Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా ప్రేమ కథ BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#4
"ఏం మాట్లాడుతున్నావ్ రా...బుర్ర గాని బాత్రూం లో పెట్టొచ్చావా......."అన్నాడు విశాల్

"ఆహా....పంచ్ లు నామీద తర్వాత వేద్దువు గాని....బాబు పురుషోత్తం ముందు ఈ లెటర్ కి సమాధానం చెప్పు....అని లెటర్ బాక్స్ లో కనిపించిన ఉత్తరాన్ని అందిచాడు"....విశాల్ కి సిద్ధు.....
నువ్వే నా సమస్తం....
నువ్వే నా ప్రియ నేస్తం.....
నీతోనే నా జీవిత పయనం.....
నీ నవ్వే నాకు స్వర్గం...
నువ్వు లేని ప్రతిక్షణం నాకు నరకం.....
ఇంతగా అభిమానించే నా దరికి ఎప్పుడు నీ ప్రయాణం....?
"బావ బట్టలు సర్దుకున్నావా....లేక హెల్ప్ చేయనా...?????"అడిగాడు విశాల్
"ఏం వాగుతున్నావ్ రా...లెటర్ చదవమంటె....బట్టలు అంటావేంటి రా.....!!!!!"కోపంతో వూగిపోయాడు సిద్ధు....
"అదే రా......చెల్లి .....నా దరికి ప్రయాణం ఎప్పుడూ అని అడిగింది గా......అందుకే బట్టలు సర్దుకున్నావొ లేదొ అని అడిగా....నువ్వు నన్ను ఎప్పుడు అర్ధం చేసుకున్నావ్ అని? "కన్నీళ్ళు తుడుచుకున్నాడు విశాల్....
"రేయ్ అపరా బాబు....నీ ఎదవ నాటకాలు.......అవసరమా రా నీకివన్ని......"అన్నాడు సిద్ధు
"నువ్వు రా ఫ్రెండ్...అంటె.....నీ బట్టలు కూడా సర్దనివ్వను అన్నావంటే నీకు నేనంటే ఎంత కాదలొ (ప్రేమ)అర్ధమవుతుంది రా..కన్నా.....నువ్వె రా నా జాన్ జిగిరి......."ప్రేమ నిండిన కళ్ళతో అన్నాడు విశాల్
"కాదలా...?.... కరివేపాకా....ఆపరా రేయి......అవసరమా నీకివన్ని అంటే....అమ్మాయి నాకు లెటర్ రాయల్సినంత అవసరం ఏముంది నాయనా.....?అని..."అర్థం వివరించాడు సిద్ధు
"నేను నీకు లెటర్ రాశానా....అంటె యూ మీన్ నేను ఇందాక చదివిన లెటర్ నీకు నేను రాశానని నువ్వనుకుంటున్నావా....???"కళ్ళు తేలేస్తూ అడిగాడు విశాల్
"అనుకోడం కాదు కన్ ఫర్ం...నువ్వె రాశావ్......ఇదేమి పోయే కాలం రా నీకు...వెదవ....."తిట్టాడు సిద్ధు
"అపరా...బాబు....నాకంత కర్మ పట్టలేదు....చిటిక వేస్తె...100 మంది క్యూ లో నిలబడతారు నాకోసం...."గొప్పలు పోయాడు విశాల్
"అబ్బా ఛా అందుకేనా....నాకు లెటర్ రాశావ్...చీప్ గా......???"అడిగాడు సిద్ధు
"రేయి....నిన్ను చంపేస్తాను రా....నేనె రాశాను అని ఏ ఆధారాలతొ చెపుతున్నావ్ నువ్వసలు....???"లాజిక్ లాగాడు విశాల్
"అదా.....నిన్న నేను ఈ లేటర్ గురించి ఆలోచిస్తుంటె కరక్ట్ గా నువ్వొచ్చి....లవ్ లెటర్ వచ్చిందా...అని అడిగావ్...?
నువ్వు పంపకపోతే నీకెలా తెలుస్తుంది....చెప్పు రా చెప్పు....."వెటకారం గా అన్నాడు సిద్ధు.
"అబ్బబ్బ ఏమి లాజిక్ లాగావ్ రా....నీ లాజిక్ తగలెట్టా నేనెదొ ఊరికే అన్నా రా బావ నన్ను నమ్ము రా ప్లీజ్.....నన్ను వెరేలా చూడకు రా....ప్ల్లిజ్ నేను రాయలేదు....రా.....ప్లీజ్ రా......"అభ్యర్ధించాడు విశాల్
"నిజమేనా నువ్వు చెబుతుంది....?నమ్మొచ్చా...?"డౌట్ గా అన్నాడు సిద్ధు
"రేయ్ నిజం రా బావ సుహాసిని మీద ఒట్టు....."అన్నాడు విశాల్





Like Reply


Messages In This Thread
RE: నా ప్రేమ కథ BY పునర్కథనం &/ సంఖ్య�... - by LUKYYRUS - 20-11-2018, 10:44 AM



Users browsing this thread: 1 Guest(s)