Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పరాయి శ్రీమతి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#4
"ఔను.... ఒక్కసారి. ఒకే ఒక్కసారి" అన్నాను బతిమాలుతున్నట్లు గతంలో ఇలాంటి ఫార్మాలిటీ లేకుండా

ఒకర్నొకరం మట్టుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు మా ఇద్దరి మధ్యా ఎవ్వరూ లేకున్నా... కనిపించని తెర ఏదో మా సాన్నిహిత్యాన్ని అడ్డుతున్న ఫీలింగ్.
నవ్వింది తను. ఆ నవ్వుకు అర్థం తెలీలేదు నాకు.
"పర్మిషన్ కావాలా?"
"పరాయి సొత్తవి కదా!" అన్నాను నేను. నిజానికి, పెళ్లి.... ఓ ఆడను, ఓ మగను ఒకటిగా చేస్తుంది. కానీ, అదే పెళ్లి ఇద్దరు స్నేహితుల్నీ వేరు చేస్తుందనడానికి మేమిద్దరమే సాక్ష్యం.
అంటే?”
"మరొకరి శ్రీమతివి".
"ఔనా..? ఫ్రెండ్వనుకున్నాను. అందుకే ఈ స్టేషన్లో ఇంతమంది ఉన్నా నీ దగ్గరికి వచ్చి ‘హలో…!' చెప్పాను" అంది తను.
"అది తెలుసు." అన్నాను నేను.
"సరే... నువ్వన్నట్లే నేను ఇంకొకరి శ్రీమతిని. నా చేయి పట్టుకోవాలంటే మరి, నా పర్మిషన్ ఎందుకు? ఆ అడిగేదేదో ఆయన్నే అడుగు" అంది వైదేహి మూతి సున్నాలా చుట్టి. తను ఎప్పుడూ అంతే!మూతి సున్నాలా పెట్టి రెచ్చగొడుతుంటుంది.
"ఎవర్ని... మీ ఆయన్నా? బాగుంటుందా?"
"ఏంటి బాగుండేది?"
"అదే.... ఒక్కసారి పర్మిషనిస్తే మీ ఆవిడ చేయి పట్టుకుంటానని మీ ఆయన్ని అడగడం ఏమైనా బాగుంటుందా? అని" చిన్నగా నవ్వాను.
"పిచ్చిమొద్దూ! నిజంగా చేయి పట్టుకోవాలనిపిస్తే పర్మిషన్ అక్కర్లేదు. ఇదిగో... ఇలా పట్టేసుకోవడమే" అంటూ చొరవగా తనే నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని పెదాలతో ముద్దాడింది.
ఆకలై అంబలి అడిగితే ఏకంగా అమృతాన్నే చిలకరించిన దేవతలా కనిపించింది వైదేహి ఆ క్షణంలో నాకు. నిజానికి, మనింట్లో విరగగాసిన జామపండు కన్నా. గోడ దూకి పక్కింటి పెరట్లో దొంగిలించిన పండుకే తీపి ఎక్కువన్న సంగతి అప్పుడే కొత్తగా అవగతమవుతోంది నాకు.
"ఈ చిలిపి నేస్తం ఇక ఎప్పటికీ నాది కాదంటూ ఆమె మెడలోని తాళి నావంక చూస్తూ ఎగతాళి చేస్తున్నా. ఆమె ఇచ్చిన చనువు నాలో అంతులేని సంబరాన్ని నింపింది. తనూ నాలాగే ఆలోచిస్తోందేమో? అనిపించింది నాకు. నా చేతిని కాసేపు ఆమె చేతిలో అలా ఉంచాను. అది తప్పనిపిస్తున్నా…. ఎంతో బాగుంది. అప్పట్లో ఒకర్నొకరు ఇష్టపడుతున్న దశలో…. ఏ ఒక్కటీ ఒప్పుకోకుండా అన్నీ పెళ్లయ్యాకేనంటూ తప్పించుకు తిరిగింది తను. కాస్త చొరవ తీసుకుని అప్పుడప్పుడూ ఇచ్చిపుచ్చు కున్న ఎంగిలి ముద్దులు.... దొంగచాటు కౌగిళ్ళు తప్ప ‘అసలు కార్యం’ అలా’.... కలలా మిగిలిపోయింది. ఆ కల సాకారమయ్యే ముహూర్తం వరించి రానుందా? ఆకాశాన్ని తాకుతున్న ఆశలు. అయినా.... తనకూ నాకూ ఆకాశానికీ, నేలకూ మధ్య ఉన్నంత వ్యత్యాసం. ఆమెని అందుకోగలడా? హృదయానికి హత్తుకుని ఓ రాత్రంతా సేదతీరగలడా? ఆలో చిస్తూ ఆమె వంకే అలా చూస్తున్నాను.
ఆ తర్వాత కొద్ది క్షణాలకు - "ఇక్కడే ఇలా ఈ స్టేషన్లోనే ఉండిపోదామా?" మరోసారి ఇద్దరి నోటినుంచి ఒకే మాటలు.... టీవీ చానెల్స్లో ఒకే సారి ఇద్దరి మాట్లాడే చర్చల మాదిరి.





[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: పరాయి శ్రీమతి BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 10:38 AM



Users browsing this thread: 1 Guest(s)