Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#13
ఆ వార్నింగ్ తో కౌటిల్య మరింత ఫిక్స్ అయ్యాడు. ఆమెను పొద్దున్న, సాయంత్రం ఫాలో అవడం, రోజు మెసేజెస్ చెయ్యడం, దూరంగా నిలబడి ఆమెను చూస్తూ ఉండడం లాంటివి చేసేవాడు, అలా నాలుగు నెలలు గడిచిపోయాయి. మొదట్లో అస్సలు పట్టించుకోని ఆరాధ్య మెల్లిగా అతనికి దగ్గరవడం మొదలుపెట్టింది. ప్రేమిస్తున్నాని వెంటపడి వదిలేసే చాలా మంది అబ్బాయిలకన్నా కౌటిల్య ఎందుకో చాలా ఉన్నతంగా కనిపించాడు. "ప్రేమించు అని కాకా పెళ్లి చేస్కుంటావా??" అని అడిగిన అతని వే అఫ్ అప్రోచ్ ఆరాధ్యకు నచ్చింది.
మాటల్లో చెప్పకపోయినా తన చేష్టలతో కౌటిల్యకు, ఆమెకు కూడా ఇష్టమే అన్న సందేశాన్ని చేర్చింది. మెల్లిగా ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాళ్లు, అతనికి అబ్బని చదువుని ఆరాధ్య అయినా బాగా చదవాలని ప్రోత్సహించి మరి ఎంబీఏలో జాయిన్ చేసాడు. కానీ అదే అతని ప్రేమకి, పెళ్ళికి అడ్డుకానుందని ఊహించలేకపోయారు పాపం.
చదువు తక్కువ అనే కారణం చూపించి ఆరాధ్యని అతనికి దూరం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆరాధ్య కుటుంబ సభ్యులు. ఆఫీసులో, ఇంటిలో ఆమెపై నిఘా వెయ్యడంతో ఆరాధ్యని చూడడానికి, కలవడానికి కూడా కష్టమైంది.
ఒక వైపు ఆరాధ్య మామల బెదిరింపులు, మరోవైపు తల్లిదండ్రుల దెప్పిపొడుపులు, ఇంకో వైపు ఆరాధ్య ఏడుపులు, పెడబొబ్బలు పెడ్తూ పెళ్ళికి ఒత్తిడి, అన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టి కౌటిల్యని ఉక్కిరిబిక్కిరి చేసాయి. అతనికున్న అన్ని దారులు మూసేశాయి.
ఇంత ఒత్తిడిని తట్టుకోడం అతనికి కష్టమనిపించేది. ఇంతటి కష్టంలో కూడా అతనికున్న ఓదార్పు ఆరాధ్యనే, తనతో ఒక్కసారి మాట్లాడిన, పోట్లాడినా కూడా తన మనసుకు కొంత ఊరట ఉండేది.
ఇక నిర్ణయం తీసుకునే రోజు వచ్చేసిందని భావించిన కౌటిల్య, ఒక రోజు ఆరాధ్యని తీసుకుని గుడిలో ఎవరికీ తెలియకుండా కొంతమంది స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఆరాధ్య ఇంటికి వెళ్లి నిల్చున్నారు.
ఇంట్లో అందరు నిశ్చేష్టులయ్యారు.
"నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు, మా పరువు గురించి ఆలోచించకుండా ఈ అనామకుడిని కట్టుకుని నువ్వు ఏం బాగుపడతావో మేము చూస్తాం, గొప్ప గొప్ప సంబంధాలు వదిలి చదువు లేని వీడిని కట్టుకుని దిక్కుమాలిన దానిలా బతుకు, పో నీకు అదే రాసుంది" అని అంటూ కోపంగా ఇంట్లోకి వెళ్లిపోయారు చంద్రమోహన్.
ఆరాధ్య మేనమామ కూడా నానా మాటలు అన్నారు. అన్ని ఓపిగ్గా భరించారు. ఆరాధ్య వాళ్ళ అమ్మ మాత్రం చాటుగా వచ్చి వాళ్ళిదారిని ఆశీర్వదించింది. ఆమె మేడలో ఉన్న ఒక గొలుసు తీసి ఆరాధ్య మేడలో వేస్తూ
"ఇంతకన్నా ఏమి ఇవ్వలేకపోతున్నానమ్మా" అని ఆరాధ్య చేతిని తన అల్లుడైన కౌటిల్య చేతిలో ఉంచి "బాబు జాగ్రత్తగా చూసుకుంటావా???, ఏ కష్టం తెలీకుండా పెరిగిన పిల్లాయ్య, ఏదైనా మొండి పనులు చేస్తే కొంచెం సర్దుకుపో" అని అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యింది.
ఆరాధ్య కూడా ఆమె తల్లిని పట్టుకుని బాగా ఏడ్చింది. ఆ తర్వాత ఆరాధ్యని తీస్కుని కౌటిల్య తన ఇంటికి వెళ్లాడు. ఇంతకుముందు వారి ప్రేమ విషయం చెప్పినప్పుడే కౌటిల్య తల్లి ఒంటికాలుమీద లేచిన విషయం మొత్తం ఆరాధ్యకు తెలుసు. ఇప్పుడు కూడా అంతకన్నా గోరం ఏమి జరగదు అన్న ధీమాతో ఇరువురు వాళ్ళింటికి చేరుకున్నారు అనుకున్నట్టుగానే తండ్రి తల పట్టుకుని కూర్చుంటే, తల్లి ఇందుమతి మాత్రం తోక మీద లేచిన తాచుపాములాగా బుసలు కొట్టింది.
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:28 AM



Users browsing this thread: 2 Guest(s)