Thread Rating:
  • 6 Vote(s) - 2.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హనీమూన్BY పునర్కథనం BY సంఖ్యానువాదం: అన్నెపూ.......
#3
నేను నిల్చున్నాను.

"రా గదిలోనికి వెళ్దాం" అన్నాను.
"వద్దు. ఇంకా బాగా వర్షం రానీయండి" అంది ఆమె, నాకు మరింత దగ్గరగా వచ్చేసి.
ఆ వాతావరణంలో, ఆమె స్పర్శ నాలో ఏదో కొత్త స్పందనకు తావిస్తోంది. ఆమెను బింకంగా కౌగిలించుకున్నాను. వర్షం జోరు ఎక్కువైంది. ఇద్దరం తడుస్తున్నాం. అంత వరకు క్రమంగా కింద నుండి ఎగిజిమ్ముకుంటూ పైకి ఎగిసిన ఆవిరి వాసనలు సడన్ గా పల్చబడ్డాయి. చల్లదనం ఆవరిస్తోంది. వర్షం హోరు పెరుగుతుంది.
చిక్కని చల్లదనం గిలిగింతలు పెడుతోంది.
ఆమె మెడ వెనుక జుత్తులోకి నా కుడి అర చేతిని పోనిచ్చి, దానితో బిగుతుగా ఆమె జుత్తును బిగపట్టి ఆమె తలను వెనుకకు అనువుగా వంచాను. వెంటనే ఆమె పెదాలను నా పెదాలతో అందుకున్నాను. వాటిని నొక్కి పట్టాను ... చుంబించాను ... చుంబించాను ... చప్పరించాను ... చప్పరించాను ... ఒడుపుగా ఆమె నాలుకను అందుకుని దానిని చప్పరిస్తున్నాను.
ఆమె నుండి చిన్నగా రొప్పుతున్నట్టు, వగరుస్తున్నట్టు ధ్వనులు విన వస్తున్నాయి. అవి నన్ను మరింతగా రెచ్చగొడుతున్నాయి. ఆ తమకంలో, ఇద్దరం ఆ బయలు ప్రాంతంలోనే ఒక్కటిగా కిందకు కుప్పకూలేలా ఒరిగిపోయాం. ఒకటిగా ఒదిగిపోయాం - కరుచుకు పోయాం - చివరాఖరున నేనే సడన్ గా విడి, ఆమె పైనుంచి ప్రక్కకు జరిగిపోయాను.
ఆ వర్షపు నీటిలోనే తడుస్తూనే అలిసిన శరీరాలను కదల్చలేక సొమ్మసిల్లేలా నిద్రలోకి వెళ్లిపోయాం.
మెలుకువ వచ్చింది. ఇంకా చీకటి ఉంది. వర్షం లేదు. తేరుకొని చూసుకొంటే నా మీద దుప్పటి కప్పబడి ఉంది. ఆమె లేదు. ఆదరాబాదరాగా లేచాను. దుప్పటిని, పక్కన పడి ఉన్న నా బట్టలను కలిపి అస్తవ్యస్తంగా ఒంటికి చుట్టేసుకుంటూ, గది వైపు నడిచాను. గది తలుపు దగ్గరగా వేసి ఉంది. తలుపు తోసుకొని లోనికి వెళ్లాను.
ఆమె మంచం మీద పడుకొని ఉంది. ఎప్పుడు లేచి వచ్చేసిందో?
కరెంట్ వచ్చి ఉంది. ఫ్యాన్ గాలి చల్లగా ఉంది.
గది తలుపు బోల్టు బిగించి, మంచం అంచున చేరాను. శరీరం బడలికతో బరువుగా ఉంది. దాంతో తడిచిన ఒళ్లు ... తలంతా చల్లగా తడితడిగా ఉంది. కాస్తా చిరాకుగా ఉంది.
లేచి వెళ్లి, షర్టు జేబులోనించి సిగరెట్టు పెట్టె తీశాను. దానిలోనుంచి ఒక చాక్లెటు తీసి నోట్లో వేసుకున్నాను. చాక్లెటు చప్పరిస్తూ తిరిగి మంచం వైపు చేరాను.
మనస్సు కుదుట పడుతోంది. శరీరం విశ్రమిస్తోంది.
చాక్లెటు రుచి కంటె, అప్పటి ఆమె మాటలు గుర్తొచ్చి, అవి ఇప్పుడు మంచి 'కిక్' ఇస్తున్నాయి.
నిజమే, ఆ రోజు, నేను ఆమె ఎదుట సిగరెట్టు ముట్టించాను. ఆమె చాలా ప్రశాంతంగా, సున్నితంగా వారించింది. "మీకు చదువు ఉంది. ఆలోచించే బుద్ధి ఉంది. పొగ పీల్చడం మంచిది కాదు అన్నది యదార్ధం. ఏదో పరిస్థితి మూలంగా లేదా ప్రలోభం చేత అది మీకు అలవాటై ఉండవచ్చు. అయినా మీ అలవాటు ఎదుటి వారిని ఇబ్బంది పాలు చేయకూడదు" అంటూ ఆగి - మళ్లీ ఆమె అంది - "బలహీనత మహా చెడ్డది. ఏమరుపాటుగా లేని క్షణంలో అది పట్టి, ఇక వదలదు. అది ఏదోలా పట్టిందని, దానిలో ఏదో గమ్మత్తు లభిస్తుంది అని సరి పెట్టేసుకుంటూ పోవడం వివేకం అనిపించుకోదు. చెడును వదిలించు కోవాలన్న దృఢ నిశ్చయానికి రాగలిగితే ఆ బారి నుండి బైట పడడం కష్టం కాదు"
నేను వింటున్నాను.
