"అవంతీ! నీకోసం ఓ సర్ఫైజ్ గిఫ్ట్ ఎదురు చూస్తోంది. రావా ప్లీజ్... "
ఒక్కసారిగా ఆమె దేహం మోహనరాగం ఆలపించింది. కాదనగలనా అన్నట్టు అతని వెనగ్గా నడిచింది. మేడమీది గది తలుపులు తెరుస్తూ "వెల్కమ్' అంటూ అమాంతం ఆమెకి చేతులతో సంకెళ్ళ వేసేశాడు.
ఆమె పిసినారితనం చూపించదల్చుకోలేదు. ఎన్నో రాత్రులు వస్తాయిగాని రాదమ్మా వెన్నెలమ్మా... అన్నట్టు అతన్ని అల్లుకుంది.
వాళ్ళకది తొలిరాతో, మలిరాతో ఏరాత్రో అర్థం కానంత అయోమయంలో గడిపేసారు.
కాలానికి ఏంచెయ్యాలో అర్థంకాక అయోమయంగా అటూ ఇటూ పరుగెత్తుతోంది.
అతను మొబైల్ అందుకున్నాడు. సాయంత్రం తనకొచ్చిన మెసేజ్ మరోసారి చదివాడు- "డాడీ! నువ్విచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం అమ్మఎదురుచూస్తోంది. మ్యారేజ్ డే సందర్భంగా ఇచ్చేయండి. థ్రిల్ అయిపోతుంది" నిజంగో అవంతిక ఇంతగా తనకోసం ఎదురుచూస్తుందని అనుకోలేదు.
"థాంక్యూ మైడియర్... " అలసిన కనురెప్పలపై తన పెదవుల ముద్రలు వేస్తూ అన్నాడతను, “འི་ཉི་ నేను చాలా మూర్ఖంగా, స్తబ్దుగా ఉండి పోయాను. ఎన్నిసార్లు మిమ్మల్ని డిజప్పాయింట్ చేశాను... అయాం సారీ... సుఖం లేకుండా చేశాను కదూ?" ఆమె కనురెప్పల తడిని అతను కలవరంగా చూశాడు.
"ప్లీజ్ అవంతీ! సుఖం వేరు, తృప్తి వేరు... అందుకే నిన్ను నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు" ఆమె ఆమె మత్తుగా అతన్ని చూస్తే అతనామె అణువణువూ ముద్రలు వేస్తుంటే ఆమె చాలు చాలు…. అంటుంటే ఆటను మరింత రెచ్చిపోయాడు.
చాన్నాళ్ళ తర్వాత ఇద్దరూ అలసిపోయి మత్తుగా ఇద్దరూ ఒకరికొకరై నిద్రపోయారు.
కాలింగ్ బెల్ అదేపనిగా మోగుతుంటే మేలుకుంది అవంతిక. తనని తను చూసుకుంటే సిగ్గనిపించి సవరించుకుని తలుపు తీసింది.
ఎదురుగా నాగమణి, ఎందుకో అది కళ్ళెగరేసిందని పించింది, సిగ్గేసింది. ఎంతగా పనిలో పడ్డా హృదయం కొత్తగా సిగ్గుపడుతోంది. "మా దొడ్లో బాయి ఎండి పోతా ఉందమ్మగారూ! పూడిక తియ్యాలOట... బేగెల్లాలి..." అదెందుకు అలా” అందో తెలీదుగాని తనకి తను అన్వయించుకుంటే అనిపించింది.
'తడిలేని బావికైనా స్పందించని హృదయానికయినా అప్పుడప్పుడూ పూడిక తియ్యాల్సిందే." అని.
*** THE END ***