Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#25
తల విదిలించి మళ్ళీ చూసాను తనే, నిలబడి నావైపే చూస్తున్నాడు, నా కళ్ళలోకి నీళ్ళు చేరి అవి రెప్పలు, చెంపలు దాటి నా గుండెల్లోకి చేరాయి. అంతే ఒక్క ఉదుటునా తన షర్ట్ పట్టుకుని "వదిలేస్తావా నన్ను వదిలేస్తావా, విసుగొచ్చిందా నీకు నా మిద, విసిగిపోయవా నాతో" అని అరుస్తూ తన గుండెల మీద కొడ్తున్నాను, తను నా చేతులను ఆపి, నా తలని హత్తుకున్నాడు రోడ్డు మీద ఉన్నం అని గుర్తొచ్చి వెంటనే వదిలేసాను. పదా అని తన బండి మీద ఎక్కమన్నాడు. ఏమి మాట్లాడకుండా ఎక్కి కూర్చున్నాను.
బండి నెక్లెస్ రోడ్డు లో ఆగింది. కిందకి దిగి తననే చూస్తున్నాను, తనేం మాట్లాడట్లేదు, నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి ఏడ్చి ఏడ్చి పక్కనే ఉన్న బెంచ్ పై కుర్చోపెట్టి నీళ్ళ బాటిల్ నోటికి అందిన్చాడు, ఎక్కిళ్ళ ఏడుపు వల్ల ఎక్కువ తాగాలేకపోయా, నా పక్కనే కుర్చొని నా భుజం పై చెయ్యి వేసాడు, నేను తన కళ్ళలోకి చూసా. తన చూపుడు వేలితో నా బుగ్గలపై ఉన్న కన్నిళ్ళను తుడిచి, నా మెడ వెనక చెయ్యి పెట్టాడు తన చేతిలో నా తలని ఒంపి కళ్ళుమూసుకున్నాను.
" పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నవే, కోపం వచ్చింది నీకు, తిట్టింది నన్ను, ఏడుస్తొంది కూడా నువ్వేనా, నువ్వు ఎడుస్తే నేను అస్సలు తట్టుకోలేను, నిన్ను బాధపెట్టాను కదా సారి, ఏదో కోపం లో అన్నాను అంతే కాని నిన్ను బాధ పెడదామని కాదు. నువ్వు కూడా ఈ మధ్య చాలా విసిగిస్తున్నావురా, నేను కాదు అంటే అవును అని, అవును అంటే కాదని అంటున్నావు, నీతో ఏది మాట్లాడలన్నా తప్పుగా అర్దం చేసుకుంటావేమో అని అబద్దాలు అడాల్సి వస్తొంది, నా ఖర్మ కి ఉరికెనే దొరికిపోతున్నా, నేనేం చేసిన తప్పు అంటావు, చెయ్యకున్నా తప్పు అంటావు, చెప్పింది చెయ్యాలంటావు, చెప్పింది మాత్రమే చేస్తావా అంటావు, నువ్వు ఏంటో, నీ మనసు ఎంటో అర్దం కావట్లేదు. కనీసం నీకు ఏం కావాలో నేనేం ఇవ్వాలో కూడా అర్దం కావట్లేదు, ఏ విషయానికి ఎలా స్పందిస్తావో, ఎలా తీసుకుంటావో కూడా తెలీదు" అని నా మొహం మీద పడుతున్న ముంగురులను పక్కకి తీసి "చెప్పు" అని నా చెవిలో అన్నాడు.
"ఎం చెప్పాలి, అదే నా మనసు, ఆడపిల్లని రా, నాకు అబద్దం చెప్పిన ప్రతిసారి నాకు భయం, ఎక్కడ ఇలాంటి చిన్న విషయాలకే అబద్దాలు ఆడుతున్నవంటే పెద్ద విషయాలకు కూడా ఆడుతున్నావేమో అని, నాకు అర్దం చేసుకోడం రాదని నువ్వు తప్పుగా అర్దం చేసుకుంటే నాది కాదు కద తప్పు" ఏంటీ ఈ ప్రస్తావనొచ్చింది, తన వైపు చూసా సిరియస్గ వింటున్నాడు, మళ్ళి మొదలెట్టాను.
" నీకు విసుగురాడానికి నిన్ను ఎప్పుడైన నాకు ఇది కావలి, అది కావలి, షాపింగ్కి తీసుకెళ్ళు అని అన్నానా, లేదా సినిమాలు షికార్లు అని డబ్బులు ఖర్చు పెట్టించానా లేదు కద, నేను అడిగేది ఏంటి 'నాతో ఫోన్ లో మాట్లాడు, మెసేజ్ చెయ్యి అనే కదా, నువ్వు ఎక్కడో బెంగుళూరులో ఉంటావు, నేను ఇక్కడ, మనిద్దరి మధ్య వారధి మాటలే కద, ఏమైన చెప్పు అంటే, ఏమి చెప్పాలి అంటావు లేదా ఏమి లేదు అంటావు, అలా అంటే నాకెలా ఉంటది.. నీకు ఇంట్రెస్ట్ లేదేమో అనే కదా, అందుకే తిడతాను" అని కళ్ళు మూసుకుని ఒక గుటక వేసి..
"అవును అంటే కాదని అన్న కూడా నీకు నచ్చిందే చేస్తానుగా ఫైనల్ గా, అది కనిపించలేదా, విసిగిస్తున్నా అంటావా, అవును కాని మా నాన్న తర్వాత నేను అలా చిన్నపిల్లలా ప్రవర్తించేది నీ దగ్గరనే, నాకు నాలా ఉండడం ఇష్టం నీతో, నీకెప్పటికి అర్దం అవుతుంది రా, నువ్వు ఏమన్నా ఏమి చేసిన నువ్వు కావాలి, నువ్వే కావాలి అని నీకోసమేగా ఏడుస్తొందిస్తోంది, నువ్వు అబద్దాలు ఆడినా, తిట్టినా, నేను అడిగింది చెయ్యకున్నా, వస్తాను అని చెప్పి రాకున్నా గొడవపడ్డానే తప్ప నీలాగా వదిలెయ్యి అనలేదుగా???, ఒక్క రోజైనా మాట్లడకుండా ఉన్నానా నీతో???? చెప్పు మాట్లాడవేం ???" అని కనుబొమ్మలు ఎగరేస్తూ, ముక్కు తుడుచుకున్నాను.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:36 AM



Users browsing this thread: 1 Guest(s)