Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పరాయి శ్రీమతి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#9
మనిద్దరం కలిస్తే.... ఆ కలయికను బహిరంగంగా చెప్పుకోలేని స్థితిలో మరో అబద్దపు జీవితాన్ని ఆరంభించాలన్నమాట. అదిప్పుడు అవసరమా? రహస్యంగా కలిసి ఒకరికొకరు అర్పించుకున్నంత మాత్రాన జంటగా మారిపోగలమా? మనిద్దరం ఓ జంటని ఈ లోకం ముందు తలెతుకుని దర్గాగా ప్రకటించగలమా? అయినా…. మనం అనుభవించని సౌఖ్యమా అది? మనం ప్రేమికులుగా ఉన్నప్పుడు శరీరాల్లో కుతకుతలాడే వేడి నెత్తురు అలజడి సృష్టిస్తూ…. ‘ఆపోజిట్ సెక్స్’ గురించి ఆరాతీయమని ప్రావోక్ చేస్తుంటే తమాషాగానే ఉండేది.

కానీ….. ఎవరి జీవితాలు వాళ్లకి ఏర్పడిన ఇన్నాళ్ల తర్వాత, అప్పుడు మిస్సయిన అనుభవాలు ఇప్పుడు కావాలనుకోవడం ఆశించడం ఏ మాత్రం అభిలషణీయం? శారీరకంగా ఏకం కాని స్వచ్చమైన స్నేహం మనది. ఆ స్వచ్చత అలాగే ఉండనిదాం.
నిన్న స్టేషన్లో రైలెక్కిన దగ్గర్నుంచీ వరుస కాల్స్తో అనుక్షణం నన్నే తలచుకుంటున్న నా భర్తని తలచుకుంటే నాకు గర్వంగా ఉంది. సమక్షం లోనే కాదు, పరోక్షంలోనూ ఆయన మనసంతా నేనే నిండి ఉన్నానన్న భావనే నాకెంతో సంబరమనిపించింది. బహుశా నీ భార్య కూడా నీ గురించి ఇంతలా తపిస్తూనే ఉంటుందనిపిస్తోంది. అమాయకంగా మన జీవితాల్లోకి అలుకుపోయిన వారిద్దర్నీ విస్మరించి మనిద్దరం కలిసి ఏదో సాధించాలనుకోవడం స్వార్ణం. మోసం కదా! ఈ సాయంత్రం నువ్వు మా ఇంటికి రావద్దు. వచ్చినా నేనుండను. కారణం, ఈ మధ్యాహ్నమే నేను మా ఆడపడుచుతో వాళ్లింటికి వెళ్తున్నాను. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు. నిన్ను కలవకముందే తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు ఆ నిర్ణయాన్నే అమలు పరచాలనుకుంటున్నాను. ఊరు నుంచి మా ఆయన ఇంటికి రాగానే వీలైనంత త్వరగా ఈ కాలనీలోంచి సిటీలో మరెక్కడికైనా మారిపోవాలనుకుంటున్నాను. ఇది నీ నుంచి పారిపోవడం కాదు. మనసు మార్చుకున్నాను. జీవితమంటే ఓ కలయిక..... ఓ వీడ్కోలు...... మన కలయిక ‘కల’ ఇక. ఈ వీడ్కోలే శాశ్వతం. తప్పుగా భావించకు మిత్రమా! మళ్లీ మనం కలవద్దు - వైదేహి.


*** THE END  ***





[+] 6 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: పరాయి శ్రీమతి BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 10:41 AM



Users browsing this thread: 1 Guest(s)