20-11-2018, 10:28 AM
''భారతంలో ఏం రాశాడు? దుష్యంతుడు వేటాడ్డానికి వచ్చాడు. శకుంతలను చూశాడు. గాంధర్వ వివాహం అన్నాడు. వెంటనే రెడీ అన్నాడు. శకుంతల నీలాగ పగలూ, రాత్రి అని నస పెట్టకుండా..''
''చాల్లెండి మీ మెట్టవేదాంతం. నాకు ఆకలేస్తోంది. రండి రెస్టారెంట్* కెళ్లి తైరుసాదం తిందాం.''
''మనకు చివరికి మిగిలేది యీ పెరుగన్నం, చద్దన్నమే. యవ్వనంలో వున్నంతకాలం యిలా సిగ్గుపడుతూ కూచుంటే ముసలితనంలో చద్దన్నమే గతి..''
''.. అబ్బ, మీకు అన్నిటికీ తొందరే, అప్పుడే ఏదో ముంచుకుపోయినట్టు...కాస్త అలవాటు పడనీయండీ...''
**********
విఠల్*కు యింకో అసంతృప్తి కూడా వుంది. అతను చదివిన అనేక సరసమైన కథల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి సరిగంగ స్నానాలు చేస్తారు. భార్య స్నానం చేస్తూ తువ్వాలుకోసం అడిగితే భర్త అది అందిస్తూ తనూ లోపలికి దూరిపోతాడు. కానీ విశాల విషయంలో తను తువ్వాలు మర్చిపోయిన సందర్భం ఒక్కటీ లేదు. కలిసి స్నానం చేద్దామంటే వురిమి చూసింది. తను స్నానం చేశాక ఓ సారి చూస్తే బట్టలన్నీ తడిసివున్నాయి.
''అదేమిటి!? బట్టలతోటే స్నానం చేశావా!?'' అడిగాడు ఆశ్చర్యంగా. ''ఇదేమన్నా పెరట్లో బాల్చీ పెట్టుకుని స్నానం చేయడమనుకున్నావా? హాయిగా నాలుగు గోడల మధ్యా షవరేసుకుని స్వేచ్ఛగా స్నానం చేయకుండా...''
''పల్లెటూరిలో పెరిగాను కదండీ, మా అలవాట్లు మావి...'' తుంచేసింది విశాల.
''...అంటే సినిమాల్లో చూపించినట్టు నువ్వు చెర్లో యీతలు కొడుతూ, నూతి గట్టుని కౌగిలించుకుని పాటలు పాడుతూ, వూళ్లో కుర్రాళ్లకు కనువిందు చేసేదానివా?'' కోపంగా అడిగాడు విఠల్*.
''అబ్బ, మీతో ఏం మాట్లాడినా కష్టమే.. ఏమేమో వూహించుకుంటారు. ఇప్పుడు వూళ్లల్లో చెరువులెక్కడున్నాయి, యీతలాడడానికి! అన్నీ కబ్జా చేసి పడేశారుగా!'' విసుక్కుంది విశాల.
********
రాత్రివేళ సుఖాలందుకోవడంతో తృప్తిపడటం లేదు విఠల్*. హనీమూన్* తను అనుకున్న తీరులో విశృంఖలంగా జరగటం లేదన్న అసంతృప్తి, బాధ అతన్ని తొలచివేస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న అతని చికాకు, కోపం చూసిన విశాల బెదురుతూనే ''బయటకు షికారు వెళదామంటే అక్కర్లేదంటారు. రోజంతా గదిలో కూచుని టీవీ ఏం చూస్తాం? పోనీ సినిమాకు వెళదామా?' అంది.
''ఇక్కడ సినిమాలు ఏం ఉద్ధరించాయి? అరవ సినిమాలు మనకు అర్థమై ఏడిస్తే కదా..'' దాదాపు అరిచాడు విఠల్*.
''మన హోటల్*కి దగ్గర్లోనే వున్న పాత థియేటర్*లో హిందీ సినిమా ఆడుతోందిగా..'' బెదురుతూనే చెప్పింది విశాల.
''అదా, ఎప్పటిదో యిక్ష్వాకుల కాలం నాటి సినిమా.. సత్యం, శివం, సుందరం..''
''ఎంత పాతదైతేనేం? చూడనివాళ్లకు కొత్తదేగా! నేను చూళ్లేదు, మీరు చూశారా?''
''..లేదు''
''..యింకేం మరి..''