Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#10
ఇది నా మనసుకు తాకిన రెండొ దెబ్బ, నా ఆత్మ విశ్వాసం మిద పడింది.
మళ్ళీ మా నాన్న బాబాయిలు ఎవొ మాట్లాడుకుని వచ్చారు, మా నాన్న మొహమాటంగా "ఇంకొ 5 లక్షలు అయితే సర్దగలను" అని చెతులు నులుముకుంటూ అన్నారు. ఇక అబ్బయి తల్లి తండ్రికి కళ్ళు తిరిగినంత పని అయ్యినట్టూంది. వెంటానే లేచి ఇంట్లొంచి వరండా లొకి వెళ్ళీపొయారు. ఆ వెనకే మా మధ్యవర్తి, మామయ్య వెళ్ళారు. నేను నాన్న మొహం వైపు చుసాను అవమానంగా తలదించుకుని ఉన్నాడు, మా అమ్మ ఎడుపు మొదలెట్టింది. మా బాబాయి మా నాన్న తొ అన్నాడు" అన్నయ్య నా దగ్గర 5 లక్షలు ఉన్నయి అంత కన్న ఎక్కువ లేవు, అక్క కూడా ఒక లక్ష వరకు అయితే సర్దుతా అన్నాది" అని చెప్పాడు.
"మా తమ్ముడు కూడా ఇస్తా అన్నాడు కదాయ్య, ఆలొచించు" అని అమ్మ చెప్తొంది.
"ఎంత ఆలొచించిన 30 కన్న ఎక్కువ ఇవ్వలేము, ఎవరు ఎంత ఇచ్చిన సరిపొవు, పెళ్ళీ లాంఛనాలు, పెట్టూపొతలకు ఎంత కాదన్న ఇంకొ 20 అయితయి." అని తల పట్టుకున్నాడు.
ఇంతలొ అబ్బయి వాళ్ళు మళ్ళీ వచ్చి కుర్చున్నారు. అబ్బయి తండ్రి అడిగాడు"సరేనయ్య మి దుస్థితి అర్ధం అయ్యింది మాకు, సరే మిరన్నాదనికె ఒప్పుకుంటున్నాం, కాని మి అమ్మయికి మేము ఒక కాసు బంగారం కూడా పెట్టము, మీరె ఎంత పెట్టుకుంటారొ పెట్టుకొండి" అని రుమాలు తిసి మూతి తుడుచుకున్నాడు.
"అదెంటి అన్నయ్య ఇచ్చిన కట్నం లొ అమ్మయి కి బంగారం పెట్టాలిగా మిరు" అని మా పిన్ని అడిగింది.
"అవునామ్మ, అది అడిగినంత కట్నం ఇచ్చిన వాళ్ళకి, మిలాంటి అతి గతి లేని వాళ్ళకు కాదు, రూల్స్ మాట్లాడేటప్పుడు మనమెంత అని కూడా ఆలొచించాలి, నీ కంత గతిలేనప్పుడు ఆడపిల్లాల్ని ఎలా కన్నవయ్యా, కట్నం దగ్గరనే ఇంతలా చెస్తున్నావు, ఇక ఆడపడుచు లాంఛనాలు ఎమి ఇస్తారు, మా అమ్మాయి అమెరికా నుండి రావాలి కనిసం ఒక లక్ష అవుతాది, ఇక పెళ్ళీ సంగతి ఎంటీ???? గుళ్ళొ తాళీ కట్టించెట్టూ ఉన్నారు, మా తరపు బంధువులంతా రమరమి 1000 మంది వస్తారు, బాగా ఆర్భటంగా జరగాలి " అని గుడ్లు బయటకి వస్తాయెమొ అన్నంత పద్దతిగా మాట్లాడింది మా నాన్నని చుస్తూ.
ఇది నా మనసుకు తాకిన ముడొ అతి పెద్ద దెబ్బ, నా కుటుంబ పరువు మిద పడింది.
నేను మా నాన్న వైపు చుసాను, దెబ్బ తిన్నట్టూగా తల కింద వేలడేసి ఆలొచిస్తున్నారు, మా అమ్మ ఇంక ఎడుస్తునే ఉంది.
ఇక ఆలస్యాం చెయ్యలేదు. నూరు తప్పులు లేక్కపెట్టిన క్రిష్ణుడిలాగా, మౌనంగా కుర్చున్నా నేను, మరి ఇంక ఒక మాట కూడా పడడాం ఇష్టం లేనట్టూ కళ్ళు గట్టీగ ముసుకుని ఒక ద్రుఢ నిశ్చయం తొ లేచి నిలబడ్డాను.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:23 AM



Users browsing this thread: 3 Guest(s)