Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#5
విరజలో అందంవుంది … అణుకువ వుంది … అమాయకత్వం వుంది … ఆరిందాతనమూ వున్నాయి. ముద్దుగా, బొద్దుగా వుందే విరజకు ధనుష్ బోలెడంత నచ్చేసాడు. తనని ప్రేమగా చుట్టుకుపోతూ … అల్లరిగా హత్తుకుపోతూ … తమకంగా తన శరీరంమీద ముద్దుల ముద్రలు వేస్తోన్న ధనుష్ ని చూస్తోంటే ఆమెకు తిలక్ విరహోత్కంఠిత గుర్తొచ్చింది. తనను తానుగా తనకు తానుగా అతని ముందు పరచుకోవాలనుకుంది. నా ఒంటి నిగనిగలవంటి శయ్యను సజ్జితం చేశాను – నాకంటే మిలమిలలవంటి మధువుపాత్రలు నింపాను – త్వరమాణమై ప్రభూ నా తనువూ స్వీయయౌవన భారస తరబడిపోతున్నది …
కిటికీ అవతల హిమస్నాత మాలతీలత నన్ను పలకరింపదు … కిటుకు తెలిసిన పొదలోని గువ్వజంట నన్నూరడింపదు – కందళించే ఈ వలపు ప్రభూగాడాశ్లేష దోహదం లేక క్రమంకసితోద్భాసితం కానేకాదు.
*****
అతడామె భావుకత్వాన్ని గ్రహించలేదు కానీ, ప్రేమలోని వివశాత్వంతో ఆమెను అల్లుకుపోతూనే వున్నాడు. ముద్దుగా బొద్దుగా వుందే విరజలో ప్రతీ అందం … అతడ్ని ఎప్పుడూ టెంప్ట్ చేస్తూనే వుంటుంది. ఆమె శరీరాన్ని స్వేదబిందువులు ఆక్రమించుకున్నాక, ఆమె అనాచ్చాదిత గుండెలమీద తలపెట్టి “విరజా నువ్వెందుకే ఇంతందంగా పుట్టావు …!’’ అనడిగాడు. ఏమో నాకేం తెలుసురా ధనుష్’ అని రిటార్డ్ ఇద్దామని మనసులో అనుకుంది విరజ.
కానీ ఫస్ట్ నైటే తన స్టోన్ విప్పి, విశ్వరూపము చూపిస్తే జీవుడు ఝాడుసు కుంటాడని మానుకుంది. అలా వాళ్ళ మొదటిరాత్రి ముచ్చట పూర్తయిన తర్వాత అతని మూడ్ గంటకు మూడువందల అరవై అయిదు మీటర్ల స్పీడుతో పెరుగెత్తింది పగలూ – రాత్రీ – నో తేడా … సమయం – సందర్భమూ డోంట్ కేర్ … మూడొస్తే చాలు చిన్నపిల్లాడే అయిపోయేవాడు ధనుష్ … “ప్లీజ్ విరజా … మూడొచ్చింది’’ అనేవాడు. ఆఫీసుకి వెళ్ళి గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి “మూడొచ్చిందోచ్’’ అంటూ పరుగెత్తుకొచ్చి ఎవరైనా ఉన్నారేమోనని చూడకుండా విరజను చుట్టేసేవాడు. విరజకూ ధనుష్ దగ్గరవ్వడం యిష్టమే కానీ, ఎప్పుడుపడితే అప్పుడు ఇలా ‘మూడొచ్చిందే …’ అంటూ రావడం వల్ల విరజ ఇబ్బందిలో పడేది. ఫ్రెండ్స్ వున్నారని కూడా చూడడు ..
తను పుట్టింటికి వెళ్తే తను వెళ్ళిన గంటలోగా తన వెనకే వచ్చి మూడొచ్చిందంటాడు. ముసలిబామ్మ ‘అవ్వ … హవ్వ … వ్వ …’ అని బుగ్గలు నొక్కుకుంటుంది. తల్లయితే వెంటనే తండ్రివంక చూసి బుగ్గమీద ఓ పోటుపొడిచి “హు … మీరూ వున్నారు ఎందుకు? ఒక్కసారన్నా అలా మూడొచ్చింది .. అంటూ వచ్చారా …? అవున్లే .. అలా వస్తే … విరజ ఒక్కతే ఎందుకు పుడుతుంది? పక్కింటి మాధవరావుకిమల్లె అయిదుగురు ఆడ పంచపాండవులు పుట్టేవాళ్ళు’ అని అంది. వెంటనే తండ్రి తెగ సిగ్గుపడిపోయేవాడు … ఫ్రెండ్సయితే ‘మూడొచ్చే శ్రీవారున్నారా …?’ అని పలకరించడం మొదలుపెట్టారు. అలా మొగుడి ముద్దుల మూడ్స్ పరాకాష్టకు వెళ్ళిన తర్వాత మొగుడిగారి అతి మూడ్ కు ముక్కుతాడు వేయాలనుకుంది … అప్పుడొచ్చింది ఆ ఆలోచన విరజకు … అంతే … అమ్మాయికి మూడొచ్చింది …! ఇక వాట్ నెక్స్ టే మిగిలింది.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:19 AM



Users browsing this thread: 1 Guest(s)