20-11-2018, 11:08 AM
'నాలుగు రోజులు నాలుగు క్షణాల్లా గడిచి పోయాయి. నిన్ను వదిలి ఒంటరిగా వెళ్ళాలంటే భయంగాను, బాధగాను ఉంది' ట్రాలీబ్యాగులో బట్టలు సర్దుతూ అంది అమూల్య.
"బాధ ఎందుకు? నేను పక్కనుండగా నువ్వెప్పుడూ బాధపడకూడదు. నేను తట్టుకోలేను' ఆమెకు బట్టలు అందిస్తూ నవ్వుతూ అన్నాడు తుషార్.
నీకంతా నవ్వులాటే నేను ఒంటరిగానే వెళ్ళాలి కదా బ్యాగ్ జిప్ వేస్తూ కన్నీటిని దాచుకుంటూ అంది అమూల్య.
'అమూల్యా నేనూ నీతోపాటే వస్తున్నాను" అన్నాడు తుషార్.
"వాట్! ఏం మాట్లాడుతున్నావు నమ్మశక్యం కానట్లుగా అడిగింది.
"ఎస్. నేనూ నీతో పాటే ట్రైనులో వస్తున్నాను. అందుకే నా ఫ్లైటు టిక్కెట్టు క్యాన్సిల్ చేశా. నీకు సర్ఫ్రైజ్ ఇద్దామని చెప్పలేదు. సో నీతో మరో ఇరవై నాలుగు గంటలు ఒకే బెర్తు మీద. ఏదో చిలిపిగా నవ్వుతూ తుషార్ చెప్పబోతుండగా 'థాంక్యూ అంటూ తుషార్ వంక ప్రేమగా చూసి, "నీతో కొన్నిగంటలు కాదు, కొన్ని సంవత్సరాలు ప్రయాణం చెయ్యాలని ఉంది' మనసులోనే అనుకుని అతన్ని మరోసారి అల్లుకుపోయింది. ఆమె పాలబుగ్గల మీద ముద్దుపెడుతూ 'అమూల్య మనిద్దరం ఎన్నో మరపురాని అనుభవాలతోను, అను భూతులతోను ఈ కాశీ నగరం వదులుతున్నాం" అంటూ ఆమె నుదుటి మీద గాఢంగా చుంబించి, "ఈసారి జంటగా ఇక్కడికి వద్దాం" అన్నాడు నవ్వుతూ.
*** THE END ***