Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#7
పరీ(శి)క్ష
 
ఇంతకి నేను ఎవరొ చెప్పాలేదు కద, నా పేరు ఆకాంక్ష, వయసు 24, బీటెక్ చదివాక, హైద్రబాద్లొని ఒక కాలెజ్లొ ఎంబిఎ చెస్తున్నాను, ఫైనల్ సెం పరిక్ష రాసి మా ఉరుకి ఆ రొజె వచ్చాను.
"ఎలా రాసావు పరిక్ష" అమ్మ అడిగింది. "బాగానే రాశానామ్మా, పక్క 70% వస్తాది" అని అలసటగా కుర్చున్నా. "ఎంత వస్తే ఎం లాభం, అబ్బయి వాళ్ళాకి నువ్వు జాబ్ చెయ్యడం ఇష్టం లేదుగా" చెప్పి నాలుక కర్చుకుంది మా చెల్లి. "ఎంటి, ఎం అన్నవు" అని రెట్టించి అడిగాను నేను.
"ఎందుకే అలా అరుస్తున్నవు, అవును, నీకు మొన్న ఒక సమంధం వచ్చింది, బాగా ఉన్నవాళ్ళు, అబ్బయి కూడా మంచి ఉజ్జొగామే, అదెదొ నా నొరు తిరగాట్లెదు, చెత్తున్నాడు అంటా, బాగా చదివినా అమ్మయిని, అది మన చుట్టూ పక్కల ఉళ్ళొనే వెతుకుతున్నారట, మి నాన్న స్నెహితుడు నీ గురించి చెప్తే, నాన్న తొ మాట్లాడారు అంట, నాన్నకి, మాకు కూడా బాగా నచ్చి నీ ఫొటొ పంపామంటే పంపినం, నువ్వు వాళ్ళకి బాగా నచ్చినవట, ఈ ఆదివారం వస్తున్నారు పెళ్ళిచుపులకు" అని లొడ లొడ చెప్పెసింది మా అమ్మ.
"ఎవరిని అడిగి రమ్మన్నారు మిరు, మీకు, వాళ్ళాకి, వాడికి నచ్చితే సరా, నాకు నచ్చక్కర్లేదా, కనిసం మాట వరుసకి కూడా చెప్పలేదు " అని కుర్చి నుండి లేచి నిలబడ్డాను.
"ఎవరిని అడగాలి" అని మా నాన్న గుమ్మం ముందు నిలబడ్డాడు, చాలా గాంభిర్యంగా చుస్తూ కొనసాగించాడు "చుడామ్మా, ఆదివారంవాళ్ళు వాస్తారు, ఎక్కువ ప్రశ్నలు అడగకుండా మి అమ్మ చెప్పినట్టు చెయ్యి, నువ్వు ఇంక చిన్న పిల్లవు కాదు ని వెనక నాకు ఇంక ఒక ఆడపిల్ల ఉంది , ఆమెను కూడా ఒక అయ్య చెతిలొ పెట్టాలిగా" అని ఆల్టిమెటం ఇచ్చెసి వెళ్ళిపొయారు.
చిన్నప్పుడు ఎంత అల్లరి చెసిన ఒక్క మాట కూడా ఆనని మా నాన్న ఎందుకు అలా మాట్లాడారొ అర్ధం కాలేదు, ముందు బాధెసింది, తర్వాత భయం వేసింది. ఆ రాత్రి అన్నం తినకుండా పడుకున్నాను, ఎవేవొ ఆలొచనలు నన్ను చుట్టూముడుతున్నయి.
మా అమ్మ నాన్నలకి మేము ఇద్దరం ఆడపిల్లాలం, మా ఇద్దరిక్కి ఒకే ఒక తమ్ముడు, నేనె పెద్దదాన్ని అవడం వల్ల నా పెళ్ళీకి తొందర పెడ్తున్నారు. నాన్న, ఆడపిల్లాలం అయిన మాకు మాంచి చదువు చెప్పించారు. ఎదైనా నా ఇస్టం కి వదిలెసె నాన్న ఈ విషయం లొ అస్సలు నా ఇష్టం తొ పని లెనట్టూగా మాట్లాడాడం ఎందుకొ జీర్ణంచుకొలెకపొతున్నా. మొదటి నుండి నాకు కొంచెం కొపం ఎక్కువ, ఫెమినిస్ట్ ని కూడా, ఆడపిల్లాలు బాగా చదువుకొవాలి, జాబ్స్ చెయలి, స్వాతంత్రంగా బతకాలి, కాని కట్నం కూడా తిసుకొని అభ్బయిని చెసుకొవాలనే ఉన్నత భావాలు నావి. కాని ఇప్పుడు అవన్ని కట్ట కట్టి అటక మిద పడేయ్యల్సి వస్తాది అని అనుకొలేదు, నాకు తెలికుండానే నా కళ్ళలొని నిళ్ళు నా చెంపలా మిదుగా కారి దుప్పటి తడిపేసాయి. అలా ఎప్పుడూ పడుకున్ననొ తెలికుండా పదుకున్నాను,
బాగా పొద్దు పొయి లేచిన నన్ను మా పక్కింట్లొ బామ్మ "ఎమే పిల్లా, ఇప్పుడా లేచెది, రేపు వచ్చె మొగుడు, అత్త, మామ తంతారు పొద్దున్నా లెవకుంటే" అని నొక్కి చెప్పింది. సమాధనం ఇవ్వకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కుర్చున్నా. అమ్మ తిట్టింది. "వెళ్ళీ పద్మక్కా దగ్గర ఫెసియల్ చెసుకుని రా, మొహం మిద ఆ మచ్చలు ఎంటీ, బయట తినాకు అంటే విన్నవు కాదు" అని మా అమ్మ టిఫిన్ తెచ్చి నా ముందు పెట్టింది.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:22 AM



Users browsing this thread: 1 Guest(s)