Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సామవేద సారమిది BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#7
అయిష్టంగానే బట్టలు సర్దుకున్నాడు అభిమన్యు. "ఏమిటండీ వీడు. మన ఉద్రేకంలోంచి ఉద్భవించిన వాడే కదా... ఎందుకింత జడత్వం." భర్త దగ్గర " వాపోయింది అహల్య.

"నీ అంత జాణతనం కోడలికి లేదేమో... కాస్త్ర వివరించవే సఖీ!" భార్య నడుము దగ్గరున్న మడతను చేతివేళ్ళతో సుతారంగా మీటి అన్నాడు ప్రసాద్.
బయలుదేరబోతుండగా కోడలితో చెప్పింది అహల్య. “మనస్వి! నీకేం కావాలన్నా నీవు నిర్భయంగా తీసుకోగల హక్కు.. అధికారం నీకున్నాయని మర్చిపోకు. మనం కొన్ని నేర్చుకుని పాటించి తీరాల్సిందే. స్త్రీలో అందం అణకువే కాదు యుద్దాన్ని కూడా ఇష్టపడతాడు మగాడు. అర్థంచేసుకో" తలూపింది మనస్విని.
అహల్య కోడలి నుదురు ముద్దుపెట్టుకుంది. నవ వధూవరులు హనీమూన్ కి బయల్దేరారు. ఇంకా బాత్రూమ్ లోంచి రాడేంటి ప్రవరాఖ్యుడు, షవర్ లోంచి వాటర్ శబ్దం విన్పిస్తోంది. ఆమె హోటల్ మేనేజర్ నెంబర్ కి కాల్ చేసింది.
"రెండు గంటలు మా కాటేజ్ లో కరెంటు సప్లయి తీసేయండి... డిస్టర్బ్ చెయ్యొద్దు” అని చెప్పింది మేనేజర్ కి.
కానీ…”
"చెప్పింది చెయ్యండి దట్సాల్" ఆమె తర్వాత మొబైల్ ని బెడ్ కిందికి తోసింది. టీపాయ్ మీదున్న కాటేజ్ కీస్ కబోడ్ లో సెటిలయ్యాయి. ల్యాండ్ లైన్ వైరున్న ప్లగ్ లాగి కనిపించకుండా సర్టింది.
ఇప్పుడీ మగాడు అష్టదిగ్భంధంలో ఉంటాడు. గురుడికి ఊపిరాడదు. ఏం చేస్తాడు వ్రతభంగం కాక..మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్... నడుంమీద రెండు చేతులు ఆనించుకుని రూమ్ అంతా ఓసారి చూసి అతని రాకకోసం ఎదురు చూస్తూ బెడ్ పై వాలింది. బాత్రూమ్ డోర్ ఓపెనైంది. అభిమన్యు చూడకూడదనుకుంటూనే మనస్విని వైపు చూశాడు. అతని గుండె గబగబా కొట్టుకుంది.
"కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ కళ్ళుమూసుకుని మనస్సుని యోగముద్రలోకి పంపించాడు.
అది తిట్టకుంటూ ధ్యానముద్రలో కూర్చుంది. అతను రెండో అడుగు వేశాడో లేదో పవర్ కట్ అయ్యింది. రూమ్ అంతా చీకటి ఆలుముకుంది. ఏది ఎక్కడుందో... ఎవరు ఎక్కడున్నారో కనిపించడం లేదు. “ఏంటిది?” తిట్టుకున్నాడు.
ప్లీజ్! నా మొబైల్ ఇవ్వవా!...." అతను రిక్వెస్టింగ్. ఆమె వెక్కిరించింది.
"నాకెలా కనిపిస్తుంది" అతను తడుముకుంటూ చాలాసేపు మొబైల్ కోసం వెతికాడు. అతని చేతికి మొబైల్ దొరకలేదుగాని చలువ రాతిశిల్పంలారిటి స్పర్శ శరీరాన్ని
చలితో వణికించింది. గబుక్కున చేయి వెనక్కి లాక్కున్నాడు. తడుముకుంటూ బెడ్ చుట్టూ తిరిగి ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్నచోటు చేతికి తగిలింది, అతను రిసీవర్ఎత్తి చెవి దగ్గర పెట్టుకుని నెంబర్ తిప్పుతూ షాకయ్యాడు. అది డెడ్ నిశ్శబ్దం. కీస్ కోసం టీపాయ్ దగ్గర వెతికాడు... దొరకలేదు...
"కీస్ తీశావా!" అడిగాడు. "మీరే కదా తీసుకున్నారు" నిదానంగా బదులిచ్చిందామె. అభిమన్యు ఉసూరుమంటూ బెడ్ పైన కూర్చున్నాడు.





[+] 2 users Like LUKYYRUS's post
Like


Messages In This Thread
RE: సామవేద సారమిది BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 10:13 AM



Users browsing this thread: 1 Guest(s)