Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సామవేద సారమిది BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#5
"చాల్లే ఊర్కో! నీ అనుమానం నువ్వూనూ, రేపు శోభనం ఎలా చెలరేగి పోతాడో చూడు. అప్పుడు అంటావు. అబ్బా! నీ అల్లుడు సామాన్యుడు కాదు అని" అంటూ ముగించింది. ఆ రాత్రి కూడా వచ్చే సింది. అందరి ఆశీస్సులతో అల్లరి హాస్యాలతో మేని బరువెక్కుతుంటే గదిలోకి వచ్చింది.

యవ్వనానికి పుప్పొడి అద్ది ఆస్వాదించమని ఆహ్వానిస్తున్నట్టుంది రాత్రి.. వెలిగే అగరొత్తులు.. కాలం పరుగెత్తుతోంది.. ఉండగానే వాడుకోండి అన్న వేదాం తాన్ని సూచిస్తూ బూడిద నిర్లిప్తంగా రాల్చుతున్నాయి.
మల్లెలు పరువాల పరుగెప్పుడు వన్, టు, త్రీ గో… అంటూ ఎంకరేజ్ చేస్తున్నట్టున్నాయి.
పాలుపంచుకోండి త్వరగా చల్లారకముందే అంటుంటే స్వీట్స్, ఆశగా ఏమైనా స్వీట్ టిప్స్ కొత్తగా చూడాలనుకుంటున్నాయి.
పళ్లు ఆటాడుకుందాం రా. అంటారేమో నవ వధూవరులు అన్నట్టు చూస్తున్నాయి. పూలబాణమేశా ఎదకంది ఉంటదీ... అన్నట్టు తియ్యని నిట్టూర్పుతో పైన పరిచిన లవ్ సింబల్స్ చూస్తూ వేగిర పడుతూ బరువును అంచనా వేస్తోంది బెడ్.
అన్నే బానే ఉన్నాయి కానీ, బెడ్ పైన ప్రవరాఖ్యుడు మాత్రం ఊరేగింపుకు తయారైన విగ్రహం లా ఎవరితోనో చాటింగ్ లో ఉన్నాడు. భార్య గదిలోకి వచ్చేవరకు ఆగలేకపోయాడట.
మనస్విని ఆశించింది ఏది జరగలేదు. కాళ్ళు ఇంక మావల్ల కావట్లేదు అని వేడుకుంటుంటే సిగ్గుని పక్కకి నెట్టి అతని పక్కనే బెడ్ పైన కూర్చుంది. ఆతను ఓసారి ఆమె వైపు చూసి ఒద్దికగా పక్కకి జరిగి కూర్చుని తిరిగి తన పనిలో లీనమయ్యాడు. ఆమె సెగలు పోగలవుతోంది. కోరికలు కొలిమి రాజేస్తుంటే అతని సాయం కోసం దేహం ఎదురుచేస్తోంది.
అమ్మ చెప్పింది. అందరు చేసేదే… సిగ్గుగానే అన్పిస్తుంది కానీ… ముడుచుకుపోకు. ఈ కాలం పిల్లలకు ఏం చెప్పక్కర్లేదు. అయినా రేపు మరోలా ఐతే అమ్మ ఆ మాత్రం చెప్పొద్దా అనుకుంటారు. అర్థమైంది కదా! ఆవిడ సిగ్గుగా సూచానలు చేసింది సెన్సార్ కటింగ్ లా …
అర్ధరాత్రి కావస్తున్నా హడావుడేం లేదు అభిమన్యు లో ‘విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి’ అన్న వాలకం కాదుగా ఈ మనిషి కలవరపడ్తోంది మనస్విని. అగరవత్తుల బూడిద తప్ప అన్నీ అలాగే ఉన్నాయి. ఆగడానికి నాకేంటి దురద అన్నట్టుగా కాలం కోడెక్కింది. రాత్రి కరిగి పగలయ్యింది.
ఒక్క రాత్రికేనా, ఇంకా బోలెడు రాత్రులు ఉన్నాయి” అంటూ కూతుర్ని సముదాయించింది .
"ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకు. మరోలా అనుకుంటారు" అని మర్మం బోధించింది.
అన్నింటికీ తలూపింది మనస్విని.
ఆ రాత్రిలాగే మరో రెండు రాత్రులు గడిచాయి. ఎలాంటి గురుతులు మిగల్చలేదు కాలం, మూడు నిద్దరు అయ్యాక ప్లేసు ఊరు మారింది. దంపతుల తీరులో మార్పులేదు... తల్లడిల్లింది తల్లి.
అత్తగారు గమనించింది. కొత్త పెళ్ళికూతుర్లో సిగ్గులు పూతరేకుల దొంతరుల తియ్యదనం లేదు.గాలి తగిలితే చాలు కదిలే పూరేకుల అలజడి కోడలి కళ్ళలో కన్పించలేదు. విరహం తాలూకు అయోమయం ఆమె శరీరంలో శృతిలయలు సృష్టించడం లేదు. ఆలుమగల మధ్య ఉండాల్సిన దగ్గర తవంతో కూడిన పలకరింపులు లేవు.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: సామవేద సారమిది BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 10:11 AM



Users browsing this thread: 1 Guest(s)