Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
#95
వరాహ మిహిరుడు.
పూర్వం ఉజ్జయిని రాజైన విక్రమార్కుని ఆస్థానములో వరాహ మిహిరుడు గొప్ప విద్వాంసుడు.విక్రమాదిత్యుని ఆస్థానములో తొమ్మండుగురు విద్వాంసులు ఉండే వారు.. వారినే నవరత్నములు అని కూడ పిలిచే వారు.ప్రముఖ కవి కాళిదాసు కూడ అందులో ఒకరు.వరాహ మిహిరుడి అసలు పేరు మిహిరుడు.అయితే ఆయనకు వరాహ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలిపే కథ ఒకటి ఉంది.
విక్రమార్క మహారాజు కు ఒక కొడుకు పుట్టిన తరుణం లో రాజు ఆస్థాన జ్యోతిష్కులందరిని పిలిచి జనన కాలమును బట్టి తన కుమారుని జన్మ పత్రిక లిఖించి ఆయుర్దాయం గణింప వలసినదని కోరెను.ఆస్థాన జ్యోతిష్కులందరు జాతకమును సిద్దపరచిరి.గ్రహ స్థానముల బలాబలములను పరిశీలించి కుమారునకు 18 వ ఏట ఏదో ఒక గండమున్నదని ఊహింపగల్గిరి,కాని దాని స్వభావ మెట్టిదో మరణకారకమగునా కాదా నిశ్చయింప జాలక పోయిరి.కాని గండము గడచి బయట పడ వచ్చునని తెలిపిరి.దీనికి భిన్నముగా మిహిరాచార్యుడు ఆ బాలుడు 18 వ ఏట పలాన మాసమున పలానా దినమున సూర్యోదయానంతరము 27 ఘడియలకు వన వరాహముచే ప్రాణములు కోల్పోవునని జంకు గొంకు లేకుండ నిర్మొహమాటముగా నిర్భయుడై రూఢిగా చెప్పెను.ఆ రాజు జ్యోతిష శాస్త్రము నందు అధిక విశ్వాసము గలవాడైనందున మరియు జ్యోతిష విద్వాంసుల పై గౌరవముతో మిహిరుడు చెప్పిన మాటలపై కినుక వహించక ,తగు ప్రయత్నము చేయుట వలనను,భగవదనుగ్రహం వలనను ఆ అనర్థ తీవ్రతను తగ్గింప వచ్చునేమో నని తలచి మంత్రులతోను,శ్రేయోభిలాశులతో అలోచించి కుమారుని రక్షణార్థం తగు జాగ్రత్తలు తీసుకొనెను.
తన భవనమునకు మైలు దూరములో 7 అంతస్తుల భవనము నొకటి నిర్మింపజేసి దాని చుట్టును 80 అడుగుల ఎత్తున ప్రాకారమును కట్టి, క్రిమి కీటకములు గూడ లొన ప్రవేశించుటకు వీలు లేనంత కట్టడి చేసి రాకుమారునకు కావల్సిన సమస్త సౌకర్యములను ఏర్పాటు చేసెను.విద్యాభ్యాసమునకు కూడ ఆ భవనములోనే తగు ఏర్పాట్లు చేసెను. జ్యోతిష్కులు పేర్కొన్న గడువు ఇంకను 2 రోజులు ఉన్నదనగా ఆ భవనము చుట్టూ అడుగడుగున అంగ రక్షకులను నిలిపి బయటి ప్రాణి ఓక్కటి కూడా లోపలికి పోకుండ హెచ్చరికలతో భటులకు ఆఙ్ఞాపించెను.కుమారుని దేహ ఆరోగ్యస్థితి తెలిసికొనుటకై వేగులని ఏర్పాటు చేసెను. నాటి మధ్యాహ్నము 3 జాముల వరకు వేగులు తడవ తడవకు ఒకరి వెనుక ఒకరు వచ్చి రాకుమారుని క్షేమమను గూర్చి తెలుపుచుండిరి.రాజు గారు నిండు సభలో జాతక పలితములను గూర్చి దైవఙ్ఞులతో చర్చలు జరుపుచుండెను.కొందరు దైవఙ్ఞులు మిహిరాచార్యుని జాతక గణన లో ఏదో తప్పు చేసియుండునని తమలో తాము బాధ పడుచుండిరి.సభాసదులు వారి వారి అభిప్రాయములను రాజు గారికి తెలిపిరి.వారి వారి భిన్నాభిప్రాయములు విని రాజు గారు, దైవ వశమున తన కుమారుని గండము తప్పినను ,ఆచార్యులయెడ తనకు గల భక్తి గౌరవములు సడలవని,శాస్త్రముపై గురుత్వమేమాత్రము నశింపదనియు,మరింత హెచ్చునని గంభీరముగా పలికెను. ఇంతలో సూర్యోదయాది నుండి 26 వ ఘడియ గడిచెను.అప్పుడు ఒక వేగు వచ్చి రాకుమారుని క్షేమ వార్త తెలిపెను.
