20-11-2018, 10:21 AM
‘ఇప్పుడేమంత టైమైపోయిందని. ఇంతకీ ఏం స్పెషల్స్* చేశావు? వంటింట్లోకి చొరవగా వస్తూ అంది మామ్మ.‘అబ్బే, పెద్దగా ఏం చెయ్యలేదు’ నవ్వుతూ చెప్పిన లావణ్య ‘బావా, నువ్వు త్వరగా స్నానం చేసిరా. టిఫిన్* రెడీ’ అనడంతో కారుణ్య బాత్రూంలో దూరాడు. వెంటనే కారుణ్య ‘లావణ్యా, గీజర్* వేసి ఎంతసేపయింది? నీళ్ళు సలసలా మరిగి పోతున్నాయి’ అన్నాడు.‘ఏమో బావా, గుర్తులేదు. పని హడా విడిలో పడి కట్టడం మర్చిపోయాను. అంతగా వేడిగా ఉంటే కాస్త చన్నీళ్ళు కలుపుకో. ఈ మాత్రం దానికి అంతలా అరవాలా?’ చిన్నగా కసురు కుంటూ అంది లావణ్య.‘అదేంటే లావణ్యా! నా మనవణ్ణి అంతలా తీసి పారేస్తున్నావు. అయినా అబ్బాయి స్నానా నికి వెళ్ళేముందే కాస్త వాడికి వేన్నీళ్ళు తీసి పెడితే నీ సొమ్మేం పోయింది’’ అని అంది మామ్మ.‘నువ్వు ఊరుకో మామ్మా. ఇప్పుడు ఇటు వంటివన్నీ అలవాటు చేస్తే రేప్పొద్దున అటు నా పని, ఇటు భర్త పని చెయ్యలేక చాలా ఇబ్బందులు పడాలి’ మామ్మకి టిఫిన్* పెడుతూ నవ్వుతూ అంది లావణ్య.‘సరే తల్లీ, నీ గురించి తెలియక ఏదో అన్నాను. చూడు అబ్బాయి స్నానం అయినట్లుంది. వేడి వేడిగా టిఫిన్* ఇవ్వు’’ అంది మామ్మ.‘అబ్బా మామ్మా, అక్కడ హాట్*కేస్*లో పెట్టాను. అలాగే పక్కన చెట్నీ కూడా ఉంది. బావకి అల వాటే! వడ్డించుకుంటాడు’ నవ్వుతూ చెప్పింది లావణ్య.‘ఏం, మొగుడికి ఆ మాత్రం టిఫిన్* వడ్డిస్తే అరిగిపోతావా, కరిగిపోతావా’ అడిగింది మామ్మ.‘ఏం అరిగిపోను. కరిగిపోను.
మొగుడికి ఇటు వంటి కొత్త అలవాట్లు చెయ్యకూడదు మామ్మా! ఒకసారి అలవాటు చేశామా, పీకకి చుట్టు కుంటుంది’ మెల్లగా అంది లావణ్య
‘ఇది మరీ బావుందే తల్లీ! ఏదో చాదస్తం కొద్దీ చెప్పాను. ఎంతైనా సత్తెకాలపు దాన్నికదా, నాకిన్ని తెలివితేటలు ఎక్కడివి? అవి ఉండి ఉంటే నేనూ మీ తాతని ఓ ఆట పట్టించే దాన్ని. ఏ మాట కామాటే చెప్పాలి, మీ తాతగారు ఏనాడూ ఆయన చేత్తో వడ్డించు కున్న పాపాన పోలేదు. అన్నీ ఎదురు గుండా ఉన్నా, నేను వడ్డిస్తేనే గాని తినేవారు కాదు’ భర్తవంక ముసి ముసిగా చూస్తూ అంది మామ్మ.‘ఇంకా నయం, తాతగారు నిన్ను ముద్దలు కలిపి ఇమ్మన లేదు’ అంది లావణ్య.‘ఆ ముచ్చటా అయ్యింది తల్లీ. ఒక్కొక్క సారి గోరుముద్దలు పెట్టమంటే అవి కూడా తినిపించేదాన్ని. అప్పుడు మీ తాతగారు ఏం చేసేవారో తెలుసా... నా వేలుని కొరికే వారు’ సిగ్గుగా అంది మామ్మ.
‘అమ్మో! తాతయ్యేం తక్కువవారు కాదన్న మాట’ అంటూ లావణ్య అక్కడే ఉన్న తాతయ్య పురుషోత్తం కేసి చూడ్డంతో ఆయన మనసు లోనే గర్వపడుతూ ‘ఏమిటే రాజ్యం చిన్నపిల్లతో నీ వేళాకోళాలు. వెళ్ళి నా స్నానానికి నీళ్ళు సిద్ధం చెయ్యి’ అని అనడంతో ‘చూశావామ్మా, ఇదీ భాగోతం’ అన్నట్లుగా లావణ్యకేసి చూసిన మామ్మ ఆయనకి నీళ్ళ ఏర్పాట్ల కోసం బాత్రూంలోకి వెళ్ళింది.‘లావణ్యా, నేను ఆఫీసుకు బయలుదేరు తున్నాను’ అని కారుణ్య అనడంతో ‘ఓకే బావా’ అని సింపుల్*గా చెప్పిన లావణ్యను చూసి ‘అదేమిటే పిల్లా! భర్త ఆఫీసుకు వెళుతుంటే భార్య ఎదురు రావాలి. అలాగే గేటుదాకా వెళ్ళి సాగనంపాలి. అప్పుడు ఆ మగనికి అంతా శుభమే జరుగుతుంది. అవునా’ అని లావణ్యను అడిగింది.‘చూడు మామ్మా, నువ్వింకా సత్తెకాలంలోనే ఉన్నావు. ఇప్పుడెవరికంత తీరికుందని, ఒకరి కొకరు టాటాలు చెప్పుకోవడానికి. ఆ రోజులు ఏనాడో పోయాయి. భర్త దారి భర్తదే. భార్య దారి భార్యదే’’ అంది లావణ్య.‘‘చూడమ్మాయ్*! నువ్వలా అంటే నేను ఒప్పుకోను. మీ తాతగారు కాలేజ్లో పనిజేసి నంత కాలం నేను ఎదురు రాకుండా ఎప్పుడూ ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు. అలాగే వీధి గేటు వరకు ఆయన్ను సాగనంపందే నా మనసు ఒప్పుకునేది కాదు.