Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#11
"లే నువ్వు పైకి, మొత్తం అంత లేవండి, లేచి బయటకి నడవాండి." అని అన్నాను నా కుడి చెతి వెళి ని బయటకి చుపిస్తూ. ఆ గుంపుతొ పాటు నా కుటుంబం కూడా షాక్ కొట్టినట్టూగా ఉన్నారు.
"ఎయ్ నిన్నే, బయటకి వెళ్ళమంటే అర్దం కావట్లే, ఇక్కడ బేరాలు కుదర లేదుగా, పక్కనే పశువుల సంత జరుగుతొంది, మి అబ్బయిని అక్కడకి తొలుకుపొయి, అక్కడ అమ్ముకొండి." అని గట్టిగా అరిచాను. వాళ్ళంతా లేచి నిలబడ్డారు
"నొరు ముసుకొ ఆకాంక్ష" అని మా అమ్మ నా భుజం పట్టి లాగింది, నేను తన చెతిని విదిలించి కొట్టీ "ఇప్పటీదాకా అదే చెసాను, నా లొపాలను ఎత్తి చుపి నా ఆత్మభిమానాన్ని దెబ్బ తెసేలా మాటలు అంటున్నా కూడా నొరుముసుకునె ఉన్నా, అందరి ముందు నన్ను పరిక్షించి లేని లొపాన్ని అంటగట్టిన కూడా మాములుగానే ఉన్నాను, కాని ఇప్పుడు ఇలా అందరి ముందు నాన్నని నానా మాటలు అంటుంటే మాత్రం నేను ఇక సహించలేను." అని నిళ్ళు నిండిన కళ్ళతొ నాన్నని చుశా.
"చుశారా ఎలా మాట్లాడుతొందొ ఈ అమ్మయి, చాలా బాగా పెంచారు, అమ్మొ ఇంక నయం ముందే ఎ పిల్ల ఎలాంటిదొ అర్దం అయ్యింది, ఎదొ చదువుకుంది కద అని గతిలేని వాళ్ళు అని తెలిసిన వచ్చినందుకు మనది బుద్ది తక్కువ" అని కొంగు దొపుకుంటూ అన్నది.
"ఇంకొక్క మాట ఎక్కువ మాట్లడితే పొలిస్ లను పిలుస్తా, మీరు అడిగిన కట్నం, అన్న మాటలు అన్ని రికార్డ్ చెశా, ఎన్ని చట్టాలు చెసిన మికు ఇంక బుద్ది రాద,కట్నం అంటే అమ్మయి తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా పెట్టె లాంఛనాలు, అంతే కాని మి గొంతెమ్మా కొరికలు తిర్చడామని కాదు. అమ్మాయికి చదువుండాలి, ఎందుకంటే చదువుకున్న అమ్మాయి అయితే మి అబ్బాయిని అర్దం చెసుకుంటాది అని, పిల్లాలు పుట్టాక చదివించడానికి పనికి వస్తాది అని........ కాని ఉద్యొగం చెయ్యొద్దు ఎందుకంటే సంపాదిస్తే మి మాట, మి అబ్బాయి మాట వినదు అనే భయం వల్ల, అంతే కాని అదెదొ నాకు ఫెవర్ చెస్తున్నాట్టు మాట్లాడి ఇంకొంతా కట్నం ఆడిగావ్. మికు కావాల్సింది అమ్మాయి కాదు, డబ్బులు తెచ్చే ఏటిఎం, చదువుకున్నా పనిమానిషి, పిల్లల్ని కనె యంత్రం, తెలివైన బానిస కదా, ఇలాంటి లక్షణాలు ఉన్నా వాళ్ళు మికు దొరకారు, వెళ్ళి వేరే గ్రహం మిద వెతుక్కొ" అని కళ్ళను పెద్దవి చెసి తల ఎగరెసాను.
మా నాన్న ఎమి మాట్లాడలేదు, అమ్మ, పిన్ని మాత్రం నన్ను లొపలికి లాగూతున్నారు. "అస్సలు విళ్ళను కాదు మిమ్మల్ని అనాలి, నా ఇష్టంతొ పని లేదామ్మ మీకు, నాకు నచ్చడా అని ఒక్క మాట అయిన నువ్వు కాని నాన్నా కాని అడిగారా, నా జివితం ఎవరితొ, ఎలా ఉండాలొ, ఎమి ఇవ్వాలొ, ఎవడొ ముడొ మానిషిని అడిగుతున్నారు కాని నన్ను అడిగారా, అయినా ఉరుకున్నా కారణం మి మిద నమ్మకంతొ కాని ఈ మానుషులు, మానుషుల్ల కాకుండా కాకుల్లా, పశువుల్లా ప్రవర్తిస్తుంటే ఇంక వాళ్ళ కొట్టానికి నన్ను కాపరిగా పంపాడానికి చుస్తున్నారు, వాళ్ళు అనే మాటలు మికు ఎల ఉన్నయొ కాని నాకు మాత్రం ఇంకొక్క క్షణం వాళ్ళు ఇక్కడ ఉంటే ఎం చెస్తానొ నాకే తెలిదు" అని అమ్మని చుశాను నన్ను పట్టుకుని ఎడుస్తొంది. నాన్న, బాబాయిలు ఎక్కడ వాళ్ళు అక్కడే గమ్మున ఉన్నారు.
"అమ్మొ అమ్మొ ఎంత నంగనాచిలా కుర్చుని ఇప్పుడు ఎలా తన రంగు బయట పెట్టిందొ చుశారా, అందుకే చెఫ్ఫా ఆ సిటిలొ ఉండే పిల్ల వద్దండి చెడిపొయి ఉంటారు అని, సిటిలొ ఎవడ్నొ తగులుకొని ఉంటాది అందుకే ఇంత బరితెగించి మాట్లాడుతొంది, దీని జిమ్మాడి పొను, దినికి అస్సలు పెళ్ళి ఎట్టా అయితదొ మనము చుద్దాం, పదండి, అది దాని కుటుంబం మొత్తం నా కాళ్ళ మిద పడి మన్నించమని అడిగే రొజు రప్పిస్తా" అని బయటకి వెళ్ళేసరికి ఒక అబ్బాయి ఉన్నాడు,
వాడిని చుడాగానే లేని ఎడుపు నటిస్తూ " చుశావారా???? ఎన్ని ఎన్ని మాటలు అంటుందొ. దినికి పెద్దలు అంటే గౌరమే లేదు మనము పశువులం అంట" అని అప్పటిదాకాపేలిన మహతల్లి ఒకేసరి ఎడుపు అందుకుంది. ఆమె మాటలను బట్టి అతను అబ్బాయి అని తెలుస్తొంది. అతను మెల్లిగా మా ఇంట్లొకి వచ్చాడు, మా నాన్న లేచి నాకు అడ్డంగా నిలబడ్డాడు. ఎంతొ గాంభిర్యమైన మొహంతొ నాన్న చెతులు పట్టుకుని "అంకుల్, మికు, మి అమ్మాయి, మా అమ్మ తరుపు నుండి, మా వాళ్ళా తరుపు నుండి నేను క్షమపణలు చెప్తున్నా. తను మాట్లాడిన ప్రతివిషయం వాస్తవం" అని అన్నాడు.

