Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#28
బండి అగిన శబ్దానికి తుళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చింది స్వప్న. అది డబుల్ బెడ్రూం ఢాభా. ఇంటి ముందు పూలమొక్కలు పద్దతిగా అమర్చి ఉన్నాయి. గేట్ తీస్కొని లోపలికి వెళ్తే పెద్ద హాల్ లో సోఫా సెట్ ఉంది. స్వప్న ఇంట్లోకి వెళ్ళగానే లీలవతి ఎదురు వచ్చింది. స్వప్న పలకరింపుగా నవ్వినా, లీలవతి నవ్వకపోగా రుస రుసగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ ఉహించని పరిణామానికి స్వప్న మనసు చివుక్కుమన్న, అది తన మొహం లో కనపడనివ్వలేదు. ధర్మరావ్ కుర్చిలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. నీల్ స్వప్నని పరిచయం చేసాడు. స్వప్న మర్యాదపూర్వకంగా నమస్తే చెప్పింది. ఆమెను కుర్చోమని చెప్పి నీల్ ని వెళ్ళిపొమ్మని సైగ చేసాడు ధర్మరావ్ .

"చెప్పమ్మ, నీ గురించి" అని క్లుప్తంగా అడిగాడు ధర్మరావ్. తన పేరు, చదువు, ఉద్యోగం, అమ్మనాన్న, తన కుటుంబం గురించి వివరంగా చెప్పింది స్వప్న. ధర్మరావు పెద్దగా నిట్టూర్చి " నేను అడిగింది ఇవి కాదమ్మ, మీరు ఏంటి?" అని కుండ బద్దలు కొట్టాడు. స్వప్నకి మొత్తం చిత్రం అర్దం అయిపోయింది, అస్సలు వాళ్ళు తనని అక్కడికి పిలిపించిన కారణం అర్దం అయింది. "మీకు మీ అబ్బాయి చెప్పుంటాడుగ అంకుల్" అని స్వప్న సూటిగా చూస్తూ చెప్పింది. "చెప్పాడామ్మా, నీ గురించి మాకు చెప్పిన మా అబ్బాయి, నీకు మా గురించి చెప్పాలేదా, మీరు అనుకున్నంత మాత్రాన అన్ని జరిగిపోతాయి అనుకున్నారా. మేము ఏం సమాధానం చెప్పాలి మా చుట్టాలకి, మా చుట్టూ ఉన్న వాళ్ళకి, లవ్ మ్యారేజ్ లు ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, పెద్దలని కాదని పెళ్ళి చేసుకుని ఎంత మంది హ్యాపిగా ఉంటున్నారు???" అని ఒక విధమైన వెటాకారంగా అన్నాడు ధర్మరావ్.
" ప్రేమ పెళ్ళి అయిన, పెద్దలు కుదిరించిన పెళ్ళి అయిన సక్సెస్ అయింది అంటే ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, అర్దం చేసుకునే తత్వం,నమ్మకం మీద అధారపడి ఉంటుంది. పెద్దలని కాదని పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశం మాకు ఎంత మాత్రము లేదు, అదే చెయ్యాలి అనుకుంటే ఇక్కడి దాకా వచ్చి మిమ్మల్ని ఒప్పించాలి అనుకోము కదా అంకుల్. ఇక మీ అసలు సమస్య కి వస్తే ఈ రోజుల్లో కూడా పక్క వాళ్ళ గురించి మట్లాడుకోడానికీ అంత ఓపిక కాని తీరిక కాని ఇక్కడ ఎవ్వరికి లేదు" అని స్పష్టంగా ధర్మరావ్ కళ్ళలోకి చూస్తూ చెప్పింది. స్వప్న కళ్ళలోని తీవ్రతకు, మాటల్లోని గాంభీర్యానికి ఒక్క క్షణం ధర్మరావుకి నోట మాట రాలేదు. పక్క గదిలో నుండి వీళ్ళ మాటలని వింటున్న నీల్, లీలావతిలు కూడా అవాక్కయ్యారు."చిన్న విషయంకి చిన్న పిల్లలా అలిగే తను, ఒక్క మాట అంటేనే కళ్ళలోకి నీళ్ళు తెచ్చుకొనే తనలో ఇంత పరిపక్వత దాగి ఉందా. ఎప్పుడు గల గల ముద్దుగా ఉండే తన మాటల్లో ఇంతటి గాంభీర్యమా?" అని నీల్ మనసులోనే తనను అభినందించకుండా ఉండలేకపోయాడు.
"ఇప్పుడు మీ జెనరేషన్ పిల్లలకు అర్దం కాదు ప్రేమకి, పెళ్ళికి మధ్య దూరం ఎంతో. మీ పెళ్ళికి నేనే కాదు మా కుటుంబంలో మీ కుటుంబంలో కూడా ఎవరు ఒప్పుకోరు. మమ్మల్ని కాదని మీరు చేసుకుంటే రేపు ఏం జరిగిన దిక్కులేని వాళ్ళు అవుతారు. అంత మిమ్మల్ని వదిలేసుకుంటారు. చాలా కష్టపడాలి, అమ్మాయిగా నువ్వు ఎక్కువ బాధా పడ్తావ్. మేము ఒకట్రెండు సంవత్సరాలకు ఒప్పుకున్న మా చూట్టాల్లో ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారు. అప్పుడు నువ్వు వాడు బాధపడాలి మిమ్మల్ని చూసి మేము బాధపడాలి. ఇవన్ని మీరు అలోచించి ఉండరు. ఇంటర్ కాస్ట్ పెళ్ళి చేసుకోవడం మీకు గొప్ప అనిపిస్తుందేమో కాని మాకు కాదు. మీరు చేసిన పనికి మేము ఎందుకు అవమానం పడాలి." అని ముగించి రొప్పుతూ మంచి నీళ్ళు తాగడనికి బాటిల్ చేతిలోకి తీసుకున్నాడు ధర్మరావ్ .





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:38 AM



Users browsing this thread: 1 Guest(s)