20-11-2018, 10:39 AM
దాంతో తనేమైనా మాట్లాడుతుందేమోనని నా మాటలకి కొద్దిసేపు విరామం ప్రకటించాను.
సరిగా అదే పంధాను అనుసరించిందేమో..? తనూ నిశ్శబ్దానాశ్రయించింది.
కాసేపటి తర్వాత ఇద్దరం ఒకేసారి "వీలైతే నాలుగు మాటలు.... కుదిరితే కప్పు కాఫీ" అంటూ మళ్లీ మాటలు కలిపాం.
అరగంట క్రితం శ్రీమతి జతగా స్టేషన్లోకి అడుగు పెట్టాను. అది చాలా రొటీన్. ఇప్పుడు వైదేహి తోడుగా బయటికి వస్తున్నాను. ఇది వెరైటీ ఓ దేవత చేయి పట్టుకుని నడిచొస్తున్న ఆ క్షణాలు జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ క్షణాలే.
***
"ఒకేమాట.... ఒకేబాట.... ఒకే గమ్యం" అన్నాను నేను. దగ్గర్లోని కాఫీడేలో ఇద్దరం కూచుని "వన్ బై టూ" కాఫీని షేర్ చేసుకుంటుండగా.
"రెండు గమ్యాలు. రెండు జీవితాలు" అంది తను చటుక్కున నా మాటల్ని విబేదిస్తూ.
ప్రశ్నార్థకంగా ఆమె వంక చూస్తే, "నిజం…. మన మిద్దరం మరో ఇద్దరితో రెండు వేర్వేరు దారుల్లో ఇక్కడికి చేరుకున్నాం. నీ వైఫ్ని రైలెక్కించడానికి నువ్వూ…. ఆఫీస్ టూర్ కెళ్తున్న నా హజ్బెండ్తో కలిసి నేనూ ఈ స్టేషన్కొచ్చిన సంగతి మరిచిపోతే ఎలా సారూ" అంది వైదేహి.
'ఎలా సారూ?’ అంటూ అప్పుడప్పుడు నన్ను తను ఓ రేంజ్లో ఆటాడుకున్న దృశ్యాలు చటుక్కున కళ్ల వాకిళ్లలో ఒక్కసారిగా మెదిలాయి. అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మారు మాట్లాడకుండా కాఫీ సిప్ చేస్తుంటే మళ్లీ తనే అంది- "ఒకప్పుడు ఇద్దరం ఒకటవ్వాలనుకున్నా మరో ఇద్దరు ప్రవేశించడంతో నలుగురయ్యాం. మన జీవితాల్లోకి నీకో పెళ్లాం, నాకో మొగుడు వచ్చి చేరారు".
ఆ మాటలన్న తర్వాత భారంగా నిటూర్చిందో... అది నా భ్రమో తెలీక తికమకపడుతూనే - "పెళ్లి వరకూ దారి తీయని ప్రేమకథగా మిగిలిపోయాం" అన్నాను.
"అనుకోకుండా మళ్లీ ఇలా కలిశాం, జీవితం అంటే ఇదేనేమో. ఓ కలయిక... ఓ వీడ్కోలు" అంది వైదేహి. ఆమె కనిపించిన మొదటి క్షణంలోనే నాలో నేను అనుకున్న మాటల్నే మళ్లీ తన నోట వింటుంటే పట్టరానంత ఆనందంగా ఉంది.
ఆ తర్వాత టాపిక్ డైవర్డ్ చేస్తూ వైదేహి - "చాలా సీరియస్గా మాట్లాడేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పు…. ఎక్కడుంటున్నావు. ఏం చేస్తున్నావు? " అడి గింది.
ఆ తర్వాత ఆమె అడిగిన ప్రశ్నలు, నే చెప్పిన జవాబులను బేరీజు వేసుకుంటే... మేమిద్దరం మళ్లీ ఒకే కాలనీలో పక్క పక్క వీధుల్లోనే ఉన్నట్లు తెలిసింది. భర్త ఉద్యోగ బదిలీ రీత్యా నెల్లాళ్ల క్రితమే వైదేహి ఈ ఊరొచ్చింది.
“అంటే... మళ్లీ మనం తరచూ కలుస్తుండవచ్చన్న మాట..." అంది నవ్వుతూ.
“మళ్లీ అదేంటీ?”
"ప్రతి కలయిక తర్వాత ఓ వీడ్కోలు తప్పని సరి. ఇప్పుడిలా కలుసుకున్నాం. విడిపోకుండా ఇక్కడే... ఇలాగే ఉండిపోతామా? కదలమా?" అంటూ టేబుల్ పై గిరాటేసిన తన వ్యానిటీ బ్యాగ్ని భుజాన వేసుకుని తను లేచింది.
"అప్పుడే?"
"నాకూ వెళ్లాలనిలేదు. అయితే, ఇంటిదగ్గర మా ఆడపడుచు ఎదురు చూస్తుంటుంది. బాధ్యత"
అంది వైదేహి ముఖం గంటుపెట్టుకుని మరీ.
ఇక నేనూ లేవక తప్పలేదు.