20-11-2018, 10:27 AM
పాత్రా యిలా లేదు. చీకటైనా, వెలుతురైనా సరే, గది తలుపు మూయగానే అప్పటిదాకాఅందుకే కాచుకుని వున్నట్టు మొగుణ్ని ముద్దులతో ముంచెత్తుతుంది. కౌగిలిలోవూపిరి సలపకుండా చేస్తుంది. నిమిషాల్లో వొంటిమీద బట్టలను జారవిడుస్తుంది.
క్షణాల్లో భర్తనూ పుట్టినరోజు పాపాయిని చేసేస్తుంది. కానీ విశాల తంతే వేరు. ఏకాంతంలో నైనా సరే పైటయినా జారనీయదు. చేరువగా కూచుంటుంది కానీ ముద్దాడనీయదు.
ఏ మాటకా మాట చెప్పాలి. రాత్రి అయ్యాక, గదిదీపాలు ఆర్పేశాక రెచ్చిపోతుంది, రసిక సామ్రాజ్యాన్ని ఏలుతుంది. ఒక్క దెబ్బతో విఠల్* కోపతాపాలను శమింపజేస్తుంది.
అప్పటికి అతని అలుకలు తీరతాయి కానీ తెల్లారగానే తిరిగి వచ్చేస్తాయి. ''నన్ను ఓ ముద్దు పెట్టి నిద్ర లేపవచ్చుగా..'' తో మొదలు పెట్టి ''ఈ వూళ్లో చూడడానికి ఏమీ
లేవు. బోర్*. ఆ కొండలూ, లోయలూ అన్నీ వేస్ట్*. నిన్ను ఆసాంతం స్టడీ చేస్తే
చాలు.'' అని సణుగుడుతో రోజంతా గొణుగుతాడు.
ఆమె వినిపించుకోదు. బుగ్గ మీద చిటికేసి జోకులేసి వూరుకోబెడదామని చూస్తుంది.
ఇంకా వినకపోతే 'అలా బయటకు పోయి ప్రకృతి అందాలు చూద్దాం పదండి' అంటుంది.
నేచర్స్* బ్యూటీ అంటూ నేరకపోయి వూటీకి తీసుకొచ్చాను కదరా భగవంతుడా అనుకున్నాడు విఠల్*. ఇదే వాళ్ల అమ్మమ్మగారి వూరయితే బయటకు వెళ్లాలంటే భయపడేది కదా. చచ్చినట్టు యింట్లోనే వుండేది.
బయట వున్నంతసేపు చేతిలో చేయి వేసుకోవచ్చు, దగ్గరకు లాక్కోవచ్చు, అంతేగాని ముద్దులూ, కౌగలింతలూ కుదరవు కదా. ఇదేమీ ఫారిన్* కాదు. చీకటి పడితే ఫర్వాలేదు కాస్త ముద్దూ ముచ్చటా తీర్చుకోవచ్చు, అభ్యంతర పెట్టదు. కానీ వెధవది, వూళ్లో అన్ని చోట్లా వీధిదీపాలు పెట్టి చచ్చారు మునిసిపాలిటీవాళ్లు. జనసంచారం లేని కొండలవైపు వెళ్లి చూద్దామా అంటే దారి తప్పిపోతామన్న భయం ఒకటి.
''అందుకే బయట తిరగడం ఎందుంటాను. హాయిగా రూములోనే వుంటే ఎంత లెవెల్* కెళినా ఫర్వాలేదు..'' అన్నాడు విఠల్* విసుక్కుంటూ.
''రూము కెళ్లినా చీకటి పడకుండా ఎలా?'' అంది విశాల నవ్వుకుంటూ.
విఠల్* వుడుక్కున్నాడు. ''చీకటి ఎందుకు పడాలని? కొత్తగా పెళ్లయినవాళ్లు పగలూ, రాత్రి ఒకటి చేయాలి...''
''..అంటే రాత్రి కూడా పగల్లాగ దూరంగా వుండాలనా?''
''..నీ మొహం! పగలు కూడా రాత్రిలా చేరువవ్వాలని..''
''కానీ, పగలు అలాటి పనులు చేయకూడదంటారు పెద్దలు..''
''...వెధవరూల్స్* పెట్టారు మనసులేని రాక్షసులు.''
''వాళ్లు కాదు, అలా కలిస్తే పుట్టేవాళ్లు రాక్షసులవుతారట..''
తెలియకపోతే సరి. దుష్యంతుడూ, శకుంతలా పగలే కలిశారు. వాళ్లకు రాక్షసుడు పుట్టారా? లేదే! భరతుడి లాటి గొప్పవాడు పుట్టాడు. ఆయన పేరే పెట్టుకున్నాం మన దేశానికి..''
''..నేన్నమ్మను.''
''ఏవిటి నమ్మవ్*? భరతుడి పేరు మన దేశానికి పెట్టుకున్నారనా!?''
''కాదు, దుష్యంతుడు, శకుంతల పగలే...''
''.. పగలే..!?''
''..అబ్బ అదేలెండి. మీరు పెద్ద చూసివచ్చినట్టు చెపుతున్నారు..''