20-11-2018, 11:39 AM
ఈలోపు లిలావతి హల్లోకి వచ్చింది." ప్రేమ పెళ్ళిళ్ళు మా ఇంటా వంటా లేవమ్మ, పెళ్ళి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని ఊరికే అన్నారా???, కులం, గోత్రం ఏంటో తెలియకుండా, అవి కలవకుండా ఎలా పెళ్ళి చేయండి అని అడుగుతున్నారు నాకు అర్దం కావట్లేదు. మాకు ఇష్టం లేదు, నిన్ను కోడలి గా అంగికరించలేము. మేము పెళ్ళి చెయ్యము, మాకు గౌరవం ఇవ్వాలి అనుకుంటే విడిపొండి స్నేహితులుగా, లేదూ, మీరు చేసుకోవాలి అనుకుంటే బయటకి వెళ్ళి చేసుకొండి." అని తన చీర కొంగుని తీసి కళ్ళని వత్తుకుంటూ చెప్పింది లీలవతి. నీల్ కూడా హల్లోకి వచ్చాడు. స్వప్న ఏమి మట్లాడాకుండా మౌనంగా కుర్చ్చుని దీర్గంగా ఆలోచిస్తోంది.
"మీ సమస్య ఎంటంటే కులం గోత్రం అవునా??? అని తలని ఎత్తకుండా జీర పోయిన లోగొంతు లో అడిగింది స్వప్న. గొంతు సవరించుకుని లేచి నిలబడింది. ఫ్యాన్ గాలికి తన ముంగురులు నుదుటి పై పడ్తుంటే తన కుడి చేతితో వాటిని వెనక్కి పెడుతూ, లీలవతిని చూస్తూ "అమ్మాయికి చదువు ఉందా, గుణం ఉందా అని చూడండి, మన కులమేనా, మన వాళ్ళేనా అని కాకుండా, ఎందుకంటే కులం అన్నం పెట్టదు, గోత్రం గౌరవం ఇవ్వదు. మన వ్యక్తిత్వం, గుణం మాత్రమే మనకి విలువని ఇస్తాయి అని మర్చిపోకండి. పెద్దవారు, మీకుచెప్పెంత దాన్ని కాదు, ఇవ్వాళ మీ గురించి మట్లాడేవాళ్ళే, రేపు ఇంకో కొత్త విషయం జరిగితే వేరేవాళ్ళ గురించి మాట్లాడతారు, అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం మీ ఆవివేకం. రేపు మీకు ఎదైన అయితే చుడాల్సింది ఎంత కాదు అన్న మీ కోడాలిగా నేనే, విడిపొండి అని చాలా తెలిగ్గా అన్నారు కాని విడిపోవాలి అని అనుకుంటే అస్సలు మేము మీ వరకు తీసుకొచ్చేవాళ్ళమే కాదు కదా ఆంటీ. ఇలాంటి ఒక రోజు వస్తుందని మూడు సంవస్సరాల క్రితమే నీల్ కి చెప్పాను, తను చాలా కాన్ఫిడెంట్ గా మా ఇంట్లో ఒప్పుకుంటారనీ చెప్పాడు. ఎందుకంటే మా ఇష్టంని కాదనరు అని నమ్మకం తో, మీకు మేము పిల్లలమే అయుండొచ్చు కాని మా వయస్సు చిన్న వయస్సు కాదు కదా తొందరపాటునిర్ణయాలు తీసుకోడానికి. మా చదువు మాకు కొంత పరినితి ఇచ్చింది, మా తల్లితండ్రులుగా మీ వళ్ళ మాకు కొంత సంస్కారము వచ్చింది. పెళ్ళి చేసుకోవాలి అనేది మా నిర్ణయం కాదు, మీరు నిర్ణయించమని మీ ముందు నిల్చున్నం. ఇక మీ ఇష్టం, మీ అంగీకరం కోసం ఎదురు చూస్తుంటాం, వస్తాను, నమస్తే" అని చేతులు జోడించి తన బ్యాగ్ తీసుకుని బయటకి వెళ్ళిపోతూ నీల్ కళ్ళలోకి ఒక క్షణం అగి చూసి "ఇంక నన్ను కలవాడనికి ప్రయత్నించకు నీల్, మీ అమ్మనాన్నలు ఒప్పుకునే వరకు" అని వెళ్లిపొయింది.
నీల్ అలాగే సోఫాలొ కూలపడిపోయాడు. లీలావతి, ధర్మరావ్ తో "చుశారా, ఎంత పొగరు ఉందో ఆ అమ్మాయికి, ఇలాంటి అమ్మాయిని చేసుకుని వాడు ఏం సుఖపడ్తాడు, పోని రా.. నీకు దాని కన్నా మంచి అమ్మాయిని, అందగత్తెని చూసి చేస్తాను??" అని గట్టిగా నీల్ కి వినపడేలా అరిచింది. ఏదో లోకం లో ఉన్నవాడిలా "ఎవరిని తెచ్చిన స్వప్నని మాత్రము నువ్వు తేలేవు అమ్మ" అని లీలవతిని చూసి "తను రమ్మంటే బయటకి వెళ్ళి చెసుకునేంత ప్రేమ ఉంది నాకు తన మీద, కాని మీ అంగీకరామే ముఖ్యం అని ఇక్కడి దాకా తీసుకొచ్చిన తనని బాధ పెట్టి పంపిచాం. చాలు అమ్మ ఇంక సంతొషమేగా" అనేసి వెళ్ళిపొయాడు.

###################