Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#22
నా మనసు
 
"ఎంత మాట అన్నాడు, 'నన్ను, నన్ను పట్టుకుని విసుగు పుడుతోంది వదిలెయ్యీ'అని అంటాడా అంత మాత్రానికి అస్సలు నా వెంట మూడు సంవత్సరాలు ఎందుకు తిరగాలి, నేను ఒప్పుకోనప్పుడు నేనేమన్న పట్టించుకోని మనిషి ఇప్పుడు ఇలా ఎలా మట్లాడుతున్నాడు" ఉబికి వస్తున్న కన్నిళ్ళను దిగమింగుతూ అనుకున్నాను.
గడియారం వైపు చూసాను అర్దరాత్రి 12 కి దగ్గరగా ఉంది, కళ్ళ వెంట నీళ్ళు దారళంగా కారుతున్నాయి. "అస్సలు అంత మాట అనడానికి పెద్ద విషయం ఏం జరిగింది అని, అవును గొడవ అయ్యింది, నేను తిట్టాను అయితే అలా మాటలు అంటాడా" అని కళ్ళు గట్టిగా మూసుకున్నాను. "మా పరిచయం ఎలా జరిగింది, తను నా స్నేహితురాలికి స్నేహితుడు, రెండు మూడు సార్లు కలిశాను " అలా ఒక్కొక్క సంఘటన నాకు తెలికుండానే నా తలలోకి, నా తలపులలోకి వచ్చేసాయి.
నన్ను చూసిన వెంటనే ప్రేమ పుట్టింది అన్నాడు, ప్రేమిస్తున్నా అని మోకాలి మీద కూర్చోని అదేదో సినిమలో చూపిన విధంగా పువ్వు చేతిలో పట్టుకుని చెప్పాడు, కాసేపు అర్దం కాలేదు, ఏమి చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోయా.
అప్పటి నుండి అతను వస్తున్నాడు అంటే చాలు నా స్నేహితులను కలవడానికి కూడా వెళ్ళేదాన్ని కాదు, అఖరికి సినిమాకి అని అడిగిన వెళ్ళడం మానేసా.
కాని తను విడవలేదు రోజు పొద్దున్నే ఒక మెసేజ్, రాత్రి ఒక మెసేజ్ పంపేవాడు, నా ఫ్రెండ్స్ వద్దన్నా నన్ను పిలవమని అడిగేవాడంట, అలా వారి బలవంతం మీద చాలా సార్లు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళీన ప్రతిసారి నాతో మాట్లాడాడానికి ప్రయత్నించేవాడు. కావాలని తాకేవాడు, నా కోపం తారాస్థాయికి చేరుకునేది, బాగా తిట్టేదాన్ని. అయినా మళ్ళీ మాములే, బతిమిలాడేవాడు గంటలు కాదు,రోజులు కూడా ఉన్నాయి.
తనంటే మెల్లిగా ఇష్టం మొదలైంది, తన ఉద్యోగం పని మీద బెంగళూరులో ఉండేవాడు అయినా నాకు కాల్స్ చేసే వాడు, అప్పుడప్పుడు తన రాక కోసం ఎదురు చుసేదాన్ని, వచ్చాక షరమాములే అలక, మాట్లాడకుండా ఉండడం, ఎందుకో అలా బాగా నచ్చేది, నేనేం చేసినా నావైపు మాట్లడేవాడు. చిన్న మాట కూడా పడని తను, నా ముందు నేనేమన్నా కూడా పడటం, ఆ ఒర్పు, అస్సలు నన్ను భరిస్తూ, నన్ను ఒక భారంగా అనుకోని తన ప్రేమ మీద గౌరవం కలిగింది. ఆ విషయం తనకి చెప్పే రోజు కూడా వచ్చింది.
ఫిబ్రవరి 22, 2014 నా మనసులో శిలా ఫలకం మిద లిఖించబడిన రోజు. తనని కలుస్తున్నా అని ముందు రోజే చెప్పాను. ఆరోజు నాకు ఇష్టమైన తెలుపు రంగు చుడిదార్ వేసుకుని, నాది పొడుగు జుత్తు కావడం తో చిన్న క్లిప్ పెట్టి వదిలేసాను, అద్దంలో ముఖం చుసుకున్నాను చాలా అందగా అనిపించా, పెద్ద కళ్ళు, కళ్ళకు కాజల్, చిన్న పెదాలు, పెదాలకు లిప్ గ్లస్ తో గులాబి రంగులో ఉన్నాయి, మెడలో లాకెట్, చెవులకు వెండిలాంటి పెద్ద బూట కమ్మలు , అప్పుడే నా మొబైల్ రింగ్ అయింది, స్క్రీన్ మిద తన పేరు చూడాగానే పెదాలపై నవ్వు, కట్ చేసి మెసేజ్ పంపించా, కమింగ్ అని.
అమ్మకి చెప్పి బ్యాగ్ తీసుకుని బయటకి నడిచా. వెళ్ళేసరికి తను తన బైక్ మీద కుర్చోని ఫోన్ మాట్లడుతున్నాడు, నన్ను చుడగానే లేచి నా వైపే చూస్తూ ఫోన్ కట్ చేసాడు. అతని దగ్గరగా వెళ్ళిన తర్వాత కూడా కన్నర్పకుండా చుస్తూనే ఉన్నాడు, నేను చిటికేసి వెళ్దామా అని అడిగెంత వరకు. "ఎక్కడికి వెళ్ళాలి "అని అడిగాడు. "ఎక్కడికైనా నీ ఇష్టం అన్నాను, ఒక కాఫి షాప్ లో కుర్చున్నాం. చెప్పు అన్నట్టు చూసాడు, ఏం చెప్పాలో ఎలా మొదలెట్టాలో అర్దం కాలేదు చాలా అసహనంగా కదిలాను. అతని కళ్ళు మాత్రం నన్ను కొరుక్కుతినేల నా వైపే చూస్తున్నాయి. "నన్ను జీవితంతాం భరించగలవా "అని అడిగాను నా కింద పెదవిని కొరుక్కుంటూ బయటకి చూస్తూ..





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:34 AM



Users browsing this thread: 1 Guest(s)