02-12-2019, 10:31 PM
(02-12-2019, 10:14 PM)Vikatakavi02 Wrote: ఆకాంక్షగారికి...
మీ కొత్త కథ ప్రారంభం బాగుంది.
మీ గత కథలను నేను చదవలేదు.
అవసరం ఎంతకైనా తెగించేలా చేస్తుంది అంటారు.
మరి వీరి అవసరం వీరిని ఎన్ని చిక్కులతో సహవాసం చేయిస్తుందో మరి!
కథలోని ముఖ్యపాత్రల ఇంట్రొడక్షన్ కలర్ ఫుల్ గా వుంది. అప్పట్లో GP అనే రైటర్ ఈ విధంగానే వ్రాశారు. మీ శైలి వారి శైలిని తలపించింది.
ధన్యవాదములు.
ఇక పైన ఒక మిత్రుడు తెలిపాడు... మీ యీ కథ, కధనం అచ్చంగా లక్ష్మిగారి 'తప్పనిసరై' కథతో కనెక్ట్ అయిందని. ఒకవేళ లైన్ చాలావరకు ఒకటే వున్నా ఆ రైటర్స్ వ్రాసే పద్ధతి వారి శైలిని అనుసరించి వుంటుంది. పైగా, లక్ష్మిగారు వ్రాసేది అనువాద కథ. ఒక ఫార్ములా ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. మీది మీ స్వంతం గనుక ఏ సమస్యా వుండకపోవచ్చు.
ధన్యవాదములు
మరియు శుభాభినందనలు
ఆల్ ద బెస్ట్
చాలా సంతోషం కవి గారు. మీరు కామెంట్ చేసినందుకు. కొద్దిగా డిస్సపాయింట్ అయ్యాను. మీరు నా కథలు ఏవి చదవలేదు అన్నందుకు. వీలు చేసుకుని చదవగలరని మనవి.
ఇక కథ గురుంచి చెప్పాలంటే లక్ష్మి గారు రాస్తున్న కథకు నేను రాస్తున్న కథకు ఎలాంటి సంబంధం ఉండదు. అది అనువాద కథ అయినా లక్ష్మి గారు తనదయిన శైలితో చాలా చక్కగా రాస్తున్నారు. చాలామంది లక్ష్మి గారితో నన్ను పోలుస్తున్నారు. నేను అంత పెద్ద రచయితను కాదు అని అందరు గుర్తించాలి. నాకు అంతగా తెలుగు రాదు. ఇంకా ఈ కథ గురుంచి చెప్పాలంటే ఇదీ చాలా చిన్న కథ. మహా అయితే రెండు లేదా మూడు అప్డేట్స్ లో అయిపోతుంది.
ధన్యవాదములు.