Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా ప్రేమ కథ BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#2
నా ప్రేమ కథ
అనుకోని టైం లో అనుకోని విధంగా పరిచయమైనా తను మరొ పక్క....
తనని ఎంత గానో ఆరాదించే ఇంకొకరు మరో పక్క.....
ఇద్దరి లొ ఎవర్ని ఎంచుకోవాలి అనే సందిగ్ధంలో తనుండగా.....
విధి తనకి సహాయం చేసిందా.....లేకా.......సమస్యల్లో తోసిందా.....???
ప్రతి క్షణం నీ తలపుల్లో బ్రతికే నేను...నీకెదురవ్వాలని పరితపిస్తున్నాను.....అది చదివడంతోనె ఒక్కసారిగా నిద్ర మత్తు వదిలింది అతనికి
ఉదయం 5:30
తలుపు చప్పుడు కావడం తో.....నిద్ర మత్తులొ తూలుతున్న...సిద్ధార్ద్....లేచి తన రూం తలుపు తెరిచాడు....ఎదురుగా తోటమాలి రామయ్య....నవ్వుతూ నిల్చున్నాడు....
"ఏంటి పెదనాన్న....ఇంత పొద్దున్నే నేను గుర్తొచ్చాను నీకు ?"అన్నాడు సిద్ధు...
"అది బాబు.....నీకొసం ఎదో కవర్ వచ్చినాది...."అని సిద్ధు చేతికి అందించి......అలానే నవ్వుతూ ఆయన వెళ్ళిపోయాడు..
ఏంటీ లెటర్ అని తేరిపారా చూసిన....సిద్ధు...ఆ లెటర్ ని చదవడానికి నిశ్చయిచుకున్నాడు....ఆఫీస్ లెటరయితే సిద్ధు లైట్ తీసుకునేవాడె కాని....అది రెడ్ కవర్లొ చాలా ఆకర్షణీయంగా కనిపించేసరికి...తెరచాడు ఆ లెటర్ చదవడం కోసం....
కవర్ లాగె అందులోని అక్షరాలు కూడా చూడముచ్చటగా వున్నాయి....
లెటర్....
హృదయాంతరాల్లొ నీ పేరు చెక్కుకున్న నేను.....
నీ మది లొ చోటు కోసం వేచివున్నాను.....
ప్రతి క్షణం నీ తలపుల్లో బ్రతికే నేను...
నీకెదురవ్వాలని పరితపిస్తున్నాను.....
నా కళ్లలొ నిన్ను నింపుకున్న నేను....
నీ నవ్వు లొ వుండాలనుకుంటున్నాను......
నా ఈ కోరికను మన్నిస్తావా ప్రియతమా?
ఆ లెటర్ చదవడంతోనె....మిగిలివున్న కొద్దొగొప్పొ నిద్ర కాస్త ఎగిరిపోయింది.....సిద్ధు కి
వామ్మొ ఎవరు రాసుంటారు ఇది.....?అని ఆలోచిస్తూనే స్నానం చేశాడు....ఆలొచిస్తునే టిఫిన్ తిన్నాడు...అలానె ఆపీసుకు వెళ్ళాడు....
ఏమి చేసిన ఆ లెటర్ గురించి ఆలోచించడం మానలేదు........
లంచ్ బ్రేక్ రానే వాచ్చింది.....
"ఎంటొయ్.....ఎండి గారు....దీర్ఘంగా అలోచిస్తున్నారు ఉదయం నుంచి.....?"అంటూ వచ్చాడు సిద్ధు జిగిరి దోస్త్ విశాల్....
"ఏమీ లేదు రా...."అని చెప్పి కూడా...వీడికి చెప్దామా వద్దా అని ఆలొచించసాగాడు...సిద్ధు
"ఎంట్రోయ్....కొంపదీసి....లవ్ లెటర్ కాని వచ్చిందా ఏంటి.....?"అనుమానంగా అడిగాడు విశాల్...
"నేను ఏమి చెప్పకుండానే వీడి కెలా తెలిసింది అబ్బా...?అంటె వీడె కావాలని నన్ను ఆటపట్టించడానికి ఇదంతా చేస్తున్నాడా ఏంటి?????"అని అనుకుని......అడక్కుండా ఆగి పోయాడు....
ఇంతలో సెక్రటరి వచ్చి..."కొత్త ప్రాజెక్ట్...కోసం స్టాఫ్.....కావలని....అందుకోసం ప్రకటన ఇస్తే 300 అప్లికేషన్లు వచ్చాయి అని చెప్పింది....."
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: నా ప్రేమ కథ BY పునర్కథనం &/ సంఖ్య�... - by LUKYYRUS - 20-11-2018, 10:43 AM



Users browsing this thread: