Poll: నా కథల్లో ఏది కొనసాగించాలి అనుకుంటున్నారు?
You do not have permission to vote in this poll.
దూలగాడు
13.85%
9 13.85%
బుతుబంగ్లా
15.38%
10 15.38%
ఖర్కోటకుడు
70.77%
46 70.77%
Total 65 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy WBC { వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ }
#10
Wink 
సమయం: ఉదయం 11 గంటలు

స్థలం: పాకిస్తాన్ లో పీసీబీ సెలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్..

అక్కడ మీటింగ్లో అందరూ చాలా ఆదుర్దాగా ఉన్నారు
2023 వరల్డ్ కప్ కి ఇంకా 3 నెలలే సమయం ఉంది.
ఇండియాతో సహా దాదాపు అన్ని దేశాలు తమ తుది జట్లను ప్రకటించేసాయి.

ఈ సారి విజేతలుగా భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తో పాటు ఆస్ట్రేలియా ని అందరూ ప్రతిపాదిస్తున్నారు.

కానీ అనిశ్చితికి, అనూహ్యమైన ఆటతీరుకు నిలయమైన పాక్ ని మాత్రం ఎవరూ సెమీఫైనల్లో ఆడుతుందని కూడా భావించట్లేదు.

ఇంకా దారుణం ఏంటంటే బంగ్లాదేశ్ వంటి చిన్న జట్లకు కూడా పాక్ కన్నా ఎక్కువ విజయావకాశాలు ఉండటం ఆ దేశాన్ని మరింతగా కలవరపెడుతుందని చెప్పాలి.

ఒక ప్రపంచకప్పు 1992లో గెలిచి, 1999లో దాదాపు గెలిచినంత పని చేసిన పాకిస్థాన్ ఇలా పాతాళానికి పడిపోవడం స్వయకృతపరాధమే..

క్రికెట్లో రాజకీయాలు ఆ దేశంలో ఎప్పుడూ ఉండేవే. కానీ ఈ హీన దశ నుండి బయట పడకపోతే ఇక ఈ దేశం కూడా వెస్టిండీస్ జట్టులా అయిపోయే ప్రమాదం లేకపోలేదు.

అందుకే ఈ అత్యవసర సమావేశం.


"మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా?" అడిగాడు చీఫ్ సెలెక్టర్ ఇంజిమామ్.

"వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ని ప్రకటించడానికే కదా?" అడిగాడు ఒక సెలెక్టర్

"అవును" బదులిచ్చాడు ఇంజి.

"దానికేముంది ఇదిగో నా తరపు ముగ్గురు క్రికెటర్లు. మిగిలిన వాళ్ళు కూడా వారి వారి తరపు పేర్లు ఇచ్చేస్తే అందర్నీ కలిపి ప్రకటించేద్దాం." ఇది మనకు అలవాటైన తీరే కదా అన్నట్టు సమాధానమిచ్చాడు ఒక సెలెక్టర్.

మిగిలిన అందరూ అంతేగా అంతేగా అన్నట్టు చూసారు.

"No...." గట్టిగా అరిచి తన కుర్చీ నేలకేసి విసిరికొట్టాడు.
"ఇలా మీ బంధువులు, స్నేహితుల పిల్లలు జట్టులో చేరడానికి కాదు మీరు సెలక్షన్ ప్యానెల్ లో ఉంది. " గట్టిగా అరిచాడు.

" ఇంతకుముందు చేసిందే కదా సర్ మనం చేస్తుంది. ఇందులో కొత్తేముంది?" సర్దిచెప్పాడు ఒక సెలెక్టర్.

"ఉంది. మనకి కావాల్సిన వారు పేరు తెచ్చుకోవడం సంతోషమే. కానీ ఇది ఇలాగే కొనసాగితే మన బోర్డ్ ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. మన దాయాది భారత్ లో గవాస్కర్, కపిల్, సచిన్, ద్రవిడ్, ధోనీ, కోహ్లీ, రోహిత్ ఇలా మ్యాచ్ విన్నర్లు వస్తూనే ఉన్నారు. కానీ మనం ఎవరో ఒక్కరి మీదే ఆధారపడటం, కీలక సమయాల్లో చతికిలపడటం ఒక అలవాటుగా మారిపోయింది"

" భారత్ కి బ్యాటింగ్ బలం, మనకి బౌలింగ్ బలం. ఇది ఎప్పుడూ ఉండేదేగా?"

"కానీ బూమ్రా వచ్చాక వారి బౌలింగ్ స్వరూపమే మారిపోయింది. దానికి తోడు ముగ్గురు ఓపెనర్స్, ముగ్గురు వికెట్ కీపర్స్, ఇద్దరు ఆల్ రౌండర్లు, నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నలుగురు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్లు అంటూ ఎవరూ అందుకోలేని స్థాయిలో ఉన్నారు. వాళ్లే కాదు మిగిలిన దేశాలన్నీ కూడా ఇలా స్పెషలిస్టులతో బరిలోకి దిగుతుంటే మన జట్టు మాత్రం కనీసం కాగితం మీద కూడా బలంగా లేదు." చెప్తున్న ఇంజిమామ్ కళ్ళల్లో ఒక రకమైన భాధ.