తదుపరి అందరు రాకుమారుని చూడ డానికి బయలు దేరిరి.దారిలో 28 వ ఘడియ సమయములో ఒక బంటు వచ్చి కుమారుని క్షేమ సమాచారము తెలిపెను.అందరు ఆచార్యుని వంక చూసిరి.అతడు ఇంతకు ముందు లాగానే గంభీరముగా నుండెను.అందరు మేడలోకి ప్రవేశించి ప్రతి అంతస్తును పరికించుచూ అచ్చట ఉన్న వారు కుమారుని క్షేమ సమాచారము చెప్పుచుండగా పైకి వెళ్ళిరి.మధ్యలో కొందరు రాకుమారుడు ఏదో బద్ధకముగా నుండుటచే అరఘడియ ముందు మంచి గాలికై డాబా మీదికి వెళ్ళినాడని తెలిపిరి.గుండెలు దడ దడ కొట్టుకొనుచుండగా అందరును ఏడవ అంతస్తు డాబా పైకి వెళ్ళీ చూడగా అచట ఒక ధ్వజ స్తంభము క్రింద మంచం పై ఇనుప వరాహ విగ్రహము రొమ్ముపై బడి నెత్తురు గారుచున్న కుమారుని చూచిరి. రాజు పుత్ర శోకములో మునిగి ఉండికూడా,మిహిరుని విఙ్ఞాన విశేషమునకు ఆశ్చర్యపడెను.తాను ఎన్ని ఉపాయములు అవలంబించినకూడ శాస్త్ర పలితముమే సంభవించెను.ఆకాలములో వారి కులదైవం వరాహమూర్తి అగు విష్ణువును ఇళ్ళు నిర్మిస్తున్నప్పుడు శిల్పి స్తంభముపై నిలిపెను.దైవ వశమున అది రాకుమారుని మరణమునకు కారణమయ్యెను.
శాస్త్ర విధి తప్పదనుటకు ఇది తార్కాణమని పల్కుచూ రాజు అచార్యుని ఆలింగనము చేసుకొని అదిమొదలు అతడు “వరాహ మిహిరాచార్యుడు”అని పిలువబడునని “వరాహ” బిరుదు నొసగి శ్లాఘించెను.
ఈ కథ ఎంత వరకు సత్యము అనునది చారిత్రకాన్వేషకుల బాధ్యత,కాని ఆకాలములో జ్యోతిష శాస్త్రము యొక్క ఔన్నత్యమును,వికాసమును చాటుతుంది.తరువాతి తరములలో దానికి తగు శ్రద్ధ,శిక్షణ,గ్రంథ లభ్యత ,ఆసక్తి లేనందున జ్యోతిషమ్ వెనుక బడినది.
వరాహ మిహిరాచార్యుని రచనలు.బృహత సంహిత.(హోరా గ్రంథము),పంచ సిద్ధాంతిక,లఘు జాతకము,వివాహ పటలము,యాత్రా గ్రంథము,సమాస సంహిత,జాతకార్ణవము,ఢికినిక యాత్ర,గ్రహణ మండల ఫలమ్,పంచ పక్షి,మొదల్గునవి.
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 14-12-2019, 12:51 PM



Users browsing this thread: 2 Guest(s)