Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#6
యమ సీరియస్ గా ఆఫీసులో పన్జేస్తున్నాడు ధనుష్ … అప్పటికే బాస్ ముండావాడు రెండుగంటల్లో నాలుగు ఫైళ్ళ దుమ్ము దులపాలని వార్న్ ఇష్యూ చేసేశాడు. సరిగ్గా అప్పుడే ఎంటరయ్యింది విరజ. తెల్లటి మైసూర్ సిల్క్ చీరకు రెడ్ కలర్ బోర్డర్ ఎంతో నప్పింది. ఆమె ఒంటికి మరీను … అదే కలర్ బ్లౌజ్ లో మరింత అందంగా మెరిసిపోతోంది … అందరి కళ్ళూ విరజ మీదే … సడెన్ గా తన ముద్దుల భార్య అలా ఆఫీసుకు వచ్చేసరికి షాకయ్యాడు. “విరజ … నువ్వా …!’’ “కాదు … పక్కింటి పంకజాన్ని …’’ అంది. “ఆఫీసులో కామెడీలొద్దు …! ఏంటీ ఇలా వచ్చావ్ …? బాస్ ముండావాడు లోపలున్నాడు’’ మెల్లిగా చెప్పాడు. అంతకన్నా మెల్లిగా అతని చెవిలో గుసగుసలాడింది …

బాస్ ముండావాడైనా వాడి బాబ్బాబు ముండావాడైనా ఐ డోంట్ కేర్ … నాకు మూడొచ్చింది … ప్లీజ్ … వెంటనే వచ్చేయండొచ్చేయండి’’ అంది విరజ. “ఇప్పుడా …?!’’ “అవునిప్పుడే … ప్లీజ్ …’’ అంది హస్కీగా. తనని సరదాగా ఆటపట్టిస్తుందేమోననుకున్నాడు … కానీ, సీరియస్ గానే అంటోందని అర్థమైంది. ‘అమ్మ విరజ! తన వీక్ పాయింట్ మీద దెబ్బకొట్టింది … ఇంటికి పద నీ పనిజెప్తా’ అనుకున్నాడు మనసులో. అంతే … చెప్పాపెట్టకుండా బయటకు నడిచాడు. నెక్స్ ట్ దే బాస్ తో అక్షింతలు పడ్డం వేరే విషయం.
*****
ధనుష్ ఖర్మగాలి ఓ రోజు అతని తల్లిదండ్రులు వచ్చారు. విరజ వాళ్లకు టిఫిన్ పెట్టింది. ధనుష్ తండ్రితో ఏదో మాట్లాడుతున్నాడు … సరిగ్గా అప్పుడే “ష్ …’’ అంటూ సైగ చేసి పిల్చింది. అది ధనుష్ కు వినిపిస్తోంది …. ఏమిటన్నట్టు చూశాడు ధనుష్ … దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేసింది … ధనుష్ విరజ దగ్గరకు వెళ్ళాడు … “ఏమిటి విరజా …! టిఫిన్ చేయనీయకుండా …?’’ అతని మాటలు మధ్యలోనే ఆపి… “ఇప్పుడు టిఫిన్ అంత ముఖ్యమంటారా? అవతల మూడ్ తో చస్తున్నాను’’ అంది విరజ.
మూడా …? ఇప్పుడా …!? సమయం సందర్భం లేదా …. అవతల అమ్మా, నాన్నా ఉన్నారు …’’ “ఏం మా ఇంట్లో అమ్మా, నాన్నా ముందు మీకు మూడొచ్చిందంటే నేను అలానే అన్నానా? అవున్లెండి … అన్నీ చూసేశారుగా … ఇంకా నన్ను కొత్తగా చూడడానికేంవుంది …? మీకు మూడేం వస్తుంది …?’’ అంది ముక్కు చీదుతూ విరజ. బిక్కచచ్చి బిత్తరపోయి … “అబ్బా ,,, నువ్వల అనకు విరజా … నాకు ఎక్కడో గుచ్చుకుంటుంది. రాత్రినుంచీ నీకు మూడ్ రావడం ఇది ఆరోసారి … నావల్ల కాదు’’ నడుం పట్టుకుని అన్నాడు. అదోలా చూసింది విరజ. ఆ చూపుకు జీవుడు ఫ్లాటయి గదిలోకి నడిచాడు …
 
*****
పెళ్ళాం బుగ్గమీద వేలితో పొడిచి … “చూసారా …? కోడలిపిల్లకు వున్న ఇంగితం నీకు లేదు. నీకెప్పుడైనా మూడ్ వచ్చిందా …? మూడొచ్చిందని ఎప్పుడైనా అన్నావా …? అవున్లే అలా అనివుంటే పంచపాండవులైనా పుట్టేవాళ్ళు …’’ అన్నాడు ధనుష్ తండ్రి భార్యతో ….
*****
అతి దీనంగా భార్యవంక చూసాడు ధనుష్ ….
ఒసే విరజా నా శరీరం పచ్చి పుండయిందే … సిగ్గుతో చితికి, చచ్చి, బిక్కచచ్చిపోతున్నానే … నీ మూడ్ ని కాశ్మీర్ బోర్డర్ లొ తగలెట్ట … పక్కనే ఫ్రెండ్స్ అని చూడవు, బంధువులున్నారని కూడా ఆలోచించవు … ఆఫీసు టైమింగ్స్ అసలే పట్టించుకోవు … ఇలా ఎప్పుడూ పడితే అప్పుడు మూడ్ అంతే చచ్చూరుకుంటానే …’’ ఆ రాత్రి నాలుగోసారి ఆమెనుంచి విడిపోతూ దీనంగా అన్నాడు ధనుష్ … పొద్దస్తమానం మూడ్ అంటూ మొగుడ్ని పడగ్గదిలోకి లాక్కుపోతూంది. సమయం సందర్భం చూడటంలేదు విరజ. దాంతో చచ్చేచిక్కోచ్చింది ధనుష్ కు.
*****
తెల్లవారుఝామున మొగుడ్ని తట్టిలేపింది … ఉలిక్కిపడి లేచాడు … లేస్తూనే … “మళ్ళీ మూడొచ్చిందా విరజా …?’’ నీరసంగా అడిగాడు ధనుష్. “మూడా … పోయిందే … గాయబ్ … ఇట్స్ గాన్ … ఏదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టించాను. భార్యాభర్తల మధ్య సమయం, స్థల నిషిద్ధాలు, నియమ నిబంధనలు లేవు. మీకెప్పుడు మూడ్ వచ్చినా ఆ మూడ్ ని నా మూడ్ గా మార్చుకోగలను … కానీ పరిస్థితుల ఆకళింపు చేసుకోవాలి … ఏకాంతం … అది ఎప్పుడైనా ఇష్టమే. అది చెప్పాలనే ఈ సరదా ఫినిషింగ్ టచ్ …’’ అంది.
నిజ్జమా … యూ ఆర్ కరెక్ట్ … నాకూ తెలిసోచ్చిందే …’’ అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుంటూ. సరిగ్గా గంట తర్వాత అతని చెవిలో గుసగుసలాడింది విరజ … “ఏవండీ … మళ్ళా మూడ్’’ ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆమెతో సరసాల సమరానికి సిద్ధమయ్యాడు ధనుష్ … భార్యాభార్తల మధ్య ముద్దొచ్చే మూడ్ ఎప్పుడూ ఫ్రెష్ గానే వుంటుంది….!
 
****అయిపోయింది****










[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:20 AM



Users browsing this thread: 1 Guest(s)