Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#9
ఆ రాత్రి నాకు కాళరాత్రే అయ్యింది. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఎప్పుడొ తెల్లవారు జాము నిద్ర పడుతున్న సమయానికి అమ్మ లేపి స్నానం కి పంపింది, స్నానం అయ్యకా పూజా చెయించింది. అంతా హడవిడిగా ఉంది, బాబాయిలు, పిన్నులు, మామాయ్య అత్తయ్యలు వచ్చారు. ఇల్లాంతా సర్దుతున్నారు. రావాల్సిన వాళ్ళ కొసం కూర్చిలు బల్లలు స్విట్స్ అరెంజ్ చేస్తున్నారు. మా పిన్ని నాకు ఒక పట్టు చీర కట్టీ, పూలు అవి పెట్టింది. పొద్దున 11 గంటలకు వస్తామన్న వాళ్ళు మద్యహ్నాం 3 గంటలకు వచ్చారు. అప్పటిదాకా ఆ చిరలొ చిరగ్గా ఉంది.
వారి వారి మాటాలు అవి అయ్యాక నన్ను కుర్చొపేట్టారు. ఎగదిగ ఒక 20 నిముషలు చుసారు, నా చిరాకు ఎక్కువైంది, ఒళ్ళాంత కంపరంగా ఉంది. ఆ గుంపు లొ ఎవరొ "ని పేరు" ఎమిటి అని అడిగారు. తల వంచుకునే చెప్పా." అబ్బయి రాలేదా వదినమ్మ" అని అడిగింది మా అమ్మ. " "అబ్బయి రాడానికి ఇంకొ గంట పడ్తాది, పెద్ద ఉద్యొగం కద ఎదొ పని పడింది, సరే అని మేము వచ్చెసాం, వాడు వస్తాడు ఇప్పుడు, ఆలొపు మనం మాట్లాడల్సినవి మాట్లాడాదాం" అని టీ గ్లాసు అందుకుని చెప్పింది అబ్బయి తల్లి. ఆ గుంపులొ తల ఒకరు ఒక్క ప్రశ్న అడిగారు, ఎం చదివావు, ఎక్కడ ఉన్నవు, ఇలాంటివి. అన్నింటికి ఒపిగ్గా సమధానం చెప్పాక,
ఆ గుంపులొ ఒక ఆమె ఎదొ అబ్బయి తల్లి చెవిలొ ఊదింది, ఆవిడ మద్యవర్తి భర్య చెవిని కొరికింది. ఇద్దరు లేచి నా దగ్గరగా వచ్చి మా చెల్లిని దువ్వెన తెమ్మని అడిగారు, అది తెచ్చి ఇవ్వగానే నా పాపిట్లొ ఆ మద్యవర్తి భర్య దువ్వెనతొ దువ్వింది , పిన్నులు పెట్టడం వల్ల అలా దువ్వే సరికి జుత్తు చెదిరి నొప్పి వల్ల నా కళ్ళలొకి నీళ్ళు వచ్చెసయి, "ఎది చుడాని" అని మరొక్కసరి ఆ అబ్బయి తల్లి దువ్వింది. ఈసారి చాలా జుత్తు బయటకి వచ్చేసి బాగా నొప్పి వల్ల "అమ్మ" అని చిన్నగా అని మా అమ్మ వైపు చుశా, అమ్మ "ఎమైంది వదినామ్మ ఎందుకు అలా దువ్వుతున్నారు" అని కొద్దిగా కంగారుగా అడిగింది. "అయ్యొ ఎమి లేదు అమ్మయికి ముందు సుడి లాగా అనిపించింది మా అక్క కుతురికి అందుకని చుశా, లేదు మాములుగానే ఉంది" అని వెర్రి చుపులు చుస్తూ " లేమ్మ లొనకి వెళ్ళి మళ్ళి జడ వెసుకుని రాపొ" అని నా భుజం మిద తట్టింది, తట్టింది అనెకంటే బలంగా నెట్టింది అనొచ్చు.
ఇది నా మనసుకు తాకిన మొదటి దెబ్బ, నా ఆత్మగౌరవానికి భంగం కలిగించింది.
************************
లేచి లొపలకి వచ్చి ఎడుపు మొహం పెట్టి మా పిన్నిని పట్టుకుని ఎడ్చెస. ఇక అమ్మ పిన్ని అత్తలు ఒదర్చె పనిలొ పడ్డారు. "ఆమె ఎలా ఉంటే మనకేందుకు అబ్బయి మంచివాడు అయితే చాలు రా" అని ఇలా చాలా చెప్పి మళ్ళి రెడి చెసారు.
మా అత్త వచ్చి ఒకసారి అమ్మయిని అంట తిసుకుని రామ్మంటున్నారు అని చెప్పింది, "నేను వెళ్ళను" అని మొండికెసాను. అబ్బయి వచ్చడెమొనె లే అని బలవంతంగా తిసుకెళ్ళారు. "వచ్చింది అబ్బయి కాదాట, అబ్బయి చెల్లెలి అత్త వాళ్ళట" మా పిన్నికి అత్త చెవిలొ గొణిగింది.
ఇక అస్సలు ఘట్టం, కట్నం గురించి మాట్లాడుకుంటున్నరు. అబ్బయి తండ్రి "మా అబ్బయికి చాలా సంబంధలు వచ్చాయి, 50 లక్షలు ఇస్తాం అని, కాని ఎదొ మన ఉళ్ళొ సంబంధం కద అని వచ్చం, అంతే కాని ఎవరు దొరక్క కాదు" అని కిటికిలొ నుండి ఉమ్మి వెసి కుర్చున్నాడు, ఒక్కోక్కరి రంగు బయటకి రావడం తెలుస్తొంది నాకు. నాన్నకి ఎమి మాట్లాడాలొ అర్దం కాలేదు. "అంతా, అంటే కొంచెం కష్టమండి, మా పరిస్థితి మికు తెలియనిది ఎముంది అని" మధ్యవర్తి నైపు చుశారు మా నాన్న. ఆయన, అబ్బయి తండ్రి బయటకి వెళ్ళీ మాట్లాడి తిసుకొచ్చారు. "సరేనయ్య, నిది కాదు నాది కాదు 40 ఇవ్వండి!!!" అని జారిపొతున్నా ప్యాంట్స్ ని పైకి లాక్కుంటూ అన్నాడు అబ్బయి తండ్రి. మా నాన్నని, పక్కాకి పిలిచి మాట్లాడుతున్నరు, "25 కి మాట్లాడు అన్న" అని మా చిన్న బాబాయి చెప్తున్నాడు. అదే మా నాన్న అన్నడు. అంతే అబ్బయి తల్లి పునాకం వచ్చినదానిలా "ఎంటీ, పాతికన, అస్సలు మా అబ్బయి గురించి తెలిసే పిలిచారా మిరు, ఒకే ఊరు కద అని, అమ్మయి కొంచెం రంగు తక్కువ అయిన ఒప్పుకున్నాం, అస్సలు పెద్ద ఎత్తు కూడా కాదు కద, మా వాడు 6 ఉంటాడు. ఉద్యొగం కూడా ఎలా చెయ్యనివ్వం మి అమ్మయిని, మీరు ఆలొచించుకొండి, ఇంత కన్న మంచి సంబందం వస్తాదా మికు" అని అయాస పడ్తూ కుర్చిలొ కూలబడింది.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:23 AM



Users browsing this thread: 1 Guest(s)