Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#15
"ఏ గట్టిగా అరవకు, నరికేస్తాను గొంతు తగ్గించకపోయావో" అని వేలు చూపించి బెదిరిస్తున్న కౌటిల్య చెంప మీద ఒక్కటి ఇచ్చింది.
"నరికేస్తావా??? నరికెయ్యి!!! నన్ను నరికెయ్యి, ఇంట్లో వాళ్ళని కాదని నీతో వచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. 4 నెలలకే అంత బోర్ కొట్టనా నీకు, ఇలా మాట్లాడుతున్నావ్ నాతో, లేక మీ అమ్మ చెప్పిందా??? నాలుగు నెలల తర్వాత వచ్చెయ్యి ఇంకో మంచి పిల్లని తెచ్చి చేస్తానాని" అని అంటూ అతడిని అందిన చోట కొడుతూ, జుట్టు పట్టి లాగింది.
టెంపర్ లాస్ ఐన కౌటిల్య ముందు ఆపడానికి ప్రయత్నించాడు కానీ ఆమె వినకపోవడంతో ఆమె జుట్టు పట్టి లాగి చెంప మీద కొట్టాడు, అతను ఎంత బలంగా కొట్టాడు అంటే ఆరాధ్య గోడకి తాకి వెనక్కి కొంత దూరంగా వచ్చి, కింద పడింది. ఆమె అలాగే నేలపై పడి ఏడుస్తుండగానే, కౌటిల్య ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయాడు.
ఆరాధ్య తలకి చిన్న గాయం అయ్యింది, తెల్లని బుగ్గ మీదా ఎర్రగా కౌటిల్య మూడు వేళ్ళ అచ్చులు పడ్డాయి, విసురుగా వెనక్కి పడిపోవడంతో ఆమె చెయ్యి బెణికింది.
ఏడుపు తన్నుకుంటూ వచ్చింది ఆరాధ్యకు "ఇందుకేనా ఇతడిని పెద్దలని నొప్పించి మరి పెళ్లి చేసుకున్నాను, అదే నాన్న అయితే నన్ను ఇలా కొట్టేవాడా??? నేను ఊహించుకున్న జీవితం ఏంటి ?? ఇప్పుడు నేను జీవిస్తున్నది ఏంటి??? ఇలా గొడ్డును బాదినట్టు బాధి చచ్చాడు?? బతికానా అని కూడా చూడకుండా వెళ్లిపోతున్నా ఈ రాతి మనిషిని ప్రేమించాననని చెప్పడానికే సిగ్గేస్తోంది" ని మనసులోనే అనుకుంది.
ఆమెకు తన తల్లి తండ్రి బాగా గుర్తొచ్చారు. చిన్నప్పటినుండి ఎంత అల్లరినైనా భరించి వెనకేసుకొచ్చిన నాన్న, చిన్న దెబ్బ తాకిన విలవిలలాడిన అమ్మ ప్రేమ గుర్తొచ్చాయి. వెంటనే లేచి తలుపు దగ్గరగా వేసి కొంత డబ్బు తీస్కుని బస్టాండుకి వెళ్ళింది.
వెళ్ళడం అయితే వెళ్ళింది కానీ తనకు వాళ్ళ ఊరు వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. అలాగే ఒక బెంచ్ మీద కూర్చుని ఏడుస్తూ, ఆలోచిస్తోంది. ఇంతలో ఆమె ఒంటి పై ఎవరు చెయ్యి వేశారు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన ఆమె మనసులో కౌటిల్య అయుండొచ్చునెమోనని సంతోషపడింది కానీ ఆ మనిషి కౌటిల్య కాదు ఆరాధ్య మేనమామ అశోక్.
ఆయనను చూడగానే బోరున ఏడుస్తూ ఆయన్ని పట్టుకుంది. ఆమెను ఒక్క మాట కూడా అనకుండా తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆరాధ్య అమ్మమ్మ, అత్త ఎంతగానో కంగారు పడి ప్రశ్నల వర్షం కురిపిస్తున్న వారిని వారించి, ఆరాధ్యకు తినడానికి పెట్టి, పడుకొమ్మని చెప్పాడు అశోక్. గదిలోకి వెళ్లిందన్న మాటే కానీ తన మనసు మనసులో లేదు ఆరాధ్యకు, ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపోయింది.
కౌటిల్య ఇంటికి చేరుకునేసరికి ఆరాధ్య ఇంట్లో లేకపోవడంతో కంగారుపడి వెతికాడు రోడ్ల వెంట తిరిగి తిరిగి తెల్లవారుతుండగా వచ్చి పడుకున్నాడు. ఇంతలో ఎవరో తన ఇంటి తలుపులు గట్టిగా కొట్టడంతో లేచి వెళ్లి తీసాడు. తలుపు తీసిన వెంటనే ఇంట్లోకి విసురుగా వచ్చిన ఒక నలుగురు మనుషులు అతనిపై దాడి చేసి, రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. ఆ వచ్చిన మనుషుల్లో ఆరాధ్య మేమమామ అశోకుని గుర్తుపట్టడానికి కౌటిల్యకి పెద్ద సమయం పట్టలేదు.
అశోక్, కౌటిల్య కడుపులో కొడ్తూ "ఎంత ధైర్యం ఉంటే నా మేనకోడలు మీద చెయ్యి చేస్కుని అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళకొడతావ్ రా??? అది పుట్టినప్పటినుండి దాన్ని కన్నోళ్ళు కూడా ఒక్క దెబ్బ వెయ్యలేదు, అలాంటిది నువ్వు కొడ్తావా??? దానికి ఎవరు లేరు, రారు అనుకున్నావా???" అని అన్నాడు ఆవేశంగా.
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:28 AM



Users browsing this thread: 1 Guest(s)