Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#23
నా చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కాడు, నా నరాలు బిగుసుకున్నయి. "నా జీవితంలో అముల్యమైనది ఏదైన ఉందంటే అది నువ్వే, నీతో గడిపిన కాలమే, నా జీవితం ఇది అని చెప్పటానికి వస్తే అది నీకు ముందు నీ తర్వాత అనే చెప్తా" అన్న తన కళ్ళలో నీళ్ళు నా కంటిని వదిలిపోలేదు.
ఆ రోజు నుండి తనతో నా బంధం ముడిపడిపోయింది, తను నా దినచర్యగా మారిపోయడు. రోజు ఆఫీస్ కి వెళ్ళేప్పుడు, తిరిగి ఇంటికి వచ్చేప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవడము, ఇంట్లో ఉన్నప్పుడు మెసేజ్లు చేయడం, వీలు ఉన్నప్పుడల్లా ఆఫీస్ పని వేయించుకుని మరి బెంగుళూరు నుండి నన్ను చూడడానికి వచ్చేవాడు, ఆ రెండు రోజులు నాకు గంటలు నిముషాలు అయిపోయేవి, తిరిగి తను వెళ్ళే ముందు ఏడవకుండా ఉండని రోజు లేదు, మిగత రోజులు తను ఎఫ్ఫుడు వస్తాడా అని ఎదురు చూడడమ్లో గడిచిపోయేవి.
ఒక్క పూట తను నా ఫోన్ ఎత్తకున్నా, మెసేజ్ కి రీప్లై ఇవ్వకున్నా కంగారు పడేదాన్నీ, ఎందుకు చెయ్యలేదు అని గొడవపడేదాన్ని. తను బిజీగా ఉండి 'తర్వాత చేస్తా' అని చెప్పి చెయ్యకున్నా కూడా గొడవ పడేదాన్ని. మరి నా గొడవలో నా కోపం తప్ప నా ప్రేమ తనకి కనపడిందో లేదొ నాకు తెలియలేదు కాని "విసిగిపోయాను" అనే మాట గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు కాకవికాలం అవుతొంది.
అప్పుడప్పుడు తను నాకు అబద్దాలు చెప్పేవాడు, చెప్పిన రోజే దొర్కిపోవడం తన స్పెషాలిటి, దొర్కినఫ్ఫుడు బాగా సతాయించేదాన్ని, కావాలని గొడవ పెద్దది చేసి కొపంలో ఎంత మాట వస్తే అంత మాట అనేదాన్ని, ఓపిగ్గా సముదాయించేవాడు, వినేదాన్ని కాదు, ఇక అరిచేవాడు, తిట్టేవాడు నేను ఎడ్చేదాన్ని, తను మళ్ళీ కరిగిపోయేవాడు, బతిమిలాడేవాడు, నేను మాములు అయ్యేదాన్ని. నా సతాయింపులో ఒక అర్దం ఉంది తన పై ప్రేమ ఎక్కువ అయ్యి ఎలా చుపించాలో తెలీక అలా.
'నేనంటే నీకెందుకు ఇష్టం' ఈ ప్రశ్న తనని చాలా సార్లు అడిగా, అడిగిన ప్రతిసారి తన సమాధానం ఒక్కటే "తెలీదు" అని నా కళ్ళలోకి చుస్తూ నా నుదుటి మీద ముద్దు పెట్టేవాడు.
అంతే గుండె బరువెక్కింది నిద్ర తేలిపోయింది. గడియారం వైపు చూసా 3 అవుతొంది. తనేం చేస్తుండొచ్చు ఈ సమయం లో పడుకుని ఉంటాడా??????,
ఇంత గొడవ అయిన కూడా, నాకు కోపం వచ్చి ఫోన్ పెట్టేసిన తను మళ్ళీ ఎందుకు చెయ్యలేదు???? అంటే నిజంగానే వదిలేస్తాడా????
అమ్మో నా గుండె జల్లుమంది, చీ చీ తనలాంటి వాడు కాదు!!!! ఏమో ఎవరికి తెలుసు, మగాళ్ళను నమ్మిందెవరు ????
వదిలేసేవాడు అయితే ఇన్ని రోజులు ఉండేవాడు కాడు కదా!!!!! దేని కోసం ఉన్నాడో, "అది" కుదరట్లేదు అని ఏమైనా వదిలించుకునే ప్రయత్నమా????
అవును, అవును, అదే, అధే అయ్యుంటాది, చాలాసార్లు ముట్టుకోడానికి, పట్టుకోడానికి చుసేవాడు "ఆ" విధంగా మాట్లాడడానికి చుసేవాడు కాని ఎక్కడ, ఎప్పుడు నా పరిమితులు దాటలేదు.!!!
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:35 AM



Users browsing this thread: