Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఔననకా.. కాదనకా.. BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#2
ఔననకా.. కాదనకా..
ఇంటర్ కమ్ మోగుతుంటే బద్దకంగా కదిలి కళ్ళు విప్పింది అవంతిక. “హాయ్ …. తలుపు తియ్యమ్మా ! తియ్యి" అంటూ భర్త మధుభూషణ్ మాట్లాడాడు. "ఈయనేంటి ఇంత డార్క్ నైట్ వచ్చారు."ఒక్క ఉదుటున తన బెడ్ మీంచి కిందికి గెంతిందామె. ఆర్థరాత్రి వరకూ టీవీలో మిడ్నైట్ షోస్ చూసి నిద్రపట్టక బెడ్ పై తోడులేక తపించి తపించి ఇలా కళ్ళు మూసుకుందో లేదో ఇంటర్కమ్లో భర్త రూపం... ఆమెకేదో మోహనరాగం ఆవహించినంత ఆనందం వేసింది.
మెయిన్ డోర్ తీసీ తీయగానే… ."హాయ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ నువ్వు నిద్రపో…. నేను ఫ్రెష్ అయి వస్తాను"అని మధుభూషణ్ ఆమె బుగ్గపై చిటికె వేసి బెడ్ రూమ్ కి ఎటాచ్డ్ గా ఉన్న బాత్ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్నాడు.
గాలి తీసిన బెలూన్ లా ఉసూరుమందామె. అతను రావడమే తనని గుండెలకు హత్తుకుని అన్నీ ‘ఐ మిస్ యూ’ అంటాదాని చాలాకాలంగా ఎదురు చూస్తుంటుంది.
క్యాంపుకెళ్ళిన ప్రతి సారీ అతనొచ్చే క్షణం వరకూ అభిసారికలా పరి తపిస్తుంటుంది. అతడు వస్తాడు, బుగ్గ మీదచిటికెవేస్తాడు. ఫ్రెష్ అయి వస్తానంటూ బాత్రూ రూమ్ లోకి వెళ్ళిపోతాడు.
నీట్నెస్ అంటే అతనికి ప్రాణం... తననీ ప్రాణమ లాగే ప్రేమిస్తాడు… కానీ అంతకుమించి ఏదోకావాలని తపిస్తుంటుంది తను. తనకేం కావాలో తనుచెప్పలేదు. అతనివ్వలేడు. అతను స్నానం చేసివచ్చేసరికి ఆమె కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తూ ఉంది.
ఆటను లైట్ ఆఫ్ చేసి... టచ్ మీ నాట్ అన్నట్టుగా అటు తిరిగి పడుకున్నాడు. ఆమె కళ్లలోంచి నీళ్లు జారీ దిండు కవరును కౌగిలించుకున్నాయి.
వాళ్ళిద్దరికీ పెళ్ళై పాతికేళ్ళు.కూతురికి తొందరగానే పెళ్లి జరిగింది.
కొడుకు యు.కె లో జాబ్ చేస్తున్నాడు. కూతురికో పాప. వాళ్ళు దగ్గరలోనే ఉంటున్నారు.
ఇంట్లో వాళ్లిద్దరూ... కావాల్సినంత లగ్జరీ... కాలు బైట పెడితే కారు డోర్ ట్రీసి రెడీగా ఉంటాడు డ్రైవర్.
ప్రమోషన్ మీద ప్రమోషన్ భర్తకి. లైఫ్ బిజీ అయిపోయిందామెకి అన్నీఅందుబాటులోనే ఉంటాయి. అందాల్సినవాటిని అందుకోలేని అనీజీనెస్… జీవితం చప్పగా ఉంది... అనుకుంటుంది ఆమె.
ఈ మధ్య మరీ ఇంటర్నెట్ కి అంకితం అయిపోయింది. తెలియకుండానే రకరాల సైట్స్ లోకి వెళ్ళిపోతూ చూడకూడనివి చూసేస్తూ చదవకూడనివి చదివేస్తూ కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుంది సుమా!
అనుకునేంత డైలమాలో బతికేస్తుంది అవంతిక. తెల్లారింది. రొటీన్ గా రోజు మొదలైంది. ఎప్పటిలాగే ఆరుగంటలకి తలారా స్నానం చేసింది.
భగవంతునికి ఆరాధనలో భాగంగా పూజ మొదలుపెట్టింది అవంతిక.
అమ్మగారు! అయ్యగారొచ్చి నటున్నారు..." రావడమే తుఫానులా వాగుతుంటుంది నాగమణి. అది పనిమనిషి అని మర్చిపోయి దాన్ని ఫ్రెండ్ లాగా ప్రేమిస్తుంటుంది అవంతిక. అది తనలోని ఎన్నో రుగ్మతలకి మందులా మాటలు చెప్తుంది.
చాలా ఇళ్ళలో అది పనిచేస్తుంటుంది కాబట్టి ఆలుమగల మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ విషయాలు గమ్మత్తుగా చెప్పడంతో డిస్కవరీ ఛానెల్లో చూస్తున్నటుగా అనిపిస్తుంది. పూజ చేసుకుంటూ తలూపింది, నాగమణి ప్రశ్నకి జవాబుగా అవంతిక.
Like Reply


Messages In This Thread
RE: ఔననకా.. కాదనకా.. BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 10:46 AM



Users browsing this thread: 1 Guest(s)