Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#16
"సర్, అది కాదు నేను చెప్పేది వినండి" అని అంటున్న కౌటిల్యని బాగా కొట్టి పడేసి వెళ్లిపోయారు
కళ్ళు తెరిచి చూసేసరికి కౌటిల్య హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, ఇంటి ఓనర్తో పాటు, అతని స్నేహితులు కలిసి హాస్పిటల్ కి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న అతని తల్లి తండ్రులు ఆసుపత్రికి వచ్చారు, అతని బాబాయిలు ఆరాధ్య ఇంటి మీదకి గొడవకి వెళ్లి, పెద్ద హంగామా చేసారు. వాళ్ళ మామని, బంధువులను కొట్టారు, పెద్ద మనుషులు కల్పించుకోడంతో గొడవ సర్దు మణిగింది. ఇరువురి పెద్దలను పంచాయితీకి పిలిచారు.
మొదటినుండి జరిగింది చెప్పిన అశోక్ "మాకిష్టం లేకుండా వాడే కావాలి అని పెళ్లిచేసుకున్న పిల్లని పట్టుకుని కొట్టి అర్ధరాత్రి ఇంట్లోంచి వేళ్ళ కొట్టాడు శాడిస్టుగాడు, బస్టాండ్లో ఒక్కతే బిక్కు బిక్కుమంటూ ఏడుస్తూ కూర్చున్న నా మేనకోడలిని చూసి నా కడుపు తరుక్కు పోయింది, అప్పుడే వాడిని నరికెయ్యాలన్న కోపం వచ్చింది, అదృష్టం బాగుండి నేను చూసాను కాబట్టి సరిపోయింది లేదంటే ఏదైనా జరగకూడనిది జరిగితే ఎవడిది బాధ్యత " అని ఆవేశంగా ఊగిపోతూ అన్నాడు.
"అయితే అస్సలు ఏం జరిగిందో తెలుసుకోకుండా పిల్లాడిని చావబాదుతారా??? మీ అమ్మాయి ఏ తప్పుడు పని చెయ్యకుండానే వాడు ఊరికే కొడతాడా??? మీ అమ్మాయి ఏం చేసిందో అడగండి ముందు" అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇందుమతి నోరు పారేసుకుంది.
"మాటలు మర్యాదగా రానివ్వు, తప్పు చేస్తే కొడతాడా అయినా పాడు పనులు చెయ్యడానికి మీలాగా నీతి లేని కుక్కలం కాదు" అంతే ఆజ్యం పోసాడు అశోక్.
కుక్కలన్న పదాన్ని పట్టుకుని గొడవ మరింత పెద్దది చేసారు. ఇరువైపులా వాదనలు విన్న పెద్ద మనుషులు అస్సలు తప్పు ఎవరిదో తేల్చటానికి అమ్మాయిని అబ్బాయిని ఇద్దరినీ పిలిపించామన్నారు.
ఇంత తతంగం జరుగుతున్నా విషయం తెలియని ఆరాధ్య, కౌటిల్యలకు లేనివి, కల్పించి చెప్పి ఇద్దరి మనసులను విరిచేసారు. విడుపు కాగితాలపై సంతకాలు చెయ్యడానికి ఒప్పించి మరుసటిరోజు జరిగే పంచాయతీకి పిలిపించారు.
ఇద్దరిని ఎదురుఎదురుగా కూర్చోబెట్టి అస్సలు ఆ రోజు ఏమైందని అడిగారు పెద్ద మనుషులు, ఇద్దరు మౌనంగా ఉన్నారు. ఇరువురి పెద్దలు ఎంతగా అడిగిన కూడా నోరు విప్పలేదు. వీరు మౌనం వహించేసరికి పెద్ద మనుషుల్లో ఒకాయన "ఇద్దరినీ కాసేపు ఒంటరిగా మాట్లాడుకోనివ్వండి, వాళ్ళే వాళ్ళ నిర్ణయం చెప్తారు" అని చెప్పి ఇద్దరినీ ఒక గదిలోకి పంపించారు,
చాలా సమయం తర్వాత కౌటిల్యనే "ఆరాధ్య" అని పిలిచాడు.
ఆ ఒక్క పిలుపు కోసమే ఎదురు చూస్తున్న ఆరాధ్య, కౌటిల్యని పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడిచింది.
ఆమె కన్నీళ్ళను తుడిచి అతను ఆమెను గట్టిగా పొదివి పట్టుకున్నాడు కౌటిల్య.
ఆరాధ్య ఎదో చెప్పబోయేంతలో ఆమె పెదాలను తన పెదాలతో మూసి, "నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు నీకు నేనంటే ఎంత ఇష్టమో, నీకు తెల్సు నువ్వంటే నాకెంత ప్రేమనో, అది చాలు పద ఈ విషయం వాళ్ళకు చెపుదాం" అని ఆమెను అలాగే కౌగిలించుకుని బయటకి తీసుకుని వచ్చాడు.
"ఇక్కడ తప్పు మాయిద్దరిది, తన మీద చెయ్యి చేసుకున్న నాది, కోపంతో ఇంటి నుండి బయటకి వెళ్ళినా తనది, మీ తప్పు ఏంలేదు ఇందులో, తనని ఆ పరిస్థితుల్లో చూసిన ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు, నన్ను ఆ స్థితిలో చూసిన మా వాళ్ళు అలాగే రియాక్ట్ అయ్యారు, అంతే మా తప్పు మేము సరిదిద్దుకున్నాం, ఇంకెప్పుడు గొడవ పడిన మీ దగ్గరకు ఓదార్పు కోసం మాత్రం రాము" అని చెప్పి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిపోయారు.
అపార్దాలు మాట్లాడుకుంటే తీరుతాయి, కానీ పోట్లాడుకుంటే అనర్దాలకు దారి తీస్తాయి.

అపార్దాలను అర్థంచేసుకుని, తమ ప్రేమని ఇంకా బతికించునకుంటున్న ప్రతి ఒక జంటకి ఈ కథ అంకితం
**********************





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:29 AM



Users browsing this thread: 1 Guest(s)