Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అందమైన అనుభవం BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#5
ఊరుకోండీ నన్ను నమ్మకున్నారు కదా! మిమ్మల్ని ఈ నడిరేయి గంగలో ముంచను లెండి నవ్వుతూ అన్నాడు తుషార్.

***
"వెల్కమ్ సార్, మీ రూము కీస్ తీసుకోండి ఫార్మాలిటీస్ పూర్తిచేసి తుషార్ చేతికి తాళాలిచ్చాడు గంగా గెస్టు హౌస్ మేనేజర్.
"థాంక్యూ అంటూ, 'ఓ సింగిల్ రూము ఏదైనా ఉందా' అడిగాడు తుషార్.
సారీసార్ సీజను కదా చెప్పాడు మేనేజర్.
"ఇక్కడేమీ రూములు లేవట. అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి నాతో ఉండండి. రేపు ఎక్క డైనా ట్రై చేద్దాం" అన్నాడు అమూల్యతో తుషార్. అతని వంక అనుమానంగా చూసింది.
"చూడండి. ఇద్దరం ఒకే రాష్ట్రంవాళ్ళం. పైగా ఒకే బెర్తుమీద కలిసి ప్రయాణించి వచ్చాము. అంచేత మీరింకేం ఆలోచించకండి. అయినా నేను అలాంటివాణ్ణి కాదు, నా మాట నమ్మాలి మీరు" భరోసా ఇచ్చాడు తుషార్.
'సరే కానివ్వండి. మీమీద నమ్మకం ఉంది' అంటూ అతడి రూములోకి వచ్చింది అమూల్య.
***
అర్ధరాత్రి వేళ. గెస్ట్ హౌస్ బాల్కనీలో నిలబడ్డారు తుషార్, అమూల్య. ఎదురుగా పున్నమి చంద్రుని కిరణాల కాంతిలో మిలమిల మెరుస్తూ, ప్రశాంతంగా ప్రవహిస్తున్న గంగానది!
"అహా ఎంతో అందంగా, నవకన్యలా మెరిసి పోతోంది కదూ గంగానది అమూల్యతో అన్నాడు తుషార్. గాలికి ఆమె కురులు ఎగురుతూ తుషార్ ముఖానికి తగిలి అతడికి గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె పర్ప్యూమ్ పరిమళం అతడికి ఏదో సరికొత్త మత్తునిస్తోంది.
నిజమే, మీరన్నట్లు గంగానది చూడ్డానికి ఎంత బావుందో అంది అమూల్య.
బైట బాగా చలిగా ఉంది. చూడండి నా బుగ్గలు, చేతులు ఎంత చల్లబడిపోయాయో" అన్నది. ఆమె బుగ్గల మీద చేతులు వేసి, ఆమె చేతిని చొరవగా పటుకున్నాడు తుషార్ నిజమే మీరు చాలా చల్లగా అయిపోయారు. పదండి లోపలికి రేపు మీ పోస్టర్ ప్రెజెంటేషన్ కూడా ఉంది. పైగా మీకేమైనా అయితే నేను తట్టుకోలేను నవ్వుతూ అన్నాడు తుషార్ ఆ అభిమానం, ప్రేమకు పొంగిపోయింది అమూల్య. సడన్గా అతణ్ణి వాటేసుకుంటూ అతని గుండెల మీద ముద్దుల వర్గం కురిపించింది. అనుకోని సంఘటనకు ఆశ్చర్యపోయాడు తుషార్ ఆమెను గట్టిగా పొదివి పటుకుని నుదుటన పెదవులతో సృశించాడు. 'అమూల్యా నువ్వు నా దానివి' అన్నాడు. ఆమె ఇంకాగట్టిగా వాటేసుకోవడంతో పరవశమైపోయాడు తుషార్ అతడి వెచ్చని కౌగిలిలో గువ్వపిట్టలా ఒదిగి పోయింది. ఆ మధుర క్షణాలు అనుభవించిన కొద్దిసేపటికి వారిద్దరూ సడనుగా ఏదో తప్పు చేసినవారిలా విడివడ్డారు. సిగ్గుతో ఒకర్ని చూసి మరొకరు నవ్వుకుని గుడ్ నైట్ చెప్పకున్నారు.
***
మర్నాడు ఉదయం బెనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్లోకి అడుగుపెట్టిన వారిద్దరిలో ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందం, ఉద్వేగం!
పచ్చనిచెట్లతో హరితవనంలా, విశాలమైన భవంతులున్న క్యాంపస్ ముగ్దుల్ని చేసింది వారిని. 'ఆహా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఎంత అదృష్టవంతులో అనుకున్నారు. క్యాంపస్ దారుల్లో అందమైన యువతులు, రంగురంగుల సీతాకోకచిలకల్లా తిరుగుతూ యూనివర్సిటీకి మరింత అందం తెస్తున్నారు.
మధ్యాహ్నం పేపరు ప్రెజెంటు చేశాడు తుషార్. 'ఆ... అమూల్య నీ పోస్టర్ ప్రెజంటేషన్ కూడా అయిపోయింది కదా, ఇక పద సరదాగా అలా గంగలో షికారుకి వెళ్ళి ఆ తర్వాత గంగా హారతి చూద్దాం" అన్నాడు. ఆనందంగా అతడి వెంట వెళ్ళింది అమూల్య.
***





[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అందమైన అనుభవం BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 11:06 AM



Users browsing this thread: 1 Guest(s)