"మనకి కూడా బాబర్ అజాం, ఫఖర్ జమాన్ లాంటి ప్రతిభ గల బ్యాట్స్ మన్ ఉన్నారు కదా?" విస్మయంగా అడిగాడు ఒక సెలెక్టర్.

"బ్లడీ హెల్... ప్రతిభ ఉంటే సరిపోదు. పోరాటం కూడా ఉండాలి. నాలో కూడా ప్రతిభ ఉంది. వయసు నేర్పిన అనుభవమూ ఉంది. అలాగని నేను వెళ్ళి ఆడగలనా? నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్ ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తూ అసాధారణ పోరాటం చేసే ఒక బ్యాట్స్ మన్ కావాలి" గుండెల్లో జ్వాల చల్లార్చుకుంటున్నట్టు స్వరం, కోపం రెండూ తగ్గిస్తూ దృఢ నిశ్చయానికి వచ్చిన వాడిలా చెప్పాడు ఇంజిమామ్.

సెలెక్టర్ల మధ్యలో కొంత సమయం మౌనమే రాజ్యమేలింది.

"వరల్డ్ కప్ 3నెలలు కూడా లేని ఈ టైంలో ఇప్పటికిప్పుడు అలాంటి బ్యాట్స్ మన్ ని వెతకడం అంటే ఎలా సర్?" చిన్నగా నసుగుతూ అర్ధోక్తిలో ఆగాడు ఒక సెలెక్టర్.

అది విన్న మిగతా సెలెక్టర్లు కూడా తమ మాట కూడా అదే అన్నట్టుగా ఇంజిమామ్ వైపు చూసారు.
వాళ్లందరిని అదే పనిగా సూటిగా చూస్తున్న ఇంజిమామ్ గుండెల నిండా ఊపిరి తీసుకుని గాఢంగా నిట్టూర్చి చెప్పడం ప్రారంభించాడు.

"My dear friends..  అవును, ఇప్పుడు కష్టమే. ఈ వరల్డ్ కప్ నెగ్గకపోయినా మనకొచ్చే నష్టం లేదు. కానీ సరిగ్గా ఆలోచిస్తే...
నష్టం ఉంది. ఇప్పటికే ఒక టీ20 వరల్డ్ కప్ తప్ప మనదైన ముద్ర వేసిన ఒక్క మేజర్ ఐసీసీ టోర్నమెంట్ అంటూ ఏది ఉంది? ఒక్క గాలివాటం ఛాంపియన్స్ ట్రోఫీ తప్ప?
ఇప్పటికే మన దేశంలో మ్యాచ్ ఆడటానికి ఎవరూ ముందుకు రావడంలేదు. స్పాన్సర్లు కరువయ్యారు.
ఇది వరకు '' దేశం పేరుతో ఎంతో మంది అరబ్ దేశాల ధనవంతులు ఇప్పుడు బంగ్లాదేశ్, అప్గనిస్థాన్ అంటూ తరలిపోతుంటే శత్రు రాజ్యం దండెత్తిన తరువాత నేలమట్టం అయి పాడుబడిన కోటలా నిస్సహాయంగా చూస్తున్నాం.
జీతాలు సరిపోకే కదా? మనలో ఈ అవినీతి, బంధుప్రీతి?
ఇవన్నీ మార్చడానికి ఒక్కడు కావాలి. మన భాధలన్నీ తొలగించేవాడు ఒక్కడు కావాలి.
ఎవడు వాడు? వాడ్ని వెతికి పట్టుకోవాలి అనుకుంటున్నా..
ఇప్పుడు చెప్పండి. చేద్దామా? వద్దా??? ఇక మీ ఇష్టం" అని సర్దుకుని వెళ్లబోతున్న ఇంజిమామ్ ని అక్కడున్న సెలెక్టర్లు అందరూ ముక్తకంఠంతో పిలిచి ఆపారు.


అందులో ఒక సెలెక్టర్ లేచి " సర్ ఇక నుంచి మేం అందరం ఒక్కక్కరుగా విడిపోయి ఒక్కో ఏరియా లో ఉన్న ప్రతి క్రికెటర్ ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు రిపోర్ట్ చేస్తాం సర్" అన్నాడు.

"Good.. ok guys. ఇక మీ పని ఇదే. మీరు ఉక్కుని తీసుకురండి.
దానిని కత్తిగా నేను మారుస్తా.." అంటూ అక్కడి నుంచి వెళ్లడం వెళ్ళడమే ఇంగ్లాండ్ లోని రహస్య పరిశోధనలకు కావాల్సిన గూడ్స్ సప్లై చేసే సీక్రెట్ ఏజెన్సీలో పని చేస్తున్న తన సన్నిహితుడు ఇమాం అహ్మద్ కు ఎవరూ ట్రేస్ చేసే వీలు లేకుండా ఉండే శాటిలైట్ కాల్ చేసాడు.



..............$$$$$................
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 6 users Like naresh2706's post
Like Reply


Messages In This Thread
RE: WBC { వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ } - by naresh2706 - 10-12-2019, 07:57 PM



Users browsing this thread: 7 Guest(s)