23-01-2019, 04:48 PM
(23-01-2019, 04:11 PM)Vikatakavi02 Wrote: కేన్సర్‌తోపాటు 50 రకాల ఔషధాలు ఇక చౌక...ప్రధానమంత్రి మోదీ నిర్ణయం
23-01-2019 11:06:50
న్యూఢిల్లీ : కేన్సర్‌తోపాటు 50 రకాల అరుదైన వ్యాధుల నివారణకు వినియోగించే ఔషధాలను చౌకగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయించారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేర 39 రకాల యాంటీ కేన్సర్, ఇతర అరుదైన వ్యాధుల నివారణకు వినియోగించే ఔషధాల ధరలను నియంత్రించి తక్కువ ధరలకు రోగులకు అందించాలని వైద్య సర్వీసుల శాఖ డైరెక్టరు జనరల్ నిర్ణయించారు. హోల్ సేల్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, కెమిస్టులు అధిక ధరలకు 50 రకాల ఔషధాలను విక్రయించకుండా నియంత్రించనున్నారు. కేన్సర్ తోపాటు పలు అరుదైన వ్యాధులకు వాడుతున్న మందులపై లాభాన్ని తగ్గించడం ద్వార ధరలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది.
Idi manchi nirnayamu prajalaku entho prayojanamu.