్వప్న త్వరగా రండి లగేజ్ కార్ లో పెట్టిస్తున్నాను, ఒక సారి రీచెక్ చేసుకొండి" అని అంది.
నీల్ చెతుల్లో నుండి విడివడి " ఆ వస్తున్నా అత్తయ్య" అని బయటకి నడుస్తున్న స్వప్న చేతిని అతను పట్టుకుని ఆపాడు. "ఏమిటి" అన్నట్టు కనుబొమ్మలు ఎగరెసింది స్వప్న. ఆమెని దెగ్గరగా తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టాడు నీల్. స్వప్న తన్మయత్వం తో కళ్ళు మూసుకుంది. అతను ఆమెను ఒక రెండు నిముషాలు అలగే పొదివి పట్టుకుని గట్టిగా హత్తుకున్నాడు. "ఇంక వదులు, ఎవరైన వస్తే బాగోదు" ముందుగా తేరుకున్నా స్వప్న నీల్ తో అంది. "జీవితాంతం ఇలాగే ఉండిపొమ్మన్నా కూడా ఉండి పోతాను, తెలుసా!!!" అని ఆమె మెడ ఒంపులో తల దాచుకున్నడు నీల్. అతని తలని చేతుల్లోకి తీసుకుని తన పెదాలతో అతని పెదాలను సుతారంగా తాకి "మిగతాది అంతా కేరళలో" అనేసి గది బయటకి వెళ్లింది స్వప్న.
స్వప్న వెనకే వచ్చాడు నీల్. హల్లో అంతా హడవిడిలో ఉన్నారు ఒక పక్క స్వప్న వాళ్ళ నాన్నగారు లగేజ్ కార్లొ పెట్టిస్తున్నారు, మరో పక్క ధర్మరావ్ , లీలవతి ఇంటికి వచ్చిన కాలని వాళ్ళకి స్వప్న ని పరిచయం చేస్తున్నారు. అప్పుడు లీలవతి కళ్ళలో కనిపిస్తున్న మెరుపు, దర్మరావు మొహం లొ అగుపిస్తున్న అనందం అతన్ని అశ్చర్యానికి గురి చేసింది. స్వప్న ఎంతో మర్యాదగా, చిరునవ్వుతొ సమాధానాలు ఇస్తుంది. అదంతా అతనికి కళలా ఉంది. ఎంగెజ్మెంట్ జరగడం, పెళ్ళి, రిసెప్షన్ ఇప్పుడు హనీమూన్ కి కెరళకి వెళుతుండడం అంత కలగానే ఉంది. ఆ రోజు స్వప్న వెళ్లిపోయాక నీల్ ఇంట్లో జరిగిందంతా అతని కళ్ళ ముందుకు వచ్చింది.
*****
నీల్ ఇంటికి రావడమె మానేసాడు, వచ్చినా తినకుండా, ఎవ్వరితో మాట్లాడకుండా తన గదిలో పడుకునేవాడు. అప్పటికి వారం గడిచిన అదే పరిస్థితి. లీలవతికి ధర్మరావు కి ఎం చెయ్యాలో పాలుపోలేదు. నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నమే చేశారు కాని ఫలితం శూన్యం. ఒక రోజు లీలవతి గట్టిగానే నిలదీసింది. "ఆ అమ్మయిని మార్చిపో, నువ్వే ఇంతలా పాకులడుతున్నవ్, ఆమెకు నీ మీద అంతా ప్రేమ ఉంటే వచ్చెదే గా రాలేదు అంటేనే అర్దం అవుతుంది. నా మాట విను వదిలెయ్యి నాన్నా అమెను" అని నీల్ పక్కగా కుర్చుని చెప్పింది లీలవతి.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:39 AM



Users browsing this thread: 1 Guest(s)