Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఔననకా.. కాదనకా.. BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#3
"వారం తరువాత అయ్యగారు ఇంటికొస్తే ఆ పూజ కాకుండా ఈ పూజ ఏంటమ్మా"ఏ పూజ అన్నట్టుగా కన్ఫ్యూజన్ గా సైగచేసింది.
ఈయేల మంగళారం కాదుకదా... అమ్మగారు మౌనవ్రతం సెయ్యటానికి..." అది తలగోక్కుని వాకిలి చిమ్మి మల్లెపందిరి ముగ్గేసి లోపలికి వచ్చి అంట్లు తీసుకుంటూ తన మాటల చాతుర్యం సాగించింది.
"అమ్మగారు! మనీది చివర చౌదరి గారి ఇంట్లోకి రాత్రి ఎవరో గోడదూకి వచ్చేసినారని పట్టుకున్నారంట... తీరా సూత్తే అల్లుడుగోరంట... "
అవంతిక పూజ మర్చిపోయింది. "అల్లుడు ఎందుకు గోడ దూకడం" అని అడిగింది. అమ్మగారికియ్యాల మౌనవ్రతం లేదన్నమాట... సంతోషం వేసింది నాగమణికి చెప్పేవాళ్ళకి అడిగేవాళ్ళుంటేనే కదా మజాగా ఉంటుంది.
"ఆ... అల్లుడు గోరేనమా! ఆషాఢం కదా. ఆగలేక గోడ దూకేడంట... ఆ పిల్లమొగం సూడాల సిగ్గేడ దాచుకోవాల్నో తెలీకమొగుడ్ని గదిలోకి లాక్కు పోయింది. పాపం చౌదరిగారి పెండ్లాం ఒకటే మొత్తుకుందట... గుమ్మాలు మార్చాలని... నెలాగలేకవోయింర్నని" గొల్లున నవ్వింది.
అవంతిక తన ఆషాఢమాసం తంతు గుర్తుచేసుకుంది.
సిన్మాకి రమ్మని తీసుకెళ్ళి మధు భూషణ్ తన ఫ్రెండ్ మిసెస్ ఊరెళ్ళిందని అక్కడికి తీసుకువెళ్ళిపోయాడు.
వారంరోజులు... ఇంట్లోవాళ్ళు ఏమంటారో ఏమనుకుంటూరోనని తనూభయంతో బిగుసుకుపోతే ఆటను ఆలోచించే సమయాన్ని ఇవ్వకుండా రాత్రీ పగలు ఊపిరాడని కౌగిలిలో…
"అమ్మగారూ...! వారం తరువాత ఊర్నుంచి అయ్యగారొచ్చారు.రాత్రి నిద్దరోనిచ్చేరా లేదా?" అంది.
అవంతిక తుళ్ళిపడి చూసింది.
రాత్రి గుర్తొచ్చి గుబులేసింది. అంగట్లో అన్నీఉన్నాయి కానీ "ఆగవే ఆయన లేచినట్టున్నారు" ప్రసాదం నోట్లోవేసుకుని గబగబా ఫిల్టర్ కాఫీ రెడీచేసి తీసుకుని వెళుతుంటే వెనుక నించి నాగమణి అల్లరిగా” అంది.
"చీర బాగుంది. నలిగిపోద్దేమో జేగర్తాండి"అని.
దానికా చనువు అవంతికే ఇచ్చింది. అవంతిక ఒక్క క్షణం తుళ్ళింతయ్యింది. అలా జరుగుతుందా!
జరిగితే... ఆమె గదిలోకి ప్రవేశించే సరికి అతను బద్దకంగా బెడ్ మీద కదులుతున్నాడు.
గుడ్ మార్నిగ్... .” అంటూ కాఫీ అతని ముందుకు చూపింది. అతను చాలాసంతోషంగా ఆమెని చూశాడు.
సువాసనాభరితమైన ఆ ఉదయం పూట ఆమె చేతిలోని ఫిల్టర్ కాఫీని తనివితీరా ఆస్వాదించాడు. అందుకున్నాడు. ఆమె ఎదురుచూసింది.
అబ్బా! ఇంత చక్కని చిక్కని కాఫీ ఎక్కడా దొరకదు అవంతీ!' అంటూ ప్రశంసించాడతను.
ఆమెకి కావల్సింది ఆ ప్రశంస కాదు."అవంతీ! ఈ రోజు ఎంత లవ్లీగా ఉన్నావు... " అంటూ చిన్న ప్రశంసతోపాటు బిగికౌగిలి... ఫ్యాన్ గాలికి చీర కొంగు రెపరెపలాడుతోంది.
అందాలు మాకు స్వేచ్చ కావాలి అంటూ మొత్తుకుంటున్నాయి. ఆమె ఉసూరుమంది. అతను ఖాళీ కప్ ఆమె చేతికి ఇచ్చి "నేను స్నానం చేసొస్తాను టిఫిన్ రెడీ చేసేయ్ అవంతీ!” అంటూ బాత్రూమ్లోకెళ్ళిపోయాడు.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఔననకా.. కాదనకా.. BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 10:47 AM



Users browsing this thread: 1 Guest(s)