Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఔననకా.. కాదనకా.. BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#4
ఒకప్పుడు... చాలాకాలం క్రితం టిసిన్ కావాలి టిసిన్ కావాలి. అంటూ తనని వదిలేవాడు కాదు.

పిల్లలు ఉన్నారు అని తప్పించుకుంటుంటే ‘ఎట్లీస్ట్ కాఫీ ప్లీజ్ అంటూ పెదవుల్ని లాక్ చేసేవాడు.
సంజాయిషీ ఇచ్చుకోలేదు. ఏమి జరగనట్టే కాలం చట్రంలా తిరిగింది. అతనలాంటి సర్ప్రైజ్ మరోసారి ఆమెకి ఇవ్వలేదు. ఆమె కావాలని అడగలేదు.
ఇప్పుడు ఇన్నాళ్ళకి కాలం వెనక్కి తిరిగొస్తే బాగుండునని అనుకుంటోంది.అతనేదో సర్పైజ్ చేస్తే థ్రిల్ అవ్వాలని మనస్సు తనువు ఉవ్విళ్ళూరుతున్నాయి.
నాగమణి మాటలు గుర్తోస్తున్నాయి. ‘మీలాగ మాకు వారాలు వొజ్జాలు ఉండవండి... సుబ్రం అశుభ్రం అంట దూరకుండలేమండి.
ఆడికి కావాలంటే నా ఒంటిమీద సెయ్యేత్తాడు... నాక్కావాలంటే నేనాడిమీద సెయ్యేతానండి... మొగుడు పెళ్ళాల మద్దెన 'ఈగోలెందుకండి… తాను కావాలంటే అతను… ?
అవంతికకి ఏం చెయ్యాలో తోచక శుభ్రంగా ఉన్న ఇంటిని మరోసారి సర్దింది కొన్నింటిని ప్లేసు మార్చింది. వంట చేస్కుంది.
"అమ్మా బైటికి వెళ్ళాలా?" అని డ్రైవరు శీను అడుగుతుంటే... "లేదు. నేనెటూ వెళ్ళడంలేదు. నువ్వింక ఇంటికి వెళ్ళు." అంటూ పంపేసింది.
తనకోసం ఫ్రెడ్ రైస్ చేసుకుంది. కాసేపు పడుకుంద.ఏం చేసినా పొద్దు గడవనంటోంది. కూతురు శ్రావ్యకి ఫోన్చేసింది. చాలాసేపు మాట్లాడింది. మనవరాలి ముద్దుమాటలు విన్నది. “రేపు మీ మ్యారేజ్ డే కదా! స్పెషల్ ఏముంది!" అని శ్రావ్య అడిగిందానికి ఉస్పూరుమని నిటూర్చింది.
"ఏముంది? ఎప్పట్లాగే కొత్తబట్టలు వేస్కోటం... తర్వాత కుదిరితే గుడికి వెళ్ళడం. మీ డాడీ ఆఫీ సుకి. నేను ఇంటికి అంకితం ఐపోవడం... అంతకు మించి స్పెషల్ ఏముందని…."
"రేపు నేనొస్తాను మమ్మీ" అని ఫోన్ కట్ చేసింది శ్రావ్య. వండుకుని వడ్డించుకుని తిన్నది. కాస్సేపు టీవి చూసింది. మనసుకు బోర్ గా ఉందనిపించింది. కంప్యూటర్ ముందుకూర్చుంది. లోలోతుకుపోతూ ఉంది. మౌస్ క్లిక్ చేస్తోంది. వేళ్లు అసంకల్పితంగా నొక్కుతుంటే కళ్లు దూసుకుపోతున్నాయి. మనస్సు మరింత వేగంగా పరుగెడుతోంది.
సడెన్ గా ఆగిపోయింది. ఎవరో ఇద్దరి ఛాటింగ్ కనిపించింది. అదో కోడ్ భాషలా ఉంది. డబుల్ మీనింగ్స్ అన్పించి మనస్సు చాలాసేపు వాటిగురించి ఆలోచిస్తుంటుంది. ఈమధ్య అదో బలహీనత ఐపోయిందామెకి.
అంత బహిర్గతంగా వాళ్ళెలా వివరించుకుంటున్నారో సిగ్గుగా ఉండదా అని అనుకుంటూ ఉంది.
అయినా వాటిని తరచూ చదివి ఆస్వాదిస్తూ ఆనందిస్తోంది. అవన్నీ తనకి, తన భర్త మధుభూషణ్ కి అన్వయించుకుంటూ ఉంటుంది. తనలా చెప్పగలిగితే బాగుండేది. కనీసం భర్త అలా చెప్పినా బాగుండేది. "నువ్వు రాత్రి నన్నలా హత్తుకుంటే
ఎంతో బాగుంది తెలుసా?”
'ఎలా?'
"అదే కొత్తగా... అవును ఈమధ్య నువ్వెందుకో నాకు పిచ్చిగా నచ్చేస్తున్నావు... ఖజురహో శిల్పంలా నిన్నెంతగా ఎన్నిసారు చూసినా తక్కువనిపిస్తోంది’
"అంతగా నచ్చానా... ఖజురహో శిల్పంలా ఉన్నానా?' 'అవును. నాదో రిక్వెస్ట్...
" ఏంటో? శిల్పాలు నైటీలు వేసుకోవు...'





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఔననకా.. కాదనకా.. BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 10:47 AM



Users browsing this thread: 1 Guest(s)