Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పరాయి శ్రీమతి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#8
"ఓ నాలుగు రోజులు గడిపేస్తే. పెళ్లికి ఎలాగూ రావాల్సిందే కదా!" అన్నాను నేను. విజయవాడ స్టేషన్నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ కదిలేదాకా తను మాట్లాడుతూనే ఉంది. ఆ మాటల్లో ఇద్దరం కలిసి తొలిసారి చూసిన సినిమా, తొలిసారి వెళ్లిన హోటల్ తొలిసారి చేసుకున్న దైవదర్శనం. మధ్యలో తేనెవెన్నెల జుర్రుకుంటూ గడిపిన హనీ మూన్ ట్రిప్. ఇలా అనేకానేక సంగతుల్ని ప్రస్తా విస్తుంటే ఆమెతో సాహచర్యం కమనీయ, రమణీయ కావ్యంలా తోచింది.

"నిజానికి, ఒంటరిగా నేనెక్కడికి వెళ్తున్నాను. ఇన్నాళ్లూ మీరు పంచిన మధురక్షణాల్ని జాపక సుమాలుగా సిగలో ముడుచుకుని... . ఆ పరిమళాల్ని అగ్రణిస్తున్నాను. అక్కడ మీరు కూడా నాలాగే ప్రతి క్షణం నన్నే తలచుకుంటున్నారు కదూ!” అడుగుతుంటే నా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. స్టేషన్లో తనకలా పేర్వెల్ చెప్తూనే.... కలలా కనిపించిన ఒకనాటి నేస్తంతో కబుర్లలో మునిగిపోయాననే పచ్చి నిజాన్ని చెప్పనా?
"చెప్పండి..." రెట్టించి మరీ అడుగుతోంది ప్రేమ.
"మాటిమాటికీ నువ్వే గుర్తొస్తున్నావు" అన్నాను నేను గొంతు పెగల్చుకుని.
"ఆ సంగతి నాకు తెలుసండి. పెళ్లి మంత్రాల్లో ఏ మహత్తుందో కానీ. ఓ ఆడా, ఓ మగా భార్యా భర్తలైన క్షణం నుంచీ శరీరాలు రెండైనా ఒకే ప్రాణమైపోతారు. ఒకే జీవితమవుతారు. ఒకేమాట.... ఒకే బాట.... ఒకే గమ్యంగా సాగిపోతారు. వీలైనంత తొందరగా మీరు రండి. మీ మరదలికి అక్షింతలు వేయడమే కాదు. క్షణమొక యుగంగా విరహంతో వేగిపోతున్న మీ ప్రియ శ్రీమతికి ఓదార్పు ఇచ్చేందుకు కూడా మీరు తొందరగా రావాలి. మీ రాక కోసం నిలువెల్లా కన్నులై ఎదురుచూస్తున్నాను. ఇక. సెలవా?" అంది ప్రేమ.
ఒకే తప్పకుండా వస్తాను. బెంగపడకు” అన్నాను నేను. ఆ క్షణం నుంచీ నాలో అపరాధ భావన. వైదేహి కనిపించగానే ఎంత తప్పుగా ఆలోచించాడు తను తలొంచి తాళి కట్టించుకుని. ఇంటి గడప తొక్కిన శ్రీమతి కాస్త పక్కకు వెళ్లగానే మనసావాచాకర్మేణా ఆమె పంచిన మధురాను భవాలన్నీ మరిచిపోయి మరీ ఇలా పరాయి శ్రీమతి వైపు పరుగులు తీయడం ఎంతవరకు సమంజసం? చీ... . చీ నా మనసు పెడదోవ పట్టింది. ఇప్పుడు….. ఈక్షణంలో ప్రేమ పోన్ చేయడం మంచిదే అయింది. చేస్తున్నదీ....... చేయబోతున్నదీ పునరాలోచించుకుని ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం చిక్కింది. వైదేహి కనిపించిన ఆ క్షణం నుంచీ మనసు కల్లు తాగిన కోతిలా ఎన్ని గెంతులు వేసింది. ఎన్ని చిత్రాలు చేసింది. ఆలోచిస్తుంటే సిగేస్తోంది. ఇక వైదేహిని అస్సలు కలవకూడదు. ఒకవేళ తను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకూడదు అనుకున్నాను నేను.
****
తెల్లారి లేచిన వెంటనే సెల్ ఫోన్ చెక్ చేస్తే…. శ్రీమతి దగ్గర్నించి పది మిస్డ్ కాల్స్ బహుశా తను విశాఖ చేరి ఉంటుంది. ఆ సంగతి చెప్పేందుకు పోన్ చేసి ఉంటుంది అనుకుంటుండగానే ఇన్ బాక్స్లోకి ఓ మెసేజ్ వచ్చిపడింది.
ఆ మెసేజ్ వైదేహి దగ్గర్నుంచి.
ఏమై ఉంటుంది?" ఆలోచిస్తూ ఆ మెసేజ్ ఓపెన్ చేశాను. సుదీర్ఘమైన మెసేజ్ అది.
"నిన్న నువ్వు అనూహ్యంగా కనిపించావు. ఆనందమేసింది. ఆపుకోలేని ఉద్వేగానికి లోనై చనువుగా నీ చేతినందుకుని మరీ ముద్దాడాను. 'రారమ్మ’ని ఇంటికి కూడా ఆహ్వానించాను. ఆ తర్వాత ఆలోచిస్తే... . ఎప్పుడో విడిపోయిన బంధాన్ని ఇప్పుడు అతికించి ఏం ప్రయోజనం? నువ్వు కేవలం స్నేహి తుడివే అయితే ఫరవాలేదు. కాఫీ ఇచ్చి కాలక్షేపం చేయొచ్చు. కానీ…. స్నేహానికి మించిన ప్రేమ మన మధ్య ఉంది కదా! నువ్వూ నేనూ కలిసిన ఆ ఏకాంత క్షణాల్ని ఏంచేస్తాం? ఒంటరితనాన్ని వెలి వేసి జంటతనాన్ని ఆహ్వానించగలమా? ఆ తర్వాత నీ భార్యకీ, నా భర్తకీ తెలీకుండా ఆ రహస్యాన్ని దాచగలమా? అలా ఎన్నాళ్లు...... ఎన్నేళ్లు?





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: పరాయి శ్రీమతి BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 10:40 AM



Users browsing this thread: 1 Guest(s)