Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy స్వామి నిత్యానంద (short story)
#87
కొద్దీ రోజుల తర్వాత మనోడు అమెరికా యూరోప్ ల్లో తన ఆశ్రమాలు స్టఘపించి చూసుకుంటున్నాడు .కానీ అక్కడ లాజిక్ ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది భక్తులు లేరు .

కానీ మనోడు యోగాసనాలు ,సేవ కార్యక్రమాలు చేయటం వాళ్ళ ఆ సెక్షన్ ప్రజల వరకు బాగానే ఉంటోంది .
ఇక్కడ బాగా డబ్బు సంపాదించి అక్కడ దాచుకోవాలి అనుకునే వారికీ తన ఆశ్రమాలు వాడుకోవడానికి అనుమతి ఇచ్చాడు నిత్యానంద .
రెండు సంవత్సరాలు ఇలాగె గడిచింది ,అమెరికా లోకల్ ఎలక్షన్స్ లో కొంత మందికి ధన సహాయం కూడా చేసాడు మనోడు .
&&
ఒక రోజు అమెరికా లో ఉన్న ఒక సంఘం వాళ్ళు పిలిస్తే వెళ్ళాడు నిత్యానంద ,అతనితో పాటు kb పాల్ అనే పెద్ద మనిషిని కూడా పిలిచారు వాళ్ళు .
ఇద్దరి ని ఆధ్యాత్మిక విషయాలు అడగాలని వాళ్ళ ఉబలాటం .
నిత్యానంద చచ్చానురా బాబోయ్ అనుకున్నాడు ,కానీ జనం ఎక్కువగానే ఉన్నారు .
"ఈ జీవితం మిధ్య అంటారు నిజమేనా "అడిగాడు ఒకడు .
"మిధ్య కాదు దేవుని ప్రేయర్ చేయడానికి వాడుకోవాలి "అన్నాడు kb పాల్ .
"మిధ్య అని తెలిస్తే నిజమే "చెప్పాడు నిత్యానంద .

"మనిషి కి ఈ బాధలు ఎందుకు "అడిగాడు ఇంకో మనిషి .
"పాపం చేసాము మనం ,ప్రేయర్ ద్వారా దేవుని హెల్ప్ తీసుకోవాలి "చెప్పాడు పాల్ .
"పాపమ్ పుణ్యం ఎదో ఒకటి మనిషి చేస్తూనే ఉంటాడు ,ఆగలేడు,అంత దమ్ముంటే పుణ్యాలే చేసుకోండి ,లేదంటే దేవుడి మీద భారం వేసి మౌనంగా ఉండండి 'చెప్పాడు నిత్యానంద

"ఈ మానవ సమాజం సుఖం గ ఎప్పుడు ఉంటుంది "అడిగాడు ఒక రాజకీయ వేత్త .
"నేను మీరు కలిసి ఒక పార్టీ పెట్టి ప్రజలతో దైవ ప్రార్థన చేయిద్దాం అప్పుడు అంత సుఖం గ ఉంటారు "అన్నాడు kb  పాల్ .
"సమాజం మొత్తం సుఖం గ ఉండాలి అనేది జరగని పని "చెప్పాడు నిత్యానంద
"మేము ప్రయత్నం చేస్తున్నాము "అన్నాడు రాజకీయవేత్త .
"మేము కూడా శాంతి కోసం సహాయం చేస్తున్నాము "అన్నాడు పాల్
"మంచిదే దాని వల్ల కొందరికైనా మంచి జరుగుతుంది ,మొత్తం అందరిని చూడాలంటే అది దేముడి వల్లే అవ్వాలి "అన్నాడు నిత్యా .

"మన అందరిని దేముడు చూస్తుంటే ఇన్ని అరాచకాలు హింస కష్టాలు ఎందుకు ఉన్నాయి "అడిగాడు ఒక జర్నలిస్ట్ .
"అందుకే ప్రేయర్ చేసి దేవుని కోసం మనసుని సిద్ధం చేయాలి ,అప్పుడు దేముడు అందరిని చూస్తాడు "చెప్పాడు పాల్ .
"ఈ హింస ను సృష్టించింది దేముడే అని నేను అంటాను "చెప్పాడు నిత్యా .
హాల్ సైలెంట్ అయ్యింది .
"అంటే ఈ దరిద్రాలు హింస అరాచకాలు అన్నిటి వెనక దేముడు హస్తం ఉందని మీ ఆలోచనా "అడిగాడు ఒక ప్రొఫెసర్ .
"నేను ఒప్పుకోను ,పాపం వల్లే ఇవన్నీ ఉన్నాయి ,దేముడు రక్షకుడు "చెప్పాడు పాల్ .
"దేముడు రక్షకుడే ,కానీ ఖచ్చితం గ దేముడే ఈ హింస దరిద్రం అరాచకాలు సృష్టించాడు "అరిచాడు నిత్యానంద .

ఆ వీడియోస్ టెలికాస్ట్ అయ్యాయి ,పేపర్ లో కూడా వచ్చాయి .ఇండియా లో ,అమెరికా లో .
 
నిత్యానంద చెప్పింది చాల మందికి అర్థం కాలేదు ,తాను చెప్పినవి పేపర్ లో చదువుతూ నిత్యానంద కూడా ఆలోచన లో పడ్డాడు ,తాను నిజమేనా ,ఆలా ఎలా చెప్పాడు తన అభిప్రాయాలూ ,ఎదో తెలిసిన వాడిలాగా .,కానీ తాను చెప్పింది నిజమేనేమో .
అతను ఎటు తేల్చుకోలేక సైలెంట్ గ కూర్చున్నాడు అమెరికా లో .

    

[+] 5 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: స్వామి నిత్యానంద (short story) - by will - 14-12-2019, 10:15 PM



Users browsing this thread: 7 Guest(s)