ఆమె చెప్పుతోంది - "మొదట కష్టంగా ఉండవచ్చు. పొగ తాగనదే ఉండలేమన్న స్థితి లోనూ ఉండవచ్చు. అది ఎంత లాఘనంగా ప్రవేశించినా, అంత లాఘనంగానే దాన్ని విడవవచ్చు. మొదట సిగరెట్టుల సంఖ్యను రోజువారీగా తగ్గించుకుంటూ పోవాలి. తర్వాత సిగరెట్టు పెట్టెలో సిగరెట్లు బదులు, చాక్లెట్లు పెట్టుకొని, జేబులో ఉంచుకోవాలి. పొగ పీల్చాలనిపించేటప్పుడు గమ్మున, అప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పెట్టెను తీసి, దాంట్లోని ఒక చాక్లెట్ నోట్లో వేసుకోవాలి. ఇది చూసే వారికి, చేసే వారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అయినా సరే, అలా కొన్నాళ్లు చేస్తే, ముల్లును ముల్లుతోనే పెరకవచ్చు అన్నట్టు, ఏ ఏబెట్టునైనా - ఎబ్బెట్టైనా పనితోనే వదులు తుంది." - తర్వాత ఆమె కొద్దిసేపు చెప్పడం ఆపింది.
తిరిగి ఆమె అంది, "పొగ త్రాగడం, మత్తు పానీయాలు తాగడం అంటే నాకు నచ్చవు. అలాగని నా కోసం మీరు ఆ అలవాట్లను వదులు కోండని మిమ్మల్ని కోరను. కాని వాటి వలన నాకు, పుట్టబోయే మన బిడ్డకు చెడు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మీదని గుర్తు చేస్తున్నాను. ఇక ఆలోచించుకోండి" అని ముగించింది.
అప్పటికి అలా ఆమె చెప్పడం ముగించినా, ఆమె మాటలు మాత్రం నన్ను క్రమంగా మార్చగలుగుతున్నాయి.
నోట్లో చాక్లెటును గబగబ నమిలి పూర్తిగా మింగేశాను.
ఆమె దుప్పటిలోకి దూరాను. ఆమెను దగ్గరగా లాక్కున్నాను. ఆమె శరీరం ఇంకా నగ్నంగా ఉందని పోల్చుకోగలిగాను. ఆమె నుదుట ముద్దు పెట్టు కున్నాను. ఆమె తలా తడితడిగా ఉంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె -
"రాత్రి నేను గదిలోకి వచ్చేస్తూ, మిమ్మల్ని కుదిపాను. మీరు లేవలేదు" అంటూ -
"తెల్లవారిపోయిందా" అని అడిగింది.
"తెల్లవారుతోంది" చెప్పాను.
"మరి, నేను వెళ్తాను. మా వాళ్లు లేచి ఉంటారు. ఎనిమిది గంటలకు రైలు కదా. మళ్లీ ఆషాఢం తర్వాతే కలిసేది" అంది నా మీదకు మరింతగా ప్రాకిపోతూ.
"అందుకే ఆషాఢంలో నువ్వు అక్కడ, నేను ఇక్కడ కంటే, హనీమూన్ టూర్ లో చక్కా ఉందాం" అన్నాను.
"వద్దు, కుదరదు అన్నానుగా" అందామె చటుక్కున.
నేను మళ్లీ దిగులుపడ్డాను.
"మన పూర్వీకులు ప్రకటించిన సాంప్రదాయాలు అర్ధవంతమైనవి. వాటి ఆచరణ, అమలు విధానాలు, నేటికి అనుగుణంగా మనం మార్చుకొన్నా, వాటి ఆంతర్యాలను విస్మరించరాదు. అలాగైతేనే వాటి ఫలితాలు మనమూ అనుభవించగలం." అంది ఆమె.
"ఏముంది. ఆషాఢంలో కొత్త దంపతులు కొన్నాళ్లు విడిగా ఉండండి అన్నది గొప్పా" అన్నాను ఉక్రోషంగా.
"ముమ్మాటికి. ఆ మాసం ఎడబాటుతో, పిమ్మట ఎంతో, ఏదో మధురాతి మధురం పొందవచ్చుననిపిస్తోంది. పొందగలమనిపిస్తోంది" అన్నాదామె.
నేను ఏమీ అనలేదు. తర్వాత ఆమె చటుక్కున లేచి, మంచం దిగింది. చకచకా నైటీని ధరించింది.
వెంటనే నా పెదాలపై గాఢంగా ముద్దు పెట్టుకొని ఆ గది లోనుంచి బైటకు నడిచింది - "ఆషాఢం కాగానే మరు నిముషాల్లోనే, మీరు నా దగ్గరకు వచ్చేయాలి. వస్తూ, మన హనీమూన్ టూర్ కు, మీకు నచ్చిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని, అక్కడకు మనకు టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకొని, వాటిని పట్టు కొని రండి." అని చెప్పేసి.
ఒక్కసారి గట్టిగా తల విదిలించుకున్నాను.
క్రమంగా నా మనస్సు, శరీరం ఆర్తితో పులకరిస్తున్నాయి, పరవశిస్తున్నాయి, పరితపిస్తున్నాయి - ఆ రాబోవు మా 'హనీమూన్'కై.

*** THEEND ****





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: హనీమూన్BY పునర్కథనం BY సంఖ్యాను�... - by LUKYYRUS - 20-11-2018, 10:02 AM



Users browsing this thread: 1 Guest(s)