Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
#87
ఏలినాటి శని

ప్రస్తుతము గ్రహ ప్రభావములో ఎక్కువగా ప్రచారములో ఉండి భయమును కలిగించేవాటిలో ఏలినాటి శని ప్రభాము ఒకటి. కుజ దోషము, కాల సర్ప దోషము, రాహు కేతు ప్రభావము, ఏలినాటి శని ఇలా కొన్ని గ్రహస్థితుల ప్రభావాలను తెలుసుకొనుటకు ఈ విధముగా పేర్లు పెట్టినారు.

నిజానికి ఏ గ్రహము తనకు తానుగా మంచి చెడు వంటి ప్రభావము చూపదు. కర్మ సిద్ధాంతమును అనుసరించి చేసిన కర్మల ఫలితాన్ని వారు ఇచ్చుటకు అధికారులుగా ఉన్నారు.
కావున కర్మలను అనుసరించే ప్రభావము చూపిస్తారు.

దైవాంశములతో గ్రహములు ఆకాశమున నిలిచి కాలమును నడిపిస్తూ మానవులకు సుఖ దుఃఖములను కలిగిస్తాయి తప్ప వారంతట వారు ఇచ్చుటకు అధికారము లేదు.

ఈ ఏలినాటి శని ప్రభావము ప్రస్తుత కాలములో చాల ప్రాచుర్యములో ఉన్నది, ఏలినాటి శని అంటేనే ప్రజలు భయముతో అవునట్లు తయారయినది కాలము.

ఓరి పిచ్చివాడా ఏ గ్రహమయినా తన ధర్మమును తాను నెరవేరుస్తుంది వారికి నీపై ఏ ప్రతీకార కక్షలు ఉండవు, నీవు చేసిన ధర్మ ఖర్మల ఫలమును సుఖ రోపములో పాప కర్మల ఫలములను దుఃఖ రూపుగా వారు అనుభవింప చేస్తారు తప వారు దైవాంశ సంభూతులు అని శాస్త్రములో అంతగా చెప్పలేదు.

దైవము ఒకరికి అపకారము చేయలేదని వారు ధర్మ బద్ధులని చెప్పకపోవుట చేత శనిని చూస్తె భయము, ఏలినాటి శని అంటే భయము, అష్టమ శని అంటే భయము ఇలా శని అన్నచో మానవులకు దైవ భావముకన్న భయభావము పెరిగి పోయినది దీనికి పండితులు కొంత కారణము అయినా ఎక్కువగా స్వార్ధము బుద్ధితో ఎదుటి వాని నుండి ధనము రాబట్టుకు ధర్మ బుద్ధి లేని కొందరి జ్యోతిష్యులు కారణముగా తెలుస్తున్నది. ఇటు వంటి అధర్మ పరులైన కొందరి వలన మంచివారికి కూడా చెడ్డపేరు వచ్చినది దానివలన ప్రజలలో నమ్మకము తగ్గినది.

ఏలినాటి శని ప్రభావము అంటే ఏమిటి ? అది అందరికి ఒకేలా ప్రభావము చూపిస్తుందా? అనే విషయాలు చక్కగా తెలియాలి.

భూమిపై నుండి ఆకాశములో చూస్తె ప్రతీ గ్రహము సంచారము చేస్తున్నట్లు కనిపిస్తుంది. నిజానికి ఒక సూర్య గ్రహము తప్ప మిగిలిన గ్రహములు అన్నియు మరియు భూమితో సహా సూర్యుడి చుట్టూ పరిభ్రమణము చేస్తాయి.

ఇలా భూమి పై నుండి చూస్తున్నపు ఆకాశములో ఉండే నక్షత్ర మండలాల మీదుగా ప్రయాణము చేస్తున్నట్లు కనిపిస్తాయి. వాటి ఆధారముగా ఏ గ్రహము ఏ రాశిలో ఉన్నది అని గణితభాగము ద్వార తెలుసుకొను చున్నాము.

ఇలా శని గ్రహము 12 రాశులలో 27 నక్షత్రములపై సంచారము చేస్తూఉంటాడు.

ఏలినాటి శని సంచార ప్రభావాన్ని రెండు రకములుగా తీసుకుంటున్నారు.

1. జన్మ లగ్న ఆధారముగా
2. జన్మ రాశి (చంద్రుడు ఉండు రాశి)

ఈ రెండు విధములుగా ఏలినాటి శని పభావఫలము తెలుపుచున్నారు.

ఇందులో జన్మ లగ్న ఆధారముగా ఏలినాటి శని ప్రభావము వాస్తవము. జన్మ రాశిని అనుసరించి చెప్పడము సరి అయింది కాదు దాని వలన ఫలము నిష్ఫలము.

ఏ ఫలము అయినా జన్మ లగ్నమును అనుసరించే చెప్పాలి. జన్మ రాశి అనుసరించిన ఫలము రాదు.

ఏమిటి ఏలినాటి శని?

శని భగవానుడు జన్మ లగ్నములలో ద్వాదశ, లగ్న, ద్వితీయ స్తానములపై అనగా 12, 1, 2 సంచారము చేసినప్పుడు చూపు ప్రభావాన్ని ఏలినాటి శని ప్రభావము అని అంటారు.

పన్నెండు రాశులు ఉన్నవి కదా మరి ఈ 3 స్థానములలో శని సంచారాన్ని ఎందుకు ఇంతగా చెపారు అనెది ముఖ్యమయిన విషయము.

ఎలినాటి శని అందరికి ఒకే రీతిగా ప్రభావము చూపిస్తుందా?

12 లగ్నముల వారికి వేరు వారు రీతిగా ప్రభావము చూపిస్తాయి. 12 లగ్నముల వారికి 12, 1, 2 స్థానములు ఎప్పటికి ఒకటిగా రావు, కావున ఏలినాటి శని ప్రభావము వేరు వేరుగా ఉంటుంది. ప్రతీ లగ్నమునకి వేరుగా ఉంటుంది.

లగ్న ద్వాదశాత్తు ఏలినాటి శని ప్రభావము ప్రారంభము అవుతుంది. చంద్ర లగ్నాత్తు(చంద్ర రాశి) ఏలినాటి శని ప్రారంభము కాదు. ఇది అనుభవమున ఎవరునూ చూపలేరు.

ఎలినాటి శని ప్రభావము అందరకి కీడునే కలిగిస్తుందా?

శని కొన్ని లగ్నములకు శుభుడు కొన్ని లగములు ఆశుభుడు. ఏ లగ్నమునకు అయినా శుభుడు ఎన్నడూ కీడు కలిగించడు. నీ పుణ్య ఫలము నీకు కీడు కలిగిస్తుంది అనుట అధర్మము. అలాగే శని భగవానుడు జాతకుని కర్మ రీత్యా పుణ్యము ప్రసాదించు వాడిగా నియమితుడైనందున వారు పుణ్య ఫలమును అనుభవింప చేస్తారు తప్ప దుఖమును కలిగించరు.

ఆ శని భగవానుడు పాప కర్మమును అనుభవింప చేయుటకు నినయము చేయబడిన ఆ జాతకునికి ఆ కర్మల ఫలము దుఃఖ రూపముగా రోగ రూపముగా ఆయా రూపములుగా కీడు కలిగిస్తాడు. కావున శని పాపము లేదు నిత్య పుణ్యుడు దైవము.

ఒక గ్రహము శుభుడా లేదా పాపియా అనేది లగ్నమే నిర్ణయము చేస్తుంది. లగ్న ఆధారితముగా స్థానము శుభ స్థానమో పాప స్థానమో, గ్రహము శుభ గ్రహమో పాప గ్రహమో అవును.

కావున ఏలినాటి శని ప్రభావము అందరికి కీడు కలిగించదు.

మరి ఏలినాటి శని ఎవరికీ శుభము ఎవరికీ కీడు కలిగిస్తుంది.

శని శుభుడిగా ఉన్న లగ్నములు కలవు అవి వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నములు. ఈ 6 లగ్నములకు శని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. కీడు చేయడు తాను ఉన్న స్థానమును బట్టి చూచెడి స్తానములని బట్టి ఫలము ఇస్తాడు.

గోచార రీత్యా వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్న జాతకులకు శని 12, 1, 2 స్తాములకు వచ్చినప్పుడు శుభాన్నే చేస్తాడు త

ప్ప కీడు చేయడు, కీడు చేస్తాడు అనునది అబద్దము.

శని పాపిగా ఉన్న లగ్నములు కలవు అవి మేష, కటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీన లగ్నములు. ఈ 6 లగ్నముల వారికి శని పాప ఫలమును ప్రసాదిస్తాడు కీడు కలిగిస్తాడు దుఃఖములని కలిగిస్తాడు తప్ప శుభము చేయలేడు. కర్మ ఫలము తప్పక అనుభవింప చేస్తాడు.

గోచార రీత్యా మేష, కటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీన లగ్న జాతకులకు శని 12, 1, 2 స్థాన సంచారము చేసినప్పుదు దుఃఖములని అనుభవింప చేస్తాడు.

శని ఒక్కో రాశిలో ఏడున్నర సంవత్సరములు సంచారము చేస్తాడు. శుబుడైన ఏలినాటి శని దోషము లేదు పాపియైన ఏలినాటి శని కీడు తప్పదు.

*********

శని శుభుడైన వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నము వారికీ ద్వాదశ లగ్న ద్వితీయ సంచారము వలన జీవిత ఆశయములను మెరుగు పరుచును, పోషించును, ఆరోగ్యమును వరూధి చేయును, వ్యాపార ఉద్యోగములను కలిగించును, ధన చలామణి , వాక్ శక్తిని కలిగించును. భార్య భర్తల అనురాగము కలిగించును, ఋణ బాధలు, శత్రు బాధలు తొలగించును, దైవ అనుగ్రహము కలిగించును. సంఘములో పేరు గౌరవము కలిగించును.

శని పాపియైన లగ్నములకు పైన చెపిన దానికి వ్యతిరేకముగా కలిగి బాధించును.

శని దైవ స్వరూపము శని అంటే ఈశ్వరుడే ఈశ్వరుడే శని రూపముగా గ్రహ మండలములో నెలకొని ఉన్నాడు. శని పేరు పెట్టి తిట్టినా, చెడుకు శని పేరు పెట్టి వర్ణించినా, శని పేరు చెప్పి భయమును కలిగించినా పాపము తప్పదు. శనిని అన్న శివున్ని అన్నట్లే.

కావున ఎలి నాటి శని సంచారములో శని శుభుడుగా గల లగ్నముల వారు పూజించి అర్చించిన శుభము, శని ఆశుభుడిగా గల లగ్నముల వారు శని శాంతికి సంకల్పయుతముగా దానము ఇచ్చిన కొంత దోష పరిహారమై బాధ కొంత తాగును కావున సరైన విధముగా పరిహారములు పూజలు చేయిన్చుకోవలెను. శని శుభుడిగా ఉన్న లగ్నముల వారు శనికి పూజ చేయాలి తప్ప దానము చేయరాదు. ఇది గమనించుకోవలసిన ముఖ్య విషయము.

ఏలినాటి శని అంటే భయము అవసరము లేదు. మన కర్మఫలములనే వారు ఇస్తున్నారు తప్ప వారిని దూషించడము మహా పాపము.
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 12-12-2019, 12:43 PM



Users browsing this thread: 3 Guest(s)