"ఎంట్రా వాళ్ళని మన్నించమని అడుగుతున్నావు, దాన్ని నీ కాళ్ళ మిద పడెట్టూ చెస్తా రా రా !!!" అని అతని చెయ్యి పట్టుకుని లాగింది. "వదులామ్మ, నువ్వు మర్చిపొయవామ్మా చెల్లి పెళ్ళీలొ కట్నం తక్కువ అయ్యింది అని ఎంత గొడవ చెశారు అత్తమ్మ వాళ్ళు, అప్పుడు ఒక ఆడపిల్ల తల్లిగా నువ్వు ఎంత బాధా పడ్డావు, చెల్లి ఎంత నలిగిపొయిందొ, ఇప్పుడు నువ్వు అలగే ఇంకొ ఆడ పిల్లని అంటూంటే ఆసహ్యం గా ఉందామ్మా. ఆ రొజె నిర్ణయం తిసుకున్నా నేను కట్నం తిసుకొకుడదని, నా ఇంటీకి వచ్చే అమ్మాయి నా చెల్లిల బాధాపడకుడాదని" అని అన్నాడు. నేను మౌనంగా ఉన్నాను మళ్ళి అతనే " ఆకంక్షగారు, అమ్మాయి అంటే మిలగే ఉండాలి, మిలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని చెసుకొవాలంటే చాలా అద్రుష్టం ఉండాలి, మాకా అద్రుష్టం ఈ జన్మకి లేదు, కనిసం వచ్చే జన్మలొనైన పెళ్ళీచుపులకు ఆలస్యం చెయకుండా వచ్చి మిమ్మల్ని పెళ్ళి చెసుకునే భగ్యం కల్పించమని దెవుడ్ని కొరుకుంటున్నా. నమస్తే." అని నా కళ్ళలొకి సుటిగా చుసి అందరిని తిసుకుని వెళ్ళిపొయారు.
మా అమ్మ నా నుదుటి మిద ముద్దు పెట్టుకుని కౌగిలించుకుంది, నాన్న కళ్ళలొ నిళ్ళు, నా తల నిమిరి "నన్ను క్షమిస్తావా తల్లి" అని నా అరచెయ్యి తన కళ్ళకు అద్దుకున్నారు. "నాన్నా అంత మాట అనకండి, మిరు చెసుకొమంటే ఎవరినైన చెసుకుంటా, కాని మికు గౌరవం ఇవ్వని కుటుంబానికి మాత్రం నేను వెళ్ళాను" అని అన్నను చిన్నప్పుడు వస్తున్నా ఎడుపు ఆపుకొడానికి పెట్టే బుంగమూతి పెట్టి. ఎంత ఎదిగిన వాళ్ళకి నేను చిన్నపిల్లానేగా.
*******************************************





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:23 AM



Users browsing this thread: