Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఔననకా.. కాదనకా.. BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#5
'చంపేస్తాను.’

చంపేయి….నీ పరిశ్వంగంగంలో నేనెన్నోసార్లు మర ణించి బతికేస్తుంటాను ప్రియా?..." 'అబ్బా! ఛా... ‘
"ఈ మధ్య నువ్వు… మరీ పిసినారివి అయిపోతున్నావు….'
ఏ విషయంలో స్వామీ?"
అసలు ఇవ్వకుండా వడ్డీ మాత్రం ఇస్తున్నావు'
అలాగా…. అందీ అందని అందమే ముద్దు... అన్నారో కవి..’. అయితే వడ్డీ పెంచేస్తాను'
'అంత ఏం చేసుకుంటావు. దేనికైనా... "
దేనికైనా అంటే శృంగారంలో కాదు బంగారూ. ..నాకైతే ప్రతీక్షణం తరించాలని పరమపదసోపానం"
"చాలు చాలు చాలు….'
అవంతిక ఇంకా ముందుకెళ్ళి చదవలేకపోయింది. కంప్యూటర్ ఆఫ్ చేసి బెడ్ మిద వాలింది. రేపు మేరేజ్ డే... అతనికి గుర్తుందో లేదో... తను గుర్తుచేయాలా, ఎందుకో ఏడుపొచ్చేసింది..
మొగుడూ పెళ్ళాల మద్దెన"ఈగో’లు ఉండకూడ దంది. తను ఫోన్ చేసి మధుకి గుర్తుచేసి రేపు ఏం ప్లాను చేసుకుందాం" అని అడిగితే.
ఊహూ…. ఎదురుగా ఫోటోప్రేమ్ లో తమ గ్రూప్ ఫోటో... చాలాసార్లు అది తీసేసి తను, మధు కలిసి ఉన్న ఫోటో పెట్టాలనిపిస్తుంది.
బెడ్ రూమ్ తమిద్దరి పర్సనల్ కదా... అనిపిస్తుం టుంది. అది కూడా అతను చేస్తే బాగుండును అనిపిస్తుంది. విశాలమైన బెడ్ తీసేసి పెళ్ళయిన కొత్తలో ఉండే డబుల్ కాట్ వెయ్యాలని... తామిద్దరూ ఒకరికొకరు తగులుతూవుంటే బాగుంటుందనిపిస్తుంది. ఏదీ జరగడంలేదు.
ఆ రాత్రి కూడా ఏం జరగలేదు... కాలం బోర్లా పడ్డట్టు స్తబ్దుగా ఉండిపోయింది. తెల్లవారుజామున నిద్రలో అతను ఆమె నడుంపై చేతిని వేశాడు.
ఆమె ఒంటిలో వేడి ఒక్కో నరంలోకి ఇంజెక్ట్ చేసినట్టయింది. కలవరించి కలవరించి చాలాసేపు ఆమె మరో లోకంలో విహరిస్తూ అతని కౌగిలింతల ఆగమనానికి ఎదురుచూసింది.అతను ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు.తెల్లవారింది. అతను పెళ్ళిరోజును గుర్తుచేస్తాడనుకుంది. ఎప్పటిలాగ ఆఫీసుకు టైమ్ అయ్యిందని హడావిడి చేస్తుంటే సూసైడ్ చేస్కోవాలన్నంత దిగులేసింది. తను చెప్పొచ్చుగా. తను ఎందుకిలా మూగదైపోయింది.
మనస్సు విప్పిచెప్పేస్తే తమ మధ్యనున్న అడ్డుతెర తొలగిపోతుంది కదా...
మధుభూషణ్ ఆఫీసుకు వెళ్ళాక పని గబగబా పూర్తిచేసింది. శ్రావ్య వస్తుంది. అది యక్షప్రశ్నలు వేస్తుంది. కొత్త బట్టలు చూపించలేదంటే. డ్రైవర్ ని పిల్చి కారు రెడీ చెయ్యమంది ఎప్పుడూ వెళ్ళే షాపుకే వెళ్ళింది. సింపుల్ గా అతనికోసం కుర్తా పైజమా, తనకో కాటన్ చీర తీసుకుంది.
ఆమె ఎప్పుడూ ఇంత సింపుల్ షాపింగ్ చెయ్యలేదని షాపుఓనర్ ఆశ్చర్యపోయాడు.మేరేజ్ డే గిఫ్ట్ గా ఆమెకో లేడీస్ హ్యాండ్ బాగ్ కారులో పెట్టించాడతను,వాళ్ళకున్నపాటి జ్ఞాపకం తన భర్తకి లేనందుకు దిగులేసింది. అన్నీ పాతబడిపోయాయా! జీవితం యాంత్రికంగా మారిపోయింది.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఔననకా.. కాదనకా.. BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 10:48 AM



Users browsing this thread: 1 Guest(s)