Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పరాయి శ్రీమతి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#2
పరాయి శ్రీమతి
జీవితం రైలు ప్రయాణం లాంటిది. ఓ కలయిక, ఓ వీడ్కోలు” అన్నారెవరో?
ఆ మాటలు నిజమనిపించేలా జరిగిందా సంఘటన. తన చెల్లి పెళ్లి సన్నాహాల నిమిత్తం ఓ వారం ముందుగా విశాఖకు బయల్దేరిన శ్రీమతిని ఆ సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కించి అలా వీడ్కోలు చెప్పి ఇలా వెనక్కితిరిగానో లేదో…. నవ్వుతూ కనిపించింది వైదేహి.
"నువ్వేంటిక్కడ?" ఇద్దరినోటా ఒకేమాట.
"శ్రీమతిని రైలెక్కించేందుకు...." నేచెప్తున్న వాక్యం పూర్తి కాకుండానే, ఆత్రుత ఆపుకోలేక వైదేహి కూడా అనేసింది- "హజ్బెండ్కి వీడ్కోలు చెప్పేందుకు". "నువ్వెలాగున్నావు?"
"ఇదిగో.... ఇలా!" ఏకకాలంలో మా ఇద్దరి నుంచి మళ్లీ ఓ ప్రశ్న.... ఓ సమాధానం.
ఏకవచనం ప్రయోగించుకునే చనువు మా ఇద్దరికీ ఉంది. కారణం, ఒకప్పుడు ఒకే ఊరిలో, ఒకే కాలనీలో కలిసి తిరిగాం, ఒకే స్కూల్, ఒకే కాలేజీ కాకున్నా ఒకే క్లాసు చదువుకున్నాం. అవసరాలకనుగుణంగా క్లాస్ పుస్తకాలు ఇచ్చి పుచ్చుకున్నాం. ‘కంబైన్డ్ స్టడీస్' పేరుతో కొన్ని నిద్రలేని రాత్రులు గడిపాం. సబ్జెక్ట్లకు సంబంధించి సందేహాలు తీర్చుకుంటూ వార్షిక పరీక్షలు రాశాం. ఉత్తీర్ణత సాధించినప్పుడు ఉప్పొంగిపోయాం. అంతేకాదు.... భవిష్యత్తులోనూ ఇలాగే కలిసిమెలిసి జీవితం సాగించాలని ఎన్నో కలలు కన్నాం. అనూహ్యంగా ఆ కలలన్నీ కల్లలు కావడంతో “ఎవరికి వారే యమునా తీరే....” అనుకుంటూ ఇప్పుడిలా విడివిడిగా బతికేస్తున్నాం.
మొదట్లో మేమిద్దరమూ కేవలం స్నేహితులమే. ఆ తర్వాత్తర్వాతే.... స్నేహానికి మించిన మ్యాజిక్ మా మధ్య "సమ్థింగ్ స్పెషల్”గా సాగుతోందని తెలిసి వచ్చింది. సరిగా అప్పుడే.... ఎప్పుడెప్పుడు కలుసుకుంటామా? అనే ఎదురు చూపులు కలుసుకోలేని పరిస్థితుల్లో పిచ్చిచూపులు. కలుసుకున్న వెంటనే.... కలుసుకున్నామనే ఆనందం అరక్షణమైనా మాలో మిగలకుండా కాసేపట్లో విడిపోతామనే బెంగ భయం. దిగులు.
అంతేనా! కలుసుకున్న ప్రతిక్షణంలోనూ చుట్టూ ఉన్న లోకాన్ని మరిచి కళ్లల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం, ఒకరి చేతిని మరొకరు ఆత్మీయంగా సృశిస్తూ అనిర్వచనీయానందాన్ని ఆహ్వానించడం, అంతలోనే గమ్మత్తుగా పెదాలపై ముద్దుల ముద్ర లేయడం, గాఢమౌన కౌగిళ్లలో ఒడుపుగా, ఒద్దికగా ఒకరికొకరు ఒదిగిపోవడం.
ఆ జాపకాలు తలచుకున్న కొద్దీ ఇప్పటికీ ఒళ్లంతా థ్రిల్లింతే!
కలుసుకున్న ప్రతి సందర్భంలోనూ తప్పని ఓ వీడ్కోలు. విడిపోయేముందు గుండెల్నిండా బాధ. దూరమవుతూ... చేతులూపుతూ ‘బైబై….’ చెప్తుంటే శరీరంలోని అతి విలువైన భాగమేదో కోల్పోతున్నట్లు కళ్లను కమ్మేస్తూ నీటి తెర ఫలితం... ఎదుటి దృశ్యాలన్నీ మసకబారి పోవడం, ఆపై కళ్లు తుడుచుకుంటూ తను కనిపించేదాకా చూపులు సారించడం.
ఆ ప్రేమపిచ్చిలో తలమునకలవుతూ మాలో
మేం సంబరపడుతుండగానే వైదేహి పెళ్లి హఠాత్తుగా జరిగిపోయింది. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని కాదనే దైర్యం తనకి లేక. ఎదురుపడి నచ్చచెప్పే సాహసం నేను చేయలేక అలా చేష్టలుడిగిన సమయంలోనే తను పెళ్లి కూతురైపోయింది. "కనీసం కలిగి బతుకుదామం’టూ నిక్కచ్చిగా ఓ నిర్ణయాన్ని గట్టిగా ప్రకటించలేక…. లేచి పోదాం రారమ్మని చేయందించలేక\... ఓ పక్క నేను నరక యాతన అనుభవిస్తున్న సమయంలోనే తల వంచి ఆమె తాళి కట్టించేసుకుంది.
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: పరాయి శ్రీమతి BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 10:37 AM



Users browsing this thread: 2 Guest(s)