20-11-2018, 11:37 AM
నా చెయ్యి చేతిలోకి తీసుకుని మెల్లిగా నిమురుతూ "లేదు రా తప్పు నాదే, సారి సారి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను సరేనా, చూడు నిన్ను వదిలేస్తా అని ఎలా అనుకున్నవు నువ్వు నా ప్రాణం, నీకొసమేగా నిన్న నేను అన్న మాటలకు నువ్వు బాధా పడ్తవనేగా రాత్రికి రాత్రి దొరికిన బస్ పట్టుకుని వచ్చేసా " అని నా చెయ్యి మీద ముద్దు పెట్టాడు.
"ఇంకెప్పుడు అలా అనొద్దు, నాకు ఊపిరి ఆడదు, చంపేస్తా, నిన్ను ఇంక సతాయించనులే మారతాను, కాని కొంచెం సమయం కావాలి, అప్పట్లాగే లేనుగా ఇప్పుడు చాలా మారానుగా, ఇంకా మారాతాను పెళ్ళి అయ్యకా" అని చున్నితో కళ్ళు తుడుచుకున్న.
"పిల్లలు పుట్టాక ఇంక మారాతావా" అని చిలిపిగా చూస్తూ నా నడుము మీద గిల్లాడు.
"ముందు పెళ్ళి చేసుకోవయ్యా" అని అంతే చిలిపిగా గిచ్చాను. లేచి నిలబడి మెల్లిగా నడుస్తున్నాం తనే నా చెయ్యి పట్టుకుని అన్నాడు..
"ఎంత మంది పిల్లలు కావాలి" అని తన భుజం తో నా భుజన్ని తట్టాడు. "నువ్వు చెప్పు ముందు" అని అన్నాను.
"ఒక్కరు, ఎవరైనా పర్లేదు" అని అన్నాడు.
"నో ఇద్దరు కావాలి నాకు, ఒక బాబు, ఒక పాప " అని అన్నాను.
"వద్దు ఒక్కరు చాలు"
"ఉహూ ఇద్దరు కావాలి"
మా గొడవ ఇప్పట్లో తీరదులెండి, మా జివితాతం మేము అలాగే ఉండాలి. అమ్మాయి మనసు అర్దం కాదని అన్నవాళ్ళు ఎవరో కాని అర్దం చేసుకోవాలనే మనసు ఉంటే అర్దం అవుతుంది, మామూలుగా గొడవలు మనుషులను దూరం మాత్రమే చేస్తాయి అని అనుకుంటారంతా కాని మా విషయంలో గొడవలు మా మనసులను దగ్గర చేస్తాయి. తన మనసు నాకు, నా మనసు తనకు అర్దం అయ్యేలా చేస్తాయి.
మా గొడవలోపడి అస్సలుది మరిచాను ఇప్పటిదాకా.. నా పేరు, తన పేరు చెప్పనే లేదు కదా, నా పేరు సారిక, అతని పేరు సూర్య.
*** THE END ***