Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#27
ప్రేమ
ఉదయం 7:30 మలక్ పేట లోకల్ బస్టాండ్.
చుట్టూ జనాలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఒక పక్కగా నలుపు రంగు హీరో బండి మీద కూర్చుని ఉన్నాడు నీల్. తెలుపు రంగు షర్ట్ కాకి రంగు పాంట్ లో రేబన్ గ్లాస్సెస్ తో చూడటానికి చామన ఛాయ అయిన మొహం లో ఒక రకమైన కళ దాగి ఉంది. అప్పుడప్పుడు చాలా అసహనంగా రోడ్డు కు అవతల వైపు చూస్తున్నాడు. అంతలోనే తన పెదలపై చిన్న చిరునవ్వు చేరింది. ఆ చిరునవ్వు కు కారణం స్వప్న. ఎల్లో కలర్ చుడిదార్ లో వాయ్ట్ కలర్ చున్నీ తో బుజానికి చిన్న హాండ్ బ్యాగ్ తో మెల్లిగా నడుచుకుంటూ వాహనాలను దాటుకుని నీల్ కి దగ్గరగా వచ్చింది. తన మొహం లో ఒక తెలియని బెరుకు కనిపిస్తున్న లయ్ట్ పింక్ కలర్ లిప్ స్టిక్ తో, చిన్న బొట్టు బిల్ల తో చాలా ముద్దు గా ఉంది. కొన్ని క్షణాలు తన మొహం వైపు తదేకంగ చూసి తన చేతిలోకి తన చేతిని తీస్కొని మెల్లిగా నొక్కి వదిలాడు. ఆ స్పర్శ కి స్వప్న కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అది గమనించిన నీల్ తన కి దగ్గరగ వచ్చాడు. స్వప్నకి నీల్ ఏం చేయబోతున్నాడో అర్దం అయ్యి ఒక అడుగు వెనక్కి వేసి తన చూపుడు వేలితొ కొడ్త అన్నట్టు చూపించింది. నీల్ నవ్వి తన చెయ్యి పట్టి ముందుకు లాగాడు. స్వప్న తుళ్ళి నీల్ మీద పడింది. అప్పుడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.
"నిజంగా మీ ఇంట్లో ఒప్పుకుంటారా నీల్" అని అడిగింది స్వప్న. " నా మీద నమ్మకం లేదా" అడిగాడు నీల్.
"ఉంది కాని నా మీద, నా లక్ మీద లేదు" నెమ్మదిగా తన కళ్ళను వింతగా తిప్పుతూ జవాబిచ్చింది.
"ఎవరు ఒప్పుకున్నా లేకున్నా ఎమనుకున్నా నిన్ను నేను చేసుకుంటాను సరేనా" అని తన బండి ని స్టార్ట్ చేసి స్వప్న ని కూర్చో అని సైగ చేసాడు. ఏదో మంత్రం వేసినట్టు ఎక్కి కూర్చుని చున్ని ని ముందుకు తీస్కొని పట్టుకుంది స్వప్న. బండి వేగం అందుకుంది, స్వప్న అలోచనలో పడింది.
నీల్ ది తనది ఏడు సంవస్సరాల పరిచయం. ఇద్దరు కాలేజ్ లో స్నేహితులు. తొలినాళ్ళలో స్వప్నకి నీల్ మీద సదభిప్రాయం లేదు కాని నీల్ కి మాత్రం స్వప్న మీద రోజు రోజు కి అభిమానం పెరుగుతూ వచ్చింది. అది ప్రేమగా మారడనికి ఎక్కువ సమయం పట్టలేదు. అదే విషయం స్వప్నకి చెప్పాడు. మొదట్లో స్వప్న ఒప్పుకోలేదు కారణం ఇద్దరి కులాలు వేరు. కాని మెల్లిగా నీల్ నిజాయితికి స్వప్న పడిపోయింది. ఎలాంటి పరిస్థ్తుల్లోను స్వప్నని వదలను అని మాట ఇచ్చాడు నీల్. రెండు సంవత్సరాల తరువాత నీల్ ప్రేమ ని అంగికరించింది. ప్రస్తుతం ఇద్దరు మంచి ఉద్యోగాల తో స్థిర పడ్డారు.
నీల్ వాళ్ళ ఇంట్లో వారి ప్రేమ విషయం చెప్పాడు. వాళ్ళ నాన్నగారి పేరు ధర్మరావు, అమ్మ లీలవతి. స్వప్న గురించి వివరాలు అడిగారు. నీల్ అన్ని విషయాలు తనకు తెలిసినంత వరకు చెప్పాడు ఆ ఒక్క విషయం తప్ప. అదే తన ప్రేమ కి అడ్డంకి అవుతుంది అని తను ఆ నిమిషం ఉహించి ఉండడు.
"అమ్మాయి మన వాళ్ళేనా ?" గద్దింపుగా అడిగాడు ధర్మరావు. "కాదు" ముక్తసరిగా సమధానం ఇచ్చాడు నీల్. వాళ్ళ నాన్న అరుపులతో, అమ్మ ఎడుపుతో పెద్ద యుద్దమే జరిగింది. నచ్చచెప్పాలని చాలా ప్రయత్నించినా నీల్ కూడా సహనం కోల్పోయాడు. వారి మాటకి మాట ఇవ్వడం లీలవతి జీర్ణించుకొలేకపోయింది. ఎట్టకేలకు అమ్మాయిని ఇంటికి తీస్కురమ్మని ధర్మరావు అడగడం తో స్వప్నని అతి కష్టం మీద ఒప్పించి ఇదిగో యిలా తీసుకుని వెళ్తున్నాడు.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:38 AM



Users browsing this thread: 4 Guest